Amaravati Re Launch: అమరావతి రాజధాని( Amravati capital ) పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ పనులను ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు గురించి పలు వ్యాఖ్యలు చేశారు. పవన్ విషయంలో కూడా ప్రస్తావన చేశారు. అందరం కలిసి నడుద్దామని.. ఏపీ అభివృద్ధికి అందరం పాటు పడదామని పిలుపునిచ్చారు. కాగా అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి చాలామంది ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గైర్హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి సైతం కార్యక్రమానికి హాజరు కాలేదు. అయితే చిరంజీవి హాజరవుతారని.. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. కానీ చిరంజీవి హాజరు కాకపోయేసరికి అభిమానుల్లో నిరాశ వ్యక్తం అయింది. అయితే చిరంజీవి గైర్హాజరు కావడానికి చాలా కారణాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం అయితే ప్రారంభం అయింది.
Also Read: పాత ఫోన్‌కు కొత్త లైఫ్.. సీసీటీవీ, మ్యూజిక్ ప్లేయర్, లెర్నింగ్ టూల్‌గా మార్చేయండి!
* మెగాస్టార్ హాజరుపై అంచనాలు
మెగాస్టార్ చిరంజీవి( megastar Chiranjeevi) హాజరు పై భారీ అంచనాలు ఉండేవి. ముఖ్యమంత్రితో పాటు మంత్రుల ప్రమాణ స్వీకార వేడుకలకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి కూడా పాల్గొన్నారు. మెగా బ్రదర్స్ ఇద్దరితో అభివాదం చేస్తూ హల్చల్ చేశారు. అటు తర్వాత మెగాస్టార్ చిరంజీవి ప్రధాని నరేంద్ర మోడీతో వేడుకలు పంచుకున్న సందర్భాలు ఉన్నాయి. మెగా కుటుంబం విషయంలో మోదీ ప్రత్యేక అభిమానం చూపుతూ వచ్చారు. దీంతో తప్పకుండా అమరావతి పునర్నిర్మాణ ప్రారంభోత్సవ వేడుకలకు చిరంజీవి హాజరవుతారని అంతా భావించారు. కానీ చిరంజీవి మాత్రం హాజరు కాలేదు. బొంబాయిలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో చిరంజీవి పాల్గొన్నారు. దీంతో చిరంజీవి గైర్హాజరపై సోషల్ మీడియా వేదికగా రకరకాల చర్చ నడుస్తోంది.
* ప్రధానితో వేదికలు పంచుకొని..
గత వైసిపి ప్రభుత్వ హయాంలో భీమవరంలో( Bhimavaram) అల్లూరి విగ్రహ ఆవిష్కరణ జరిగింది. క్షత్రియ సమాజం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి కంటే చిరంజీవికి అధిక ప్రాధాన్యమిచ్చారు నరేంద్ర మోడీ. దీంతో చిరంజీవి బిజెపికి దగ్గరవుతున్నట్లు ప్రచారం జరిగింది. ఒకానొక దశలో రాజ్యసభకు చిరంజీవి ప్రమోట్ అవుతారని టాక్ నడిచింది. కానీ మరోసారి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని చిరంజీవి తేల్చి చెప్పారు. అదే సమయంలో తమ్ముడు పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలిచారు. చంద్రబాబు విషయంలో సానుకూల ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. ఇటీవల చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు.
* నాడు మూడు రాజధానులకు ఆహ్వానం..
అయితే అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి చిరంజీవి( megastar Chiranjeevi) గైర్హాజరు కావడంపై రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి. అమరావతి విషయంలో గతంలో చిరంజీవి వ్యాఖ్యానాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయాన్ని అభినందించారు చిరంజీవి. పైగా అమరావతి నిర్మాణానికి రైతుల నుంచి భూమి సేకరించడాన్ని నాడు చిరంజీవి తప్పు పట్టారు. ఈ కారణాలతోనే అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు చిరంజీవి హాజరు కాలేదని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది. ఎంతటి వేడుకలకు ప్రత్యేక ఆహ్వానం అందింది చిరంజీవికి. అయితే కార్యక్రమానికి హాజరు కాకపోయినా సోషల్ మీడియాలో స్పందిస్తారని కూడా అంతా ఆశించారు. కానీ అటువంటిదేమీ లేకపోవడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.
Also Read: అర్జెంటీనాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలతో దక్షిణ అమెరికా అప్రమత్తం