Amaravati Drone Summit 2024: మొన్న ద్వాక్రా..నిన్న ఐటి.. నేడు డ్రోన్.. చంద్రబాబు ఆలోచనకు హ్యాట్సాఫ్

చంద్రబాబు ఆలోచనలు అందరికంటే భిన్నంగా ఉంటాయి. ఇది చాలా సందర్భాల్లో నిరూపితం అయ్యింది. 1995లో సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టారు. మహిళల స్వయం సమృద్ధికి డ్వాక్రా సంఘాలు, యువతకు ఉద్యోగాల కోసం ఐటీ ని ప్రోత్సహించారు. ఇప్పుడు కొత్తగా డ్రోన్ల వ్యవస్థపై పడ్డారు.

Written By: Dharma, Updated On : October 23, 2024 1:18 pm

Amaravati Drone Summit 2024(3)

Follow us on

Amaravati Drone Summit 2024: ఇండియన్ మోస్ట్ సీనియర్ లీడర్ నారా చంద్రబాబు నాయుడు.రాజకీయాల్లో ప్రతి నాయకుడికి విభిన్న పార్శ్యాలు ఉంటాయి. రాజకీయంగా చాలా రకాల విమర్శలు ఉంటాయి.అపవాదులు వస్తాయి. అవి సర్వసాధారణం కూడా. అయితే చంద్రబాబుపై అనుకూలతలు అధికం. ఆయన లెక్క వేరేగా ఉంటుంది. ఆలోచన ముందు తరానికి ప్రయోజనం చేకూర్చేలా ఉంటుంది. 20 సంవత్సరాల ముందు చూపుతో ఆయన ఆలోచనలు ఉంటాయి. ప్రస్తుతం ఏడు పదుల వయసులో ఉన్న ఆయన..తరగని ఉత్సాహంతో పనిచేస్తున్నారు.రాష్ట్రానికి ఏదో చేయాలన్న తపన ఆయనలో కనిపిస్తోంది.అయితే మిగిలిన రాష్ట్రాలకు భిన్నంగా.. మిగతా రాష్ట్రాల సీఎంల ఆలోచనలకు ఏమాత్రం పోలిక లేని స్థాయిలో ఆయన విజన్ ఉంటుంది. ఒక డ్వాక్రా సంఘాల స్వయం ఉపాధి ఆలోచన అయినా.. హైదరాబాదులో ఐటి అభివృద్ధి అయినా..ఆయన ముందస్తు ఆలోచనలు మంచి ఫలితాలు ఇచ్చాయి.ఈరోజు దేశంలోనే హైదరాబాద్ మహానగరం వైపు అందరి చూపు ఉందంటే.. అందుకు ముమ్మాటికీ కారణం చంద్రబాబు. ఐటీ కి హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్ గా మారిందంటే దాని వెనుక చంద్రబాబు దార్శనికత ఉంది. గతంలో ఆ స్థానంలో బెంగళూరు ఉండేది. దానిని మైమరిపిస్తూ హైదరాబాద్ ఐటీ కి స్వర్గధామం గా నిలిచింది. అయితే అది ఇప్పటికి ఇప్పుడు సాధ్యమయ్యేది కాదు. అది చంద్రబాబు వేసిన పునాది వల్లే సాధ్యమైంది.

* నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి సీఎంగా
తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు చంద్రబాబు. తన తొలి ఐదేళ్లలో అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు పెట్టుబడులకు స్వర్గ ధామంగా ఏపీని మార్చాలని భావించారు. చాలా పరిశ్రమలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయాలని భావించారు. కానీ అనుకున్న స్థాయిలో అది సాధ్యం కాలేదు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కలేదు. హైదరాబాద్ అంత ఈజీగా ఏపీ ఐటి పరంగా అభివృద్ధి జరిగే ఛాన్స్ కనిపించలేదు. అందుకే చంద్రబాబులో సరికొత్త ఆలోచన వచ్చింది. అదే ఏపీని డ్రోన్ హబ్ గా మార్చాలన్నది చంద్రబాబు ప్లాన్ గా మారింది.

* డ్రోన్ అవసరాన్ని గుర్తించి
మనిషి దైనందిన జీవితంలో డ్రోన్ అవసరం ఇప్పుడు ఏర్పడింది. వ్యవసాయంలో రసాయనాలను పిచికారి చేయాలన్నా, ఒక వస్తువు సులువుగా వినియోగదారుడికి చేరాలన్నా.. ఇలా ప్రతి అవసరానికి డ్రోన్ కీలకంగా మారింది. అందుకే ఆ డ్రోన్ వ్యవస్థను అభివృద్ధి చేయడం ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పరచవచ్చన్నది చంద్రబాబు ఆలోచన. అందుకే అంతర్జాతీయ స్థాయిలో డ్రోన్ సదస్సును విజయవాడలో ఏర్పాటు చేశారు. ఏపీ డ్రోన్ హబ్ గా మార్చే ప్రయత్నంలో ఒక ముందడుగు వేశారు. ఈ సదస్సులో డ్రోన్ల సాయంతో ఏయే రంగాలకు ఎలాంటి సేవలు అందించ వచ్చు.. చేసి చూపించారు. డ్రోన్లకు ఉన్న మార్కెట్, ఆ రంగానికి ఉన్న భవిష్యత్తు ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశారు. రానున్న రోజుల్లో డ్రోన్లు కీలక భూమిక పోషించే అవకాశం ఉండడంతో.. అటువైపుగా దృష్టిపెట్టారు చంద్రబాబు. ఐటీ హబ్ మాదిరిగానే.. డ్రోన్ హబ్ గా ఏపీ తీర్చిదిద్దేందుకు చాలా కృషి చేస్తున్నారు. మరి ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.