Alcohol Restriction AP : ఏపీ ప్రభుత్వం( AP government) మద్యం దుకాణాల వద్ద నిఘా పెంచింది. మద్యం షాపుల నిర్వహణకు సంబంధించి ఫిర్యాదులు వస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని జిల్లాల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో అన్ని ప్రీమియం బ్రాండ్ల మద్యం అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు క్యూక్వార్టర్ మద్యం 99 రూపాయలకు అందిస్తున్న విషయం విధితమే. కానీ చాలాచోట్ల షాపుల సమయపాలన పాటించడం లేదని.. ఉదయం ఎనిమిది గంటలకు తెరిచి రాత్రి 12 గంటల వరకు అమ్మకాలు సాగిస్తున్నారని ఫిర్యాదులు ఉన్నాయి. జనావాసాల మధ్య షాపుల ఏర్పాటుతో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. మరోవైపు కొన్ని షాపుల వద్ద పర్మిట్ రూములు లేవు. మద్యం షాపుల వద్ద మందుబాబులు తాగడం చేస్తుండడంతో స్థానికులకు ఇబ్బందికర పరిస్థితిలు ఎదురవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మద్యం అమ్మకాల విషయంలో ప్రభుత్వం నిఘా పెట్టింది. పనివేళల ఉల్లంఘనకు పాల్పడితే చర్యలు తప్పవని స్పష్టం చేస్తోంది. మందుబాబుల నుంచి మద్యం కొనుగోలు వేళ ఫీడ్బ్యాక్ తప్పని సరిచేసింది. ఇకపై దుకాణాల వద్ద మద్యం కొనుగోలు చేసి.. అక్కడే తాగితే చర్యలకు సిద్ధమవుతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా తనిఖీలు చేయాలని కూడా నిర్ణయించింది. మద్యం షాపుల నిర్వహణలో విమర్శలు రావడంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read : విజయసాయి రెడ్డి రీఎంట్రీ
* భారీగా ఫిర్యాదులు.. రాష్ట్రవ్యాప్తంగా( state wide ) 3,500 వరకు మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటి సమయపాలన ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు. బార్లకు మాత్రం మినహాయింపు ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు బార్లలో మద్యం విక్రయించవచ్చు. అయితే పలు ప్రాంతాల్లో నిర్దేశించిన సమయానికి భిన్నంగా అమ్మకాలు చేస్తున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఉదయం 10 గంటల లోపు చాలా షాపులు తెరుచుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బార్ల విషయంలో సైతం అనేక రకాల విమర్శలు ఉన్నాయి. వీటిని ప్రచార అస్త్రంగా మార్చుకుంటున్నాయి విపక్షాలు. అందుకే ప్రభుత్వం సీరియస్ యాక్షన్ లోకి దిగినట్లు తెలుస్తోంది. కీలక ఆదేశాలు జిల్లా అధికారులకు ఇచ్చినట్లు సమాచారం.
* షాపుల నిర్వహణపై ఆదేశాలు..
ఆది నుంచి కూటమి ప్రభుత్వం( allians government ) మద్యం పాలసీ విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తూ వస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో షాపుల నిర్వహణపై విమర్శలు రావడంతో సీరియస్గా స్పందించింది. రాష్ట్రస్థాయి ఎక్సైజ్ సమీక్షలు ఇదే విషయంపై చర్చకు వచ్చింది. దీంతో అన్ని జిల్లాల అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా ప్రతిరోజు షాపులు, బార్ల పని వేళలు ప్రారంభానికి ముందు.. తరువాత ఫోటోలు తీయించాలని ఆదేశించారు. జియో కోఆర్డినేట్స్ రికార్డ్, సమయం సైతం రికార్డ్ అయ్యేలా ఫోటోలు తీసి పంపించాలి అని ఆదేశించారు. గత రెండు రోజులుగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ప్రభుత్వం కఠిన నిబంధనలకు దిగడంతో మద్యం షాపు యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
* ప్రభుత్వ ఆదాయానికి గండి..
మరోవైపు చాలా మంది మద్యం వ్యాపారులు.. పర్మిట్ రూములకు( permit rooms ) అనుమతులు తీసుకోలేదు. దీంతో షాపుల వద్ద చాలామంది మద్యం తాగుతున్నారు. దీంతో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. మద్యం షాపుల చుట్టూ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, చిన్నపాటి దుకాణాలు వెలుస్తున్నాయి. అయితే అవన్నీ మద్యం షాపుల యాజమాన్యాలు అనధికారికంగా ఏర్పాటు చేసినవి. అటువంటి చోట మద్యం తాగి వివాదాలు నడుస్తున్నాయి. పర్మిట్ రూములు తీసుకోకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. షాపుల వద్ద ఎవరూ తాగకూడదని.. కొనుగోలు చేసిన మద్యాన్ని ఇంటికి తీసుకెళ్లి తాగాలని స్పష్టం చేస్తున్నారు ఎక్సైజ్ అధికారులు. మరోవైపు ఎక్సైజ్ సిబ్బంది మందుబాబుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు. మద్యం షాపుల నిర్వహణ, బెల్ట్ షాపుల ఉల్లంఘనలు తదితర విషయాలను తెలుసుకోనున్నారు. మొత్తానికైతే ఏపీలో షాపుల వద్ద మద్యం తాగడానికి వీలు లేదన్నమాట.