Amaravati Construction: పశ్చిమ ఆసియా యుద్ధం నేపథ్యంలో.. కొత్త నిర్మాణాలను నిలిపివేయాలంటూ నీతి ఆయోగ్ సూచించిందని.. దీంతో ఏపీలో అమరావతి నిర్మాణం ఆగిపోతుందంటూ కొత్త ప్రచారం మొదలైంది. నిర్మాణరంగంలో ఆంక్షల నేపథ్యంలో అమరావతికి బ్రేక్ పడనుందంటూ సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తోంది. దీనిపై నీతి ఆయోగ్ స్పష్టతనిచ్చింది. తాము అటువంటి సూచనలు చేయలేదు అని చెప్పి ప్రత్యేక ప్రకటన చేసింది. దీంతో ఈ ప్రచారం చేస్తున్న వారికి షాక్ తగిలినట్లు అయింది. గత కొద్ది రోజులుగా ఈ ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుండగా.. అమరావతి వ్యతిరేకవర్గాలు ట్రోల్ చేయడం ప్రారంభించాయి.
* ఆగే ప్రసక్తే లేదు..
ఒకవేళ భవిష్యత్తులో దేశీయ నిర్మాణరంగంపై ఆంక్షలు విధించినా.. అమరావతి నిర్మాణ పనులు ఆగే ప్రసక్తి లేదు. ఎందుకంటే ప్రభుత్వ నిధులతో అమరావతి నిర్మాణం జరగడం లేదు. ప్రపంచ బ్యాంకు తోపాటు ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లాంటి అంతర్జాతీయ సంస్థల సహకారంతో నిర్మాణం జరుగుతోంది. అంతర్జాతీయ ఒప్పందాల మేరకు ఆ రెండు బ్యాంకులు అమరావతి నిర్మాణానికి దాదాపు 15 వేల కోట్ల రూపాయలు సాయం ప్రకటించాయి. అదో నిరంతర ప్రక్రియగానే సాగనుంది. మధ్యలో రకరకాల కారణాలతో నిర్మాణాలు నిలిపి వేయడానికి.. అది మామూలు నిర్మాణం కాదన్న విషయాన్ని గ్రహించుకోవాలి. ఐదు కోట్ల ఆంధ్రుల ప్రతీక అది. ఎట్టి పరిస్థితుల్లో నిలిపే ఛాన్స్ లేదు. పైగా గత అనుభవాల దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పరిస్థితికి రానీయవు కూడా.
* సెల్ఫ్ ఫైనాన్స్ నగరం..
అమరావతి అంటే ఒకటి రెండు భవనాల నిర్మాణం కానే కాదు. అదో సెల్ఫ్ ఫైనాన్స్ నగరం కూడా. ల్యాండ్ ఫోలింగ్ ద్వారా సేకరించిన భూములు భవిష్యత్తులో ఆదాయం సమకూర్చినవి అవుతాయి. వాటిలో భవిష్యత్తులో వ్యాపారం కూడా చేసుకోవచ్చు. పరిశ్రమలు కూడా అమరావతి వైపు చూసేందుకు ఆ భూములు దోహదపడతాయి. ఇప్పటికే అమరావతి రాజధాని నిర్మాణ పనులతో అక్కడ భూములకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. భవిష్యత్తులో లీజుతోపాటు అమ్మకాల ద్వారా గణనీయమైన అభివృద్ధి ఆదాయం పొందవచ్చు. సెల్ఫ్ ఫైనాన్స్ ద్వారా అమరావతి తనంతట తానుగా అభివృద్ధి చెందనుంది. అయితే అమరావతి పై వ్యతిరేక ప్రచారం చేయడంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. ఇప్పుడు అమరావతి పనులు నిలిచిపోతాయి అని చెప్పడం వెనుక ఆ పార్టీ ఉందనడంలో ఎటువంటి అతిశయక్తి లేదు.