Ambati Rambabu : ఈమధ్య కాలంలో వైసీపీ నాయకులు చేస్తున్న కామెంట్స్ పై , ప్రవర్తిస్తున్న తీరుపై జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. మాజీ సీఎం జగన్ నుండి అంబటి రాంబాబు వరకు ఎవ్వరూ కూడా జనాల చేత ప్రశంసింపబడే పనులు చేయడం లేదు. రీసెంట్ గా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడే ప్రశ్న రావణ్ కి సపోర్టుగా నిలిచారు. అరెస్ట్ అయ్యి జైలు లో ఉన్న అతనికి లాయర్లను కూడా ఏర్పాటు చేసింది వైసీపీ పార్టీ. పైగా అంబటి రాంబాబు ఈ ఆధునిక యుగంలో రావణుడిదే విజయం , అతన్ని గెలిపించుకొని తీరుతాం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అంబటి రాంబాబు. అవును రావణ్ వెనుక మేము ఉన్నాం అంటూ పబ్లిక్ గా ప్రెస్ మీట్ పెట్టి మరీ సపోర్ట్ చేశారు అంబటి రాంబాబు. జనాలు దీనిపై తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
మరో పక్క సున్నితమైన అంశంలో వైసీపీ పార్టీ కి చెందిన మాజీ మంత్రి పేర్ని చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలను చూస్తే అసలు వీళ్ళు మనుషులేనా అనే భావం రాక తప్పదు. వరంగల్ కి చెందిన నిరంజన్ అనే యువకుడు జెన్యు సంబంధిత వ్యాధి తో బాధపడుతూ , చివరి రోజుల్లో తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ ని కలవాలని ఉందని చెప్పడం తో , పవన్ కళ్యాణ్ అతన్ని కలిశారు. దీనిపై పేర్ని నాని అప్పట్లో స్పందిస్తూ ‘వాడెవడో నాకు ఒంట్లో బాగాలేదు అన్నయ్యా అన్నాడట, వస్తున్నా తమ్ముడు అంటూ ఈయన వెళ్ళాడు’ అంటూ విమర్శించారు. పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లిన వారం రోజులకే నిరంజన్ చనిపోయారు. ఇప్పుడు అతని తల్లిదండ్రులు కూడా పేర్ని నాని పై మండిపడుతున్నారు. ఈ అంశం లో వైసీపీ పార్టీ పై తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది. ఇక అంబటి రాంబాబు నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి పై సెటైర్లు కురిపించాడు.
పదేళ్ల నుండి భుజాల నొప్పి తో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ , ఇప్పుడు తీవ్ర రూపం దాల్చడంతో ముంబై లోని అంబానీ హాస్పిటల్ లో సర్జరీ చేయించుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు , వీడియోలు కూడా సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. దీనిపై అంబటి రాంబాబు మాట్లాడుతూ ‘భుజాలు నొప్పిగా ఉన్నాయి అంటగా , మరి ఎందుకు నొప్పి వచ్చిందో మాకు తెలియదు. ఒకరోజు మా తల్లిగారికి సీరియస్ గా ఉందని వెళ్ళాడు. ఇవాళ ఏమో ముంబై హాస్పిటల్ కి వెళ్ళిపోయాడు. ఈ నాటకాలేంటో , వాళ్ళ మధ్య ఏమి జరుగుతుందో మాకేమి తెలుసు , మీకే తెలియాలి’ అంటూ అంబటి రాంబాబు చేసిన కామెంట్స్ పై సోషల్ మీడియా లో ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సర్జరీ చేయించుకున్నది కళ్ళకు కనిపిస్తోంది , అయినప్పటికీ కూడా మానవత్వం మర్చిపోయి , అంబటి రాంబాబు చేస్తున్న ఈ కామెంట్స్ అతని దిగజారుడు తనానికి నిదర్శనం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
కళ్ళ ముందు కనిపిస్తున్నా ఇంకా @PawanKalyan గారి మీద ఎంత కాలం ఏడుస్తావు @AmbatiRambabu.
కళ్యాణ్ చేతికి అంత పెద్ద ఆపరేషన్( 3 గంటలు) జరిగిన నాటకం అని ఎలా వాగుతావు, నోరేనా అది . @JSPShatagniTeam@JanaSenaParty pic.twitter.com/DWEqSHVyVt— phani. (@phani0653857706) July 13, 2026
