TTD Issue : తిరుమల లడ్డు వివాదం కొత్త మలుపు తీసుకుంది. లడ్డు తయారీకి సంబంధించి నెయ్యిలో జంతు కొవ్వు వాడారు అన్న ఆరోపణ..దేశవ్యాప్తంగా కుదిపేసింది.కోట్లాదిమంది భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. అయితే చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతున్నారు. అసమర్ధ పాలన నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకే ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడుతున్నారు. చంద్రబాబు తీరును తప్పుపడుతున్నారు.దీంతో ఈ అంశం పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. తాజాగా సుప్రీంకోర్టు ఈ వివాదం పై స్పందించింది. విచారణలో కీలక వ్యాఖ్యలు చేసింది. నెయ్యిని తిరస్కరించినట్లు టీటీడీ ఈవో చెప్పారు కదా? నెయ్యి రిజెక్ట్ చేసాక ఇక వాడే పరిస్థితి ఉండదు కదా అని ప్రభుత్వం తరఫున లాయర్ ను అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది.ఒక్క ల్యాబ్ నిర్ధారణతో ఎందుకు సరిపెట్టారు? సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి కదా అని నిలదీసినంత పని చేసింది. ఎలాంటి పూర్తి ఆధారాలు లేకుండా లడ్డులో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగినట్టు ప్రభుత్వం ప్రకటన చేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.కోట్లాదిమంది మనోభావాలు దెబ్బతీస్తున్నారు అంటూఘాటుగా వ్యాఖ్యానించింది. అయితే ఇలా సుప్రీం ఆక్షేపించిందో లేదో నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు.తనదైన శైలిలో సుతిమెత్తగా స్పందించడం విశేషం.
* మాటల యుద్ధం
తిరుమలలో వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తో ప్రకాష్ రాజ్ కు మాటల యుద్ధం నడుస్తోంది.ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ ను ప్రకాష్ రాజ్ టార్గెట్ చేసుకుంటున్నారు.తాజాగా సుప్రీంకోర్టు స్పందించిన నేపథ్యంలో ప్రకాష్ రాజ్ మరోసారి తన ట్విట్టర్ కు పని చెప్పారు.’ దయచేసి దేవుడిని మీ రాజకీయాల్లోకి లాగకండి. హ్యాష్ ట్యాగ్ జస్ట్ ఆస్కింగ్’ అంటూ తన ట్విట్టర్ ఖాతా వేదికగా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ గా మారుతోంది.
* ట్విట్టర్ ఫైట్
పవన్ కళ్యాణ్ లడ్డు వివాదంపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. దేశంలో సనాతన ధర్మ పరిరక్షణకు ఒక వ్యవస్థ అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు. ఇదే విషయాన్ని ట్విట్టర్ ఖాతా ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు ప్రకాష్ రాజ్. దేశంలో ఇప్పుడు ఉన్న మత వివాదాలు చాలవా? కొత్త వివాదాలు ఎందుకు తెస్తున్నారు? ఏపీలో అధికారంలో ఉన్నది మీరే అన్న విషయాన్ని తెలుసుకోవాలని ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ కు సూచించారు. అక్కడి నుంచి వారిద్దరి మధ్య ట్విట్టర్ వేదికగా యుద్ధం నడుస్తోంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వ తీరును తప్పు పట్టడంతో.. మరింతగా రెచ్చిపోతున్నారు ప్రకాష్ రాజ్. దీనిపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.
Displaying
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: After the supreme courts response to the tirumala laddu controversy prakash raj made a statement on pawan
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com