Amaravati HUDCO Convention: అమరావతి రాజధాని( Amravati capital ) నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీలైనంత త్వరగా అమరావతికి ఒక రూపం తేవాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వం సైతం తమ వంతు సహకారం సంపూర్ణంగా అందిస్తోంది. పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా వస్తున్నాయి. ప్రపంచ దిగ్గజ సంస్థలు సైతం అమరావతిలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సన్నద్ధం అవుతున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు తమ నిర్మాణాలు ప్రారంభించేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా అమరావతిలో హడ్కో ఒక కన్వెన్షన్ సెంటర్ నిర్మించనుంది. కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఈ విషయాన్ని తెలుపుతూ కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కు లేఖ రాశారు.
Also Read: అమరావతి నిర్మాణం పెద్ద టాస్క్.. చంద్రబాబు ఏం చేయనున్నారు?
ప్రత్యేక ఆకర్షణగా..
అమరావతిలో హడ్కో కన్వెన్షన్ సెంటర్( hardco convention centre) అనేది ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఢిల్లీలోని హాబిటెడ్ సెంటర్ మాదిరిగా ఉండనుంది. ఈ సెంటర్ వివిధ కార్యాలయాల ఏర్పాటుకు ఉపయోగపడనుంది. ప్రపంచస్థాయి సౌకర్యాలు ఇందులో అందుబాటులోకి రానున్నాయి. గృహ నిర్మాణం తో పాటు పట్టణాభివృద్ధిలో శిక్షణ కార్యక్రమాలు కూడా ఇక్కడే జరగనున్నాయి. ఇది జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు ఫైనాన్సర్ గా కూడా మారనుంది. ఈ కన్వెన్షన్ సెంటర్లో హాల్స్, అతిధుల కోసం ఏర్పాట్లు పక్కాగా చేయనున్నారు. ఇది పెట్టుబడులను ఆకర్షిస్తుందని, ఆర్థిక రంగాన్ని మరింత బలోపేతం చేస్తుందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పుకొచ్చారు.
Also Read: అమరావతికి కేంద్రం మరో గొప్పవరం.. ఎవ్వరూ ఊహించని గిఫ్ట్ ఇచ్చిన మోడీ సర్కార్
మరో రెండు ఎకరాలు సైతం..
ఇప్పటికే అమరావతిలో ఈ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు సీఆర్డీఏ( crda) 8 ఎకరాల భూమిని కేటాయించింది. అయితే మొత్తం పది ఎకరాల భూమి అవసరం కానుంది. మరో రెండు ఎకరాలు కేటాయించేందుకు ఉన్న అవకాశాలను ఏపీ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఎకరం నాలుగు కోట్ల రూపాయల చొప్పున కొనుగోలు చేసి.. కన్వెన్షన్ సెంటర్ నిర్మిస్తామని కేంద్రమంత్రి ఖట్టర్ తెలిపారు. ఇప్పటికే ప్రైవేటు రంగానికి సంబంధించిన సంస్థలు సైతం అమరావతిలో తమ నిర్మాణ పనులను ప్రారంభించాయి. కొద్దిరోజుల కిందటే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులను ప్రారంభించారు చైర్మన్ నందమూరి బాలకృష్ణ. ఏకకాలంలో ప్రభుత్వ, ప్రైవేటు నిర్మాణాలకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని సీఆర్డీఏ భావిస్తోంది. అందులో భాగంగా ఈ ప్రతిష్టాత్మక హడ్కో కన్వెన్షన్ సెంటర్ అమరావతికి రానుంది.