YS Vivekananda Reddy Case: వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి ఆరేళ్లకు పైగా అయ్యింది. మంత్రిగా ఎంపీగా.. ఎమ్మెల్యేగా.. వైఎస్ఆర్ కు తమ్ముడు, వైఎస్ జగన్ కు బాబాయి హత్యకు గురి అయితే ఇంతవరకూ చంపింది ఎవరు అన్నది కనిపెట్టలేకపోయారు.
మొదట గుండెపోటు అని.. తర్వాత చంద్రబాబునే హంతకుడు అని చిత్రీకరించారు. మరికొన్నాళ్లకు కన్న కూతురే చంపించిందని నెపం వేశారు. సొంత బాబాయి హత్యకు గురైతే ఆయన అక్రమ సంబంధాలు బయటపెట్టారు. రెండో పెళ్లాం ఉందని.. ఆ ఆస్తి తగాదాలతోనే చంపారని ప్రొజెక్ట్ చేశారు.
ఇంతటితోనే ఈ కేసు ఆగలేదు. సీబీఐ అధికారులను బెదిరించారు. వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయబోతే పోలీసులు సహకరించలేదు.
వైఎస్ వివేకా హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారు. ఆధారాలు కనిపించకుండా చేశారు. అప్పటి అధికారంలో ఉన్న వైఎస్ జగన్ ప్రభుత్వం నానా రకాల ప్రయత్నాలు చేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ కేసులో చేతులు ఎత్తేసింది.
తండ్రిని పోగొట్టుకున్న ఓ కూతురు పడే వేదనకు ముగింపు ఎప్పుడు? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
