Amaravati : అమరావతి రాజధాని( Amravati capital ) నిర్మాణం పై ఫుల్ ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం. 2028 నాటికి అమరావతి రాజధాని నిర్మాణ పనులు పూర్తి చేయాలని భావిస్తోంది. వచ్చే నెలలో పూర్తిస్థాయి పునర్నిర్మాణ పనులు చేయాలని డిసైడ్ అయ్యింది. ఈ పనుల ప్రారంభానికి గాను ప్రధాని నరేంద్ర మోడీని సీఎం చంద్రబాబు ఆహ్వానించనున్నారు. త్వరలో ఢిల్లీ వెళ్లి ప్రధానితో కీలక చర్చలు జరపనున్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రణాళిక, వ్యూహాన్ని ప్రధానికి వివరించే ప్రయత్నం చేయనున్నారు. ఇటువంటి క్రమంలో ఈరోజు అమరావతి రాజధాని నిర్మాణం అజెండాగా చేసుకుని మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈరోజు శాసనసభ సమావేశాల తర్వాత మంత్రిమండలి సమావేశం కానుంది.
Also Read : అమరావతికి రూ.65 వేల కోట్లు.. నిధులు అలా.. ఏపీ ప్రభుత్వం స్పష్టత!
* కేంద్రం సాయం
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం( central government) 15000 కోట్ల రూపాయల సాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. బడ్జెట్లో సైతం నిధులు కేటాయించింది. అందుకు అనుగుణంగా ప్రపంచ బ్యాంకుతోపాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి నిధులు సర్దుబాటు చేసింది. మరోవైపు హడ్కో నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు మంజూరయ్యాయి. ప్రైవేటు బ్యాంకులతోపాటు వివిధ మార్గాల ద్వారా నిధుల సమీకరణ శరవేగంగా జరుగుతోంది. అందుకే పనుల ప్రారంభానికి సంబంధించి ప్రత్యేక కార్యాచరణ కూడా సిద్ధం అయింది. వచ్చే నెలలో పునర్నిర్మాణ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. తాజాగా ఈ మంత్రివర్గ సమావేశం కీలక అంశాలను ఆమోదించనుంది.
* టెండర్లు ఖరారు
ఇప్పటికే అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ ( jungle clerance )పనులు పూర్తయ్యాయి. యధా స్థానానికి తీసుకొచ్చారు. పునర్నిర్మాణ పనులు ప్రారంభానికి సంబంధించి ఓ 30 వేల కోట్లతో టెండర్లు కూడా పిలవనున్నారు. అయితే ఆ టెండర్లకు సంబంధించి మంత్రివర్గం కూడా ఈరోజు ఆమోద ముద్ర వేయనుంది. గత సంస్థలతో పాటు కొత్తగా మరికొన్ని సంస్థలకు అమరావతి రాజధాని నిర్మాణ బాధ్యతలను అప్పగించనుంది కూటమి ప్రభుత్వం. వచ్చే నెలలో అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవం ఎలా చేయాలి అనే దానిపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. తాను ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీకి ఆహ్వానిస్తానని.. ఈ క్రమంలో కొన్ని కీలక ప్రతిపాదనలు కూడా ప్రధాని ముందు పెట్టనున్నట్లు చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో వివరించే అవకాశం కనిపిస్తోంది.
*ప్రతి 15 రోజులకు..
ప్రతి 15 రోజులకు ఒకసారి క్యాబినెట్ భేటీ( Cabinet meeting) జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి మాత్రం ఈ సమావేశానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించిన నిధుల కేటాయింపు, ప్రతిపాదనలు, స్పష్టత వచ్చే అవకాశం ఉంది. క్యాబినెట్ సహచరుల అభిప్రాయాలను తెలుసుకున్న తరువాత.. చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మొత్తానికైతే అమరావతి రాజధాని నిర్మాణం భవిత ఈరోజు మంత్రివర్గ సమావేశంలో తేలిపోనుందన్నమాట.
Also Read : బొత్స స్మశానం కామెంట్స్.. అమరావతి రైతు ఫిర్యాదు!