Amrit Bharat Scheme: ఇండియన్ రైల్వే( Indian Railway) సరికొత్త సంస్కరణలతో ముందుకెళ్తోంది. ప్రయాణికులకు మెరుగైన వసతుల కల్పనకు అనేక విధాలుగా కృషి చేస్తోంది. ఎప్పటికీ అమృత్ భారత్ లో భాగంగా రైల్వే స్టేషన్ల ఆధునీకరణ.. ప్రత్యేక రైల్వే లైన్ల ఏర్పాటు వంటివి చేపడుతోంది. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రయాణ టికెట్ల రూపంలోనే కాకుండా.. ఇతర సదుపాయాల ద్వారా కూడా ఆదాయం సమకూర్చుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగా రైల్వే స్లీపింగ్ ప్యాడ్స్ ద్వారా ప్రయాణికులకు కొత్త సౌకర్యాన్ని కల్పిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ కొత్త విధానాన్ని విస్తరిస్తోంది. అందులో భాగంగా ఏపీకి సైతం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే దక్షిణ కోస్తా రైల్వే జోన్ ను విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఈ స్లీపింగ్ ప్యాడ్స్ కూడా విశాఖలోనే అందుబాటులోకి తెచ్చింది. దీంతో ప్రయాణికులకు మెరుగైన వసతులు దక్కనున్నాయి.
ప్రయాణికుల కోసమే
సాధారణంగా రైల్వే ప్రయాణంలో భాగంగా చాలామంది ప్రయాణికులు రైల్వే స్టేషన్ లో వేచి ఉండాల్సి ఉంటుంది. ప్రస్తుతం పర్యాటక రంగంలో విశాఖ( Visakhapatnam) అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోంది. దేశం నలుమూలల నుంచి ప్రయాణికులు, సందర్శకులు పెద్ద ఎత్తున వస్తుంటారు. అటువంటి వారి కోసమే సెంట్రల్ ఏసి సదుపాయంతో విశాఖ రైల్వే స్టేషన్ లో ఈ స్లీపింగ్ ప్యాడ్స్ ఏర్పాటు చేశారు. మహిళలకు, పురుషులకు వేర్వేరుగా ఇవి అందుబాటులో ఉంటాయి. వేడినీరుతో పాటు వైఫై సదుపాయం కూడా ఉంటుంది. ఆధునిక వస్తువులతో ఏర్పాటు చేసిన ఈ స్లీపింగ్ ప్యాడ్స్ తక్కువ ధరలకే అందుబాటులోకి తెచ్చింది రైల్వే శాఖ. వాస్తవంగా వీటిని క్యాప్సూల్స్ హోటల్స్ అంటారు. తొలుత జపాన్ లో ప్రారంభమయింది ఈ వ్యవస్థ. క్రమేపి ప్రపంచమంతా విస్తరించింది. తూర్పు కోస్తా రైల్వే జోన్ లో తొలిసారి ఈ రకమైన వసతి ఏర్పాటు చేశారు. ఇప్పుడు విశాఖ కేంద్రంగా ఏర్పడిన దక్షిణ కోస్తా జోన్లో ఏర్పాటు చేయడం విశేషం.
Also Read: ముగ్గురు పిల్లల కంటే ఎక్కువ మందిని కంటేనే వాళ్ళే నిజమైన దేశ భక్తులు
ఒకటో నెంబర్ ప్లాట్ ఫామ్ పై అంతస్తులో..
విశాఖలోని రైల్వే స్టేషన్ ఒకటో నెంబర్ ప్లాట్ ఫామ్( platform number 1 ) దగ్గర ఒకటో అంతస్తు పై ఈ స్లీపింగ్ ప్యాడ్స్ అందుబాటులో ఉన్నాయి. రెండు గంటలకు రూ.200, రోజంతా ఉంటే రూ.400 దీనికోసం వసూలు చేస్తారు. విశాఖ రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసిన ఈ స్లీపింగ్ ప్యాడ్స్ ప్రయాణికులకు మెరుగైన వసతి కల్పించనుంది. వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. సాధారణంగా రైల్వే ప్రయాణికులు విశ్రాంతి తీసుకునేందుకు ప్రైవేటు లాడ్జిలను ఆశ్రయిస్తుంటారు. అక్కడ అసౌకర్యాల నడుమ గడపాల్సి ఉంటుంది. అందుకే ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే శాఖ ఈ స్లీపింగ్ ప్యాడ్స్ అందుబాటులోకి తెచ్చింది. రైల్వే ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
విశాఖ రైల్వే స్టేషన్ లో అందుబాటులోకి క్యాప్సుల్ హోటల్. నగరం నుంచి రాకపోకలు సాగించే ప్రయాణీకులు కోసం గంటల ప్రాతిపదికన సింగిల్, డబుల్ బెడ్ రూమ్స్.#AndhraPradesh #Vizag #Visakhapatnam #TeluguNews #VizagNews pic.twitter.com/avmUZtuIb2
— Vizag News Man (@VizagNewsman) July 10, 2025