Amaravati Capital: అమరావతి రాజధాని ( Amaravathi capital ) నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాలు, ప్రైవేటు సంస్థల కార్యాలయాల నిర్మాణం జరుగుతోంది. బ్యాంకింగ్ రంగ సంస్థల కార్యాలయాల నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన జరగనుంది. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ జరుగుతోంది. అయితే గత అనుభవాల దృష్ట్యా అమరావతిని చట్టబద్ధత చేయాల్సిన అవసరం ఉంది. సిఆర్డిఏ చెబుతున్నట్టు ఐదు జిల్లాల పరిధిలో దాదాపు తొమ్మిది వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మిస్తున్న అమరావతికి పార్లమెంట్ ఆమోదముద్ర తక్షణ అవసరం. గత అనుభవాల దృష్ట్యా ఇది కీలకం కూడా. చట్టబద్ధత కల్పిస్తే.. అమరావతి అనే దానిని కదిలించలేరు కూడా. అయితే 2029 ఎన్నికల నాటికి అమరావతిని ఒక రూపానికి తెచ్చి ప్రజలకు ఓటు అడగాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అంటే కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి చేసి చట్టబద్ధత కల్పిస్తుందన్నమాట.
* నవ నగరాలు నిర్మించాలని..
అమరావతి రాజధాని లో నవ నగరాలు నిర్మించాలన్నది చంద్రబాబు( CM Chandrababu) ప్రణాళిక. అయితే గ్రేటర్ హైదరాబాద్ మాదిరిగా అమరావతిని నిర్మించి ప్రపంచంలోనే గుర్తింపు తీసుకురావాలన్నది ఆరాటంగా తెలుస్తోంది. అయితే 2014లో అందరి ఆమోదముద్రతో అమరావతి రాజధానిని ఎంపిక చేశారు చంద్రబాబు. పనులు కూడా ప్రారంభించారు. కానీ 2019లో అధికారం మారిపోయేసరికి మూడు రాజధానులు అంశం తెరపైకి వచ్చింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అమరావతి రాజధాని నిర్మాణాన్ని నిర్వీర్యం చేసింది. దాని పర్యవసానాలు అందరికీ తెలిసిన విషయమే. భూములు ఇచ్చిన రైతులు రోడ్డెక్కారు. వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. అయితే వారి ప్రార్థనలు ఫలించి టిడిపి కూటమి వచ్చింది. లేకుంటే వారి పరిస్థితి ఎలా ఉంటుందో కూడా ఊహించలేం. వైసీపీ అధికారంలోకి వచ్చి ఉంటే అమరావతి అనేది పూర్తిగా నిర్వీర్యం అయిపోయేది.
* గత అనుభవాల దృష్ట్యా..
అయితే గత అనుభవాల దృష్ట్యా అమరావతి రాజధాని నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉంది కూటమి ప్రభుత్వం( allians government ). అదే సమయంలో అమరావతిని కదిలించలేని స్థితిలోకి చేర్చాలని ఒక పట్టుదలతో ఉంది. అయితే అది 2028 లోనే చేయాలన్న తలంపుతో ఉంది. ఎందుకంటే ఆ సమయానికి అమరావతి రాజధాని నిర్మాణం ఒక కొలిక్కి వస్తుంది. అమరావతికి ఒక రూపు తెచ్చి.. పార్లమెంటులో బిల్లు పెట్టాలని చూస్తోంది టిడిపి కూటమి ప్రభుత్వం. అలా ఆ బిల్లును ఆమోదించి.. అమరావతిని శక్తివంతమైన నగరంగా మార్చాలన్నది చంద్రబాబు ప్రణాళిక. తద్వారా ప్రజలకు గట్టి సంకేతాలు పంపించనున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా డ్యామేజ్ చేయనున్నారు. అసలు అమరావతి విషయంలో స్టాండ్ ఏంటి అని వైసిపి చెప్పుకోలేని స్థితికి తేనున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
* ఏకపక్ష మద్దతు.. పార్లమెంటులో( parliament) అమరావతి బిల్లు ప్రవేశ పెడితే ఏకపక్షంగా ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. ఎందుకంటే అమరావతి రాజధానికి అన్ని పార్టీల మద్దతు ఉంది. ఒక్క వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్ప. అయితే ఆ పార్టీ జాతీయస్థాయిలో ఏ కూటమితో కూడా లేదు. తెలుగుదేశం, జనసేన ఎన్డీఏ కూటమిలో ఉంది. ఇండియా కూటమికి కాంగ్రెస్ నాయకత్వం వహిస్తోంది. వామపక్షాలు సైతం అదే కూటమిలో ఉన్నాయి. కాంగ్రెస్ తో పాటు వామపక్షాలు సైతం అమరావతి రాజధానికి జై కొట్టాయి. దీంతో బిల్లు ప్రవేశపెట్టడమే తరువాయి చాలా సులువుగా ఆమోదముద్ర వస్తుంది. చంద్రబాబులో కూడా అదే ధీమా. ఇప్పుడు గాని చట్టబద్ధత కల్పిస్తే రాజకీయంగా ఎటువంటి ప్రయోజనం ఉండదు. 2028 నాటికి అమరావతికి ఒక తుది రూపు తెచ్చి.. పార్లమెంటులో చట్టబద్ధత కల్పించాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.