Amaravati Capital Land Donation: అమరావతిలో( Amravati capital ) భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అక్కడ ఇంటి స్థలం ఉంటే చాలు అనుకుంటున్నారు కొందరు. భవిష్యత్తులో ప్రపంచ నగరంగా మారుతున్న క్రమంలో అక్కడ ఇంటి స్థలం ఉంటే చాలు అన్న భావిస్తున్న వారు అధికం. ఇక అమరావతికి భూములు ఇచ్చిన రైతులు అయితే తమకు విలువైన ప్లాట్లు కోరుకుంటున్నారు. తాము అందించిన భూములకు మించి ఆ ప్లాట్ల విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇటువంటి తరుణంలో అమరావతిలో తనకు ఉన్న 20 ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించారు ఓ వ్యక్తి. అందుకు సంబంధించిన పత్రాలు తీసుకొచ్చి నేరుగా అధికారులకు ఇచ్చేశారు.
* రెండో విడత భూ సమీకరణ..
అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రెండో విడత భూ సమీకరణ కూడా జరిగింది. అమరావతి రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు( returnabull plots ) అందిస్తున్నారు. ఇటువంటి సమయంలో అమరావతికి ఏకంగా 20 ఎకరాల భూమిని ఇచ్చేశారు రైతు. అయితే రాజధాని రెండో విడత భూ సమీకరణలో భాగంగా ఈ భూములను ఇవ్వడం విశేషం. హైదరాబాదులో నివాసం ఉంటున్న వెలినేని ఉమామహేశ్వరరావుకు ఎండ్రాయిలో 20 ఎకరాలకు పైగా భూమి ఉంది. ఆ భూమిని స్వచ్ఛందంగా అమరావతి రాజధానికి ఇచ్చేశారు ఆయన. ఈ మేరకు భూముల పత్రాలను సిఆర్డిఏ డిప్యూటీ కలెక్టర్ లలితకు అందజేశారు. ఆ భూములను స్వచ్ఛందంగా, ఎంతో ఆనందంగా అమరావతి రాజధానికి ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.
* చంద్రబాబుపై నమ్మకంతో..
అమరావతి విషయంలో ఆది నుంచి సీఎం చంద్రబాబు( CM Chandrababu) సానుకూలంగా ఉన్నారు. ఆయనను నమ్మి అమరావతి రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. అయితే రెండో విడత భూ సమీకరణకు అమరావతి రైతులు వ్యతిరేకిస్తున్నట్లు ప్రత్యర్థులు ప్రచారం చేయడం ప్రారంభించారు. అమరావతి రైతుల విషయంలో విషయం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం వారిలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించారు. ఇటువంటి సమయంలో ఉమామహేశ్వరరావు లాంటి అమరావతి రైతు స్వచ్ఛందంగా 20 ఎకరాల భూమిని అమరావతికి ఉచితంగా ఇవ్వడం నిజంగా శుభపరిణామం. సీఎం చంద్రబాబుకు దేశ విదేశాల్లో మంచి గుర్తింపు ఉందని.. అమరావతిని విశ్వ నగరంగా నిలపడంలో ఆయన విజయవంతం అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా శుక్రవారం 31.26 ఎకరాలను అమరావతి రాజధాని కోసం సేకరించారు. అందులో ఒకే వ్యక్తి ఏకంగా 20 ఎకరాల భూమిని అందించడం ఆసక్తికరంగా మారింది.
* చురుగ్గా నిర్మాణాలు..
అమరావతిలో అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి. హైకోర్టు నిర్మాణ పనులు వేగవంతం గా పూర్తి చేస్తున్నారు. ఏకధాటిక 15 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ఫౌండేషన్ పనులను ప్రారంభించారు. హైకోర్టు భవనాల నిర్మాణం కోసం ఏకంగా 65 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వినియోగిస్తున్నారు. 2027 నాటికి హైకోర్టు భవన నిర్మాణాలు పూర్తి చేయాలన్నది టార్గెట్. మరోవైపు అధికారులు, ఉద్యోగుల కోసం నాలుగు వేలకు పైగా ఇళ్లు నిర్మిస్తున్నారు. ఈ ఏడాది మార్చి నెలాఖరుకు 3500 నిర్మాణాలను పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. ఐకానిక్ భవనాల నిర్మాణం కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. వివిధ రాష్ట్రాల్లో సచివాలయాల నిర్మాణాన్ని ఏపీ అధికారుల బృందం పరిశీలించనుంది. అమరావతిలో కట్టబోయే సచివాలయానికి సంబంధించి అధ్యయనం చేయనుంది. దీనిపై క్యాబినెట్ సబ్ కమిటీ ఒక సమావేశం కానుంది. మొత్తానికైతే అమరావతి విషయంలో శరవేగంగా అడుగులు పడుతుండడం శుభపరిణామం