Amaravati Drone Summit 2024: డ్రోన్ ఉపయోగాలు : ఆయుధం అదే.. ఆత్మాహుతి బాంబర్ అదే.. సాయం చేసే గొప్ప యంత్రం అదే..

డ్రోన్లు.. స్వయం ప్రతిపత్తి నుంచి మొదలు పెడితే అధునాతన స్వయం ప్రతిపత్తి వరకు విస్తరించాయి.. డ్రోన్ల గమనాన్ని సెన్సార్లు, LiDAR డిటెక్టర్ల వ్యవస్థ నిర్దేశిస్తాయి. వేరువేరు డ్రోన్లు వేరువేరు ఎత్తులు, దూరాల్లో ప్రేమిస్తాయి. దగ్గరి శ్రేణి డ్రోన్లు మూడు మైళ్ళ వరకు ప్రయాణించగలుగుతాయి..

Written By: Anabothula Bhaskar, Updated On : October 23, 2024 10:20 am

Amaravati Drone Summit(3)

Follow us on

Amaravati Drone Summit 2024: వెనుకటి పౌరాణిక సినిమాలు చూశారా.. అందులో కథానాయకుడి పాత్రధారి ఒక బాణం వేస్తే అది గాల్లో తేలుకుంటూ రకరకాల మార్పులకు గురవుతుంటూ.. లక్ష్యాన్ని చేదిస్తుంది. అవసరమైతే మంట పుట్టించే అగ్ని అవుతుంది. లేకుంటే దాన్ని చల్లార్చి నీరు అవుతుంది. మొత్తంగా బాణం సంధించే కథానాయకుడి మనో వాంఛ ఆధారంగా అది మారుతూ ఉంటుంది.

నేటి సాంకేతిక కాలానికి పై ఉపోద్ఘాతాన్ని అనుసంధానిస్తే.. అది డ్రోన్ అవుతుంది. ఇటీవలి రష్యా – ఉక్రెయిన్ యుద్ధంలో డ్రోన్లు కీలకపాత్ర పోషించాయి. ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల వర్షం కురిపిస్తే.. ఉక్రెయిన్ల డ్రోన్ల ద్వారా దాడి చేసింది. స్వల్ప ఖర్చుతో తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. ఇరాన్ పై సాగిస్తున్న యుద్ధంలో, హమాస్, హిజ్ బొల్లా ఉగ్రవాద సంస్థలపై చేస్తున్న దాడుల్లో ఇజ్రాయిల్ లెక్కకు మిక్కిలి డ్రోన్లను ఉపయోగించింది. వాటిని ఏకంగా ఆత్మహుతి బాంబర్లుగా ఉపయోగించి వారిని మట్టుపెట్టింది.. ఇలా చెప్పుకుంటూ పోతే నేటి సాంకేతిక కాలంలో డ్రోన్లు చేస్తున్న పనులు వర్ణనకు అందవు.. అంతరిక్ష ప్రయోగాల నుంచి మొదలు పెడితే క్లిష్టమైన ఆపరేషన్ల వరకు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు..

500 బిలియన్ డాలర్లకు..

డ్రోన్ల పరిశ్రమ 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంతర్జాతీయ మీడియా కథనం ద్వారా తెలుస్తోంది. మానవ రహిత విమానాలుగా పేరుపొందిన డ్రోన్లు ఇటీవల కాలంలో అనేక పనులలో పాలు పంచుకుంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు, భూ ఉపరితలం, వ్యవసాయం, నిర్మాణం, నిఘా విభాగాలలో డ్రోన్ల వినియోగం తారాస్థాయికి చేరుకుంది.. రద్దీ సమయంలో వేగంగా డెలివరీలు చేయడానికి.. సైనిక స్థావరాలలో వివిధ రకాల సర్వేలు చేయడానికి డ్రోన్లను ఉపయోగిస్తున్నారు.. అయితే డ్రోన్లు ఈనాటివి కావని.. వాటి వినియోగం గత రెండు దశాబ్దాలు నుంచే ప్రారంభమైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొదటి ప్రపంచ యుద్ధంలో డ్రోన్ల ఉనికి ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అమెరికా, ఫ్రాన్స్ మానవ రహిత విమానాలను తయారు చేయడంలో అప్పుడు సఫలీకృతమయ్యాయి. ఆ తర్వాత అది డ్రోన్ తయారీకి అడుగులు పడేలా చేసింది..

