https://oktelugu.com/

AP Government : ఇష్టమొచ్చినట్టు తిడితే ఇంతే.. పంచ్ ప్రభాకర్ సహా వైసీపీ యాక్టివిస్టులను ఏరేస్తున్న కూటమి సర్కార్*

ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో తిడితే ఇక కుదరదు. ఉపేక్షించరు కూడా. నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తారు కూడా. ఇప్పుడు ఏపీ పోలీసులు అదే చేస్తున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టుల మాటున వైసిపి అనుచరులు చేస్తున్న ఆగడాలపై ఫోకస్ పెట్టారు.

Written By:
  • Dharma
  • , Updated On : November 6, 2024 / 01:43 PM IST

    AP Government

    Follow us on

    AP Government :  సోషల్ మీడియాలో కొందరు రెచ్చిపోయారు. వైసిపి హయాంలో ఇటువంటి వారిని పెంచి పోషించడంతో ప్రత్యర్థులను వెంటాడారు.భావప్రకటన స్వేచ్ఛ పేరుతో రాజకీయ ప్రత్యర్థులను కించపరిచారు. కొంతమంది వైసీపీ యాక్టివిస్టుల చేసిన అతి అంతా కాదు. ఇప్పటికీ వారు అదే పంధాను అనుసరిస్తుండడంతో ప్రభుత్వం సీరియస్ అయ్యింది. సోషల్ మీడియా పై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ విధానాలపై వ్యతిరేక ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించింది.. ఒకే రోజు వందలాదిమందిపై కేసులు నమోదు చేసింది. కొందరిని అరెస్టు చేసింది కూడా. ఇటువంటి వారిలో పంచ్ ప్రభాకర్, ఇంటూరి కిరణ్, బుర్ర రవీంద్ర రెడ్డి లాంటి వాళ్లను కూడా అరెస్టు చేస్తున్నారు. సోషల్ మీడియా కీచకుల పని పడుతున్నారు. రాజకీయ ప్రత్యర్థులను వెంటాడడం వీరి పని. ఇందుకు గాను రాజకీయ పార్టీలు భారీగా వీరికి ముట్ట చెబుతుంటాయి. గత వైసిపి పాలనలో ఇటువంటి వారికి చేతినిండా పుష్కలంగా పని ఉండేది. అధికార పార్టీ అండదండలతో వీరు రెచ్చిపోయేవారు. అయితే ఇప్పుడు వీరికి ఆదాయం తగ్గుముఖం పట్టింది. వైసిపి ఇప్పటికీ వీరిని పెంచి పోషిస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. సీరియల్ కింద అరెస్టులు చేస్తుండడంతో.. వీరికి బెయిల్ రావడం కష్టమని భావిస్తున్నారు.

    * న్యాయ వ్యవస్థ పై కామెంట్స్
    వైసిపి హయాంలో న్యాయ వ్యవస్థ సైతం కామెంట్స్ చేసిన వారు ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా జడ్జిలను తిట్టిన వారు ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్నాళ్లు వారు మారుతారేమోనని చూశారు. కానీ దానిని మరింత అలుసుగా తీసుకున్నారు సోషల్ మీడియా కీచకులు. చివరికి హోం మంత్రి అనిత మీద కూడా మార్పింగులు చేస్తున్నారు. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో ఏ విధంగా వేధించారో చెప్పారు. తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పోలీసుల దూకుడు చూస్తుంటే మరింతమంది అరెస్టులు కావడం ఖాయం అని తెలుస్తోంది.

    * పంచ్ ప్రభాకర్ తో పాటు మరో ఇద్దరిపై
    పంచ్ ప్రభాకర్ అనే వ్యక్తి సీఎం చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అసభ్య పదజాలాలను వాడుతుంటారు. పంచ్ ప్రభాకర్ పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న ఇతను వైసీపీ సానుభూతిపరుడు. ఎన్నికల తరువాత కూడా రెచ్చిపోతుండడంతో ఈయనపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాయి జయంతి అనే ఎక్స్ ఎకౌంటు హోల్డర్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తానికైతే ఏపీ పోలీసులు సోషల్ మీడియా కీచుకులకు పరుగులు పెట్టిస్తున్నారు.