TDP: తెలుగుదేశం పార్టీలో చాలామంది ఒక వెలుగు వెలిగారు. ఎన్టీఆర్ తో( Nandamuri Taraka Rama Rao) పాటు చంద్రబాబుతో( Chandrababu) సన్నిహితంగా ఉండే చాలామంది నేతలు పార్టీలో తమదైన ముద్ర వేసుకున్నారు. కానీ రాజకీయంగా వారు తీసుకున్న నిర్ణయాలతో చాలా నష్టపోయారు. అదే సమయంలో పార్టీని విభేదించి అగ్రస్థానం పొందిన వారు కూడా ఉన్నారు. కల్వకుంట చంద్రశేఖర్ రావు( kalvakunta Chandrashekhar) అలియాస్ కెసిఆర్ కూడా టిడిపి తో విభేదించిన వారే. 1999లో చంద్రబాబు( Chandrababu) ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి రాగలిగారు. ఆ సమయంలో కేసీఆర్ మంత్రి పదవి ఆశించారు. కానీ చంద్రబాబు ఇచ్చేందుకు మొగ్గు చూపలేదు. దీంతో పార్టీ నుంచి బయటకు వెళ్లి ప్రత్యేక తెలంగాణ( special Telangana) నినాదాన్ని అందుకున్నారు. టిఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారు. సుదీర్ఘకాలం పోరాడి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. వరుసగా రెండుసార్లు తెలంగాణ సీఎం కాగలిగారు.
* ఒక వెలుగు వెలిగిన నాయకులు
తెలుగుదేశం పార్టీలో దేవేందర్ గౌడ్( Devendra Goud ), ఉపేంద్ర, గాలి ముద్దుకృష్ణమనాయుడు వంటి నేతలు ఒక వెలుగు వెలిగారు. కానీ పార్టీని విభేదించిన తర్వాత జీరోలయ్యారు. పార్టీలో బీసీ నేతగా, నెంబర్ 2 స్థానాన్ని ఆక్రమించారు దేవేందర్ గౌడ్. కానీ ఎందుకో ఆయన తప్పటడుగులు వేశారు. చిరంజీవిని( megastar Chiranjeevi) నమ్మి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అటు తరువాత రాజకీయంగా ఫేడ్ అయ్యారు. కనీసం ఉనికిలో లేకుండా పోయారు. ఉపేంద్ర లాంటి నేతలు టిడిపిని వదిలి కాంగ్రెస్ పార్టీలో కొద్దికాలం పాటే రాణించగలిగారు.
* టిడిపి విభేదించిన నాయకులకు..
అయితే టిడిపిని విభేదించి ఆ స్థాయికి వెళ్లిన నేతలు చాలా తక్కువ. మరికొందరు జీరో అయ్యారు కూడా. వైసిపి ఆవిర్భవించిన తర్వాత ఆ పార్టీలోకి వెళ్లారు మాజీ మంత్రులు దాడి వీరభద్రరావు( Dadi Veerabhadra) ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు( Umma Reddy venkateswaralu) . వీరిద్దరూ చంద్రబాబుకు సమకాలీకులే. కానీ ఇద్దరికీ ఎటువంటి ఛాన్స్ ఇవ్వలేదు జగన్. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కు కనీసం ఎమ్మెల్సీ చాన్స్ అయినా ఇచ్చారు. కానీ దాడి వీరభద్ర రావు విషయంలో మాత్రం పెద్దరికాన్ని గౌరవించలేదు. కేవలం చంద్రబాబు ఎమ్మెల్సీ పదవిని కొనసాగించ లేదన్న కారణంతోనే దాడి వీరభద్రరావు వైసీపీలో చేరారు. దాదాపు పది సంవత్సరాలపాటు ఆయన వైసీపీలో ఉన్న జగన్ ( Jagan Mohan Reddy) కనికరించిన పాపాన పోలేదు. ఇప్పుడు అదే దాడి వీరభద్రరావు తిరిగి మాతృ పార్టీలో చేరారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గురించి చెప్పనవసరం లేదు. ఆయన సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు.
* క్రియాశీలక రాజకీయాలకు దూరంగా
టిడిపి ప్రారంభం నుంచి ఉన్న అశోక్ గజపతిరాజు( Ashok gajapathi Raj), యనమల రామకృష్ణుడు, పతివాడ నారాయణ స్వామి నాయుడు, కేఈ కృష్ణమూర్తి, గౌతు శ్యామసుందర శివాజీ, గుండ అప్పల సూర్యనారాయణ, వడ్డే శోభనాద్రిశ్వరరావు, ప్రతిభా భారతి ఇలా చెప్పుకుంటే పోతే చాలామంది నేతలు క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. వారి వారసులను రంగంలోకి దించి విశ్రాంతి తీసుకుంటున్నారు. మొత్తానికైతే టిడిపిలో( Telugu Desam Party) ఒక శకం ముగిసినట్లే. ఇప్పుడంతా జూనియర్లు తెరపైకి వచ్చి రాజకీయం చేస్తున్నారు. నడివయస్కులైన నేతలు సీనియర్లుగా మారారు. జూనియర్లకు మార్గదర్శకం చేస్తున్నారు.