Homeఆంధ్రప్రదేశ్‌Amaravathi Capital: అమరావతి దేదీప్యమానంగా.. ఆ నిర్మాణానికి రూ.600 కోట్లు!

Amaravathi Capital: అమరావతి దేదీప్యమానంగా.. ఆ నిర్మాణానికి రూ.600 కోట్లు!

Amaravathi Capital: అమరావతి రాజధాని( Amaravathi capital ) విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది కూటమి ప్రభుత్వం. గత అనుభవాల దృష్ట్యా వీలైనంత త్వరగా అమరావతి నిర్మాణ పనులు పూర్తి చేయాలని భావిస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తోంది. వార్షిక బడ్జెట్లో ఏకంగా 15 వేల కోట్ల రూపాయల సాయాన్ని ప్రకటించింది. ప్రపంచ బ్యాంకుతోపాటు ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా సర్దుబాటు చేసే ప్రయత్నం చేసింది. అందులో తొలి విడత రుణానికి సంబంధించిన నిధులు కూడా విడుదల చేసింది. మరోవైపు హడ్కో రుణం సైతం మంజూరు అయింది. ప్రధాని నరేంద్ర మోడీతో పనులు పున ప్రారంభించేందుకు నిర్ణయించారు. సీఎం చంద్రబాబు వెళ్లి ఆహ్వానించనున్నారు. ముఖ్యంగా ఐకానిక్ భవనాల విషయంలో ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు.

Also Read: పిఠాపురంలో నాగబాబు ఎంట్రీ.. వర్మ పేరుతో టిడిపి రచ్చ!

* నవ నగరాలే లక్ష్యం..
అమరావతిలో నవ నగరాలు నిర్మించాలన్నదే సీఎం చంద్రబాబు( CM Chandrababu) లక్ష్యం. అందుకు అనుగుణంగా ఆయన పనిచేస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రాజెక్టులకు సంబంధించి సైతం కీలకంగా మార్చుతున్నారు. హైదరాబాద్- విజయవాడ హైవేలో అమరావతి కి స్వాగతం పలుకుతూ భారీ ఎంట్రీ ఉండేలా చూస్తున్నారు. ఇంకో వైపు 36 అంతస్తుల ఎన్.ఆర్.టి ఐకానిక్ భవన నిర్మాణం పై నిర్ణయం తీసుకున్నారు. 600 కోట్ల రూపాయలతో ఈ నిర్మాణం జరపనున్నారు. 360 డిగ్రీలు అమరావతిని వీక్షించేలా ప్రణాళిక ఖరారు చేశారు. ఇది అమరావతిని ప్రపంచ స్థాయిలో నిలబెట్టేలా చేయనుంది అని అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారు.

* చివరి వారంలో శంకుస్థాపన..
ఈ నెలలో చివరి వారంలో అమరావతి పునర్నిర్మాణ( Amaravathi reconstructions work ) పనులు ప్రారంభించేలా నిర్ణయం తీసుకున్నారు. మంచి ముహూర్తం నాడు పనులను ప్రారంభించనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా శ్రీకారం చుట్టం చుట్టనున్నారు. ఈ ఎన్నార్టీ ఐకానిక్ భవనం నిర్మాణానికి టెండర్లు కూడా పిలిచారు. ఈ నెల 10 వరకు టెండర్లకు గడువు ఉంది. ఎన్నార్టీ ఐకాన్ పేరుతో ఐదు ఎకరాల్లో ఈ భారీ భవనాన్ని నిర్మించనున్నారు. పోడియం తో కలిపి 36 అంతస్తుల్లో ఈ భవనం రూపుదిద్దుకోనుంది. దీని నిర్మాణం మూడు దశల్లో ఉంటుంది. మొదటి దశకు సంబంధించి ఫౌండేషన్కు ఇప్పుడు టెండర్లు పిలిచారు. దాదాపు 600 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఈ జంట టవర్ల నిర్మాణం 2028 నాటికి పూర్తి చేయాలన్నది లక్ష్యంగా కనిపిస్తోంది.

* ప్రతి నిర్మాణం గొప్పగా..
అయితే ఎన్నారైల ( NRI) కోసమే ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. ప్రవాస ఆంధ్రులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇందులో నివాస ప్లాట్లను, కార్యాలయ ప్రాంతాన్ని వారికే విక్రయిస్తారు. పార్కింగ్ కోసం రెండంతస్తుల సెల్లార్, దానిపై మూడంతస్తుల పోడియం ఉంటుంది. దానిపై 33 అంతస్తుల్లో భవనం నేర్పిస్తారు. రెండు టవర్లలోను ఒక్కదానిలో 29 అంతస్తులు ఉంటాయి. మొదటి టవర్ లోని 29 అంతస్తుల్లో ఒక్క అంతస్తుకు రెండు చొప్పున రెసిడెన్షియల్ ప్లాట్లు ఉంటాయి. రెండో టవర్లో కార్యాలయాలు ఏర్పాటు అవుతాయి. రెండు టవర్లను కలుపుతూ పైన నాలుగు అంతస్తుల భవనాన్ని నేర్పిస్తారు. 360 డిగ్రీలు అమరావతి నగరం మొత్తాన్ని వీక్షించవచ్చు అని చెబుతున్నారు. గ్లోబ్ లో 10 నుంచి 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెస్టారెంట్లు, కిచెన్, ఎగ్జిక్యూటివ్ డైనింగ్ హాల్, లాంజ్ వంటివి ఏర్పాటు చేస్తారు. ప్రత్యేకంగా ఎన్ ఆర్ టి క్లబ్ హౌస్ ఉంటుంది. మొత్తానికి అయితే ప్రపంచంలోనే తలమానికంగా ఈ నిర్మాణం అమరావతిలో రూపుదిద్దుకోనుంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular