https://oktelugu.com/

ABN RK: వాళ్లకైతే వందల ఎకరాలు ఇవ్వచ్చు.. ఇతరుల కైతే ఇవ్వకూడదు.. ఇదీ ఆర్కే మార్క్ జర్నలిజం

ఇటీవల వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవిత చరిత్రను ఉద్దేశిస్తూ మహీ వీ రాఘవ్ అనే దర్శకుడు యాత్ర_2 అనే సినిమా తీశాడు. ఈ సినిమా ఇటీవలే విడుదలైంది.

Written By:
  • Dharma
  • , Updated On : February 13, 2024 / 12:03 PM IST

    ABN RK

    Follow us on

    ABN RK: జర్నలిజం అంటేనే న్యూట్రాలిటీ. అంటే ఒక పక్షానికి కొమ్ముకాకుండా అన్ని పక్షాలను సమానంగా చూడటం.. కానీ తెలుగు నాట ప్రధాన పత్రికగా చలామణి అవుతున్న ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణకు ఇలాంటివి పట్టవు కాబోలు. చంద్రబాబు నాయుడుకు పాజిటివ్ గా ఉంటే ఆయన కళ్ళకు పాజిటివ్ గా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా ఉంటే ఆయనకు అత్యంత వ్యతిరేకంగా కనిపిస్తుంది. ఆ సమయంలో ఆయన పెన్ను ఏకపక్షంగా కదులుతుంది. చంద్రబాబు నాయుడి కి గిట్టని వ్యక్తి మీద అడ్డగోలుగా రాసేస్తుంది. ఇది ఈరోజు తో మొదలైంది కాదు గత దశాబ్దాల నుంచి కొనసాగుతూ వస్తోంది. అందుకే కదా నిండు శాసనసభలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ రెండు పత్రికల్లో ఆంధ్రజ్యోతి పేరు చేర్చింది. అయినప్పటికీ రాధాకృష్ణ తన తీరు మార్చుకోడు. ఎదుటివారి మీద బురద చల్లుకుంటూ పోతాడు.. కడుక్కోవడం వారి ఖర్మ.

    ఇటీవల వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవిత చరిత్రను ఉద్దేశిస్తూ మహీ వీ రాఘవ్ అనే దర్శకుడు యాత్ర_2 అనే సినిమా తీశాడు. ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ సినిమాను వైసిపి నాయకులు తెగ ప్రమోట్ చేస్తున్నారు. గతంలో ఎన్టీఆర్ సినిమాను టిడిపి నాయకులు ఏ విధంగానైతే భుజానికి ఎత్తుకున్నారో.. ఇప్పుడు ఈ సినిమాని కూడా వైసీపీ నాయకులు అదే విధంగా భుజానికి ఎత్తుకుంటున్నారు. ఇది రాధాకృష్ణకు తప్పుగా అనిపించింది. ఇంకేముంది ఆయన పత్రికలో వ్యతిరేక కథనం ప్రచురితమైంది.. ఇంతకీ ఏంటయ్యా అదంటే..
    మహీ వీ రాఘవ్ చిత్తూరు జిల్లాలోని హార్స్ లి హిల్స్ ప్రాంతంలో రెండు ఎకరాల స్థలం కావాలని ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నాడు. అక్కడ ఒక స్టూడియో కట్టాలి అని అతడు భావించాడు. ఇందుకు సంబంధించిన ఫైల్ ఇప్పటికే ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చిత్తూరు జిల్లా రెవెన్యూ అధికారులకు పంపినట్టు ప్రచారం జరుగుతుంది. ఇగో ఇదే రాధాకృష్ణకు తప్పుగా కనిపించింది.

    చూశారా వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ స్థలాలను ఇతరులకు ఎలా కట్టబెడుతున్నాడో అంటూ తన పత్రికలో అడ్డగోలుగా రాశాడు. కానీ ఇదే రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రామోజీరావుకు వేల ఎకరాలు ఎలా కట్టబెట్టాడు? రామానాయుడుకు, అక్కినేని నాగేశ్వరరావుకు ఎందుకు అంతలా స్థలాలు ఇచ్చారు? అనే విషయాల మీద మాత్రం సింగిల్ కాలం వార్త రాయడు. రామోజీ ఫిలిం సిటీ లో వందల ఎకరాలు అసైన్డ్ భూములు ఉన్నప్పటికీ రాధాకృష్ణకు పట్టదు. రామానాయుడు స్టూడియో భూములకు సంబంధించిన జరుగుతున్న వివాదం రాధాకృష్ణకు అవసరం లేదు. కానీ ఒక వర్థమాన దర్శకుడు.. అది కూడా వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో స్టూడియో నిర్మిస్తాను.. ప్రభుత్వపరంగా కొంచెం తోడ్పాటు ఇవ్వండి.. అని దరఖాస్తు పెట్టుకుంటే మాత్రం దానిని భూతద్దంలో చూపి నానా యాగీ చేసుకుంటూ రాధాకృష్ణ ఏకపక్షంగా వార్త రాశాడు. అంటే ఒక సామాజిక వర్గానికి చెందిన వారి స్టూడియోలకు వందల ఎకరాలు ఇవ్వచ్చు.. వేరే వాళ్లకు స్థలాలు ఇస్తే మాత్రం నానా యాగి చేయాలి. ఇదేనా రాధాకృష్ణ సమాజానికి చెబుతున్న విలువలు.. ఇవేనా ఆయన సూత్రీకరిస్తున్న పాత్రికేయ పాఠాలు.. దీనినే మాస్ పరిభాషలో గాడి తప్పిన పాత్రికేయమంటారు.. మరి ఇలాంటి పాత్రికేయంతో ఇలాంటి విలువలు పాదుకొలుపుతారో రాధాకృష్ణకే తెలియాలి.