ఇలా పనిచేస్తాయి

డ్రోన్లు.. స్వయం ప్రతిపత్తి నుంచి మొదలు పెడితే అధునాతన స్వయం ప్రతిపత్తి వరకు విస్తరించాయి.. డ్రోన్ల గమనాన్ని సెన్సార్లు, LiDAR డిటెక్టర్ల వ్యవస్థ నిర్దేశిస్తాయి. వేరువేరు డ్రోన్లు వేరువేరు ఎత్తులు, దూరాల్లో ప్రేమిస్తాయి. దగ్గరి శ్రేణి డ్రోన్లు మూడు మైళ్ళ వరకు ప్రయాణించగలుగుతాయి.. సైనిక విభాగాలలో వాడే డ్రోన్లు 30 మైళ్ళ వరకు ప్రయాణించగలుగుతాయి.. 90 మైళ్ళ వరకు వెళ్లగలిగే డ్రోన్లను గూడ చర్యం, సమాచార సేకరణ కోసం ఉపయోగిస్తారు. శాస్త్రీయ అధ్యయనాలు, వాతావరణ పరిశోధన కోసం 400 మైళ్ళ పరిధిలోకి వెళ్లి రాగలిగే డ్రోన్లను ఉపయోగిస్తారు. అత్యంత అరుదైన పనులు చేపట్టడానికి ఉపయోగించే డ్రోన్లు 400 మైళ్ల వరకు ప్రయాణిస్తాయి. ఇవి మూడు వేల అడుగుల ఎత్తువరకు ఎగర గలుగుతాయి.

రిమోట్ తో నియంత్రణ

డ్రోన్లను రిమోట్ ద్వారా నియంత్రించవచ్చు. అత్యంత కష్టతరమైన పనుల్లో సహాయానికి ఉపయోగించవచ్చు. తుఫాన్లు ఏర్పడినప్పుడు, అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడు, యుద్ధాలు జరిగినప్పుడు.. ఈ డ్రోన్ల ద్వారా సహాయక చర్యలను చేపట్టవచ్చు. ఇటీవల కాలంలో వరద ప్రభావిత ప్రాంతాలలో డ్రోన్ల ద్వారా సహాయక చర్యలను చేపట్టడం పెరిగిపోయింది. జర్నలిజం, ఏరియల్ ఫోటోగ్రఫీ, ఎక్స్ ప్రెస్ షిప్పింగ్, డెలివరీ, శోధన, రెస్క్యూ వంటి విభాగాలలో డ్రోన్ల వాడకం పెరిగింది.. భౌగోళిక మ్యాపింగ్, భద్రతా తనిఖీలు, ఖచ్చితమైన పంట పర్యవేక్షణ, మానవ రహిత కార్గో రవాణా, సరిహద్దుల్లో నియంత్రణ, నిఘా, తుఫాన్ ట్రాకింగ్, హరికేన్, టోర్నడోలను అంచనా వేయడం వంటి కార్యకలాపాలలో డ్రోన్లను వినియోగిస్తున్నారు.

1940 సంవత్సరంలో..

1940 సంవత్సరంలోనే బ్రిటిష్, అమెరికన్ దళాలు ప్రపంచంపై పెత్తనం చేసేందుకు డ్రోన్ అనే వ్యవస్థను తెరపైకి తీసుకొచ్చినట్టు అధ్యయనాల ద్వారా తెలుస్తోంది.. అయితే అప్పట్లో ఈ దేశాలు గూడ చర్య కోసం వాటిని ఉపయోగించాయని సమాచారం.. ప్రస్తుత డ్రోన్లు థర్మల్ ఇమేజింగ్, లేజర్ రేంజ్ ఫైండర్, ఎయిర్ స్ట్రైకర్, ఇన్స్ట్రుమెంట్ తో అత్యంత ఆధునికంగా కనిపిస్తున్నాయి. MQ -9 రీపర్ అనే సైనిక డ్రోన్ పొడవు 36 అడుగులు. ఇది 50వేల అడుగుల ఎత్తు ఎగర గలదు. వివిధ రకాల క్షిపణులను మోసుకెళ్లగలరు. గూడచార సేకరణ వ్యవస్థలో కీలక పాత్ర పోషించగలదు.