Pulivendula Politics: బయటికి రాజకీయ నాయకులు విమర్శలు చేసుకుంటారు. ఆరోపణలు చేసుకుంటారు. అభియోగాలు మోపుకుంటారు. అడ్డగోలుగా తిట్టుకుంటారు. కానీ లోపల మాత్రం భాయి భాయి అన్నట్టుగా ఒకరి భుజం మీద మరొకరు చేతులు వేసుకుంటూ .. కుశల ప్రశ్నలు వేసుకుంటూ సరదాగా ఉంటారు. ఇప్పుడంటే రాజకీయాలను నాయకులు శత్రుత్వంగా మార్చేసారు గాని.. ఒకప్పుడు నేతల మధ్య రాజకీయాలు ప్రత్యర్థి తత్వం లాగానే ఉండేవి. అయితే గత కాలంలో జరిగిన ఎన్నికలకు సంబంధించి ఓ విషయం ఎప్పుడు వెలుగులోకి వచ్చింది.. దీనిని ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ రాశారు.
Also Read: అదానీ లంచం కేసు.. అమెరికాకూ తప్పని ఆటంకాలు!
తన పత్రిక ఆంధ్రజ్యోతిలో కొత్త పలుకు సంపాదకీయంలో ఈ విషయాన్ని బయటపెట్టారు.. ” జగన్ రాజకీయాలకు రాకమందు తెలుగు రాజకీయాలలో కొన్ని ఉన్నత ప్రమాణాలు ఉండేవి. రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అటు కాంగ్రెస్, ఇటు టిడిపికి ప్రధాన నాయకులుగా ఉండేవారు. ఇద్దరి మధ్య ప్రత్యర్థి తత్వం ఉన్నప్పటికీ ప్రమాణాలను పాటించేవారు. కుప్పంలో చంద్రబాబును, పులివెందులలో రాజశేఖర్ రెడ్డిని ఓడించడానికి ఎటువంటి వ్యూహాలు అమలు చేసేవారు కాదు. 1996 పార్లమెంటు ఎన్నికల్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి కడప స్థానం నుంచి పోటీ చేశారు. చంద్రబాబు కూడా అప్పుడే ముఖ్యమంత్రి అయ్యారు. కడప జిల్లా ఎస్పీగా ఉమేష్ చంద్ర కొనసాగుతున్నారు. ఎన్టీ రామారావును ధిక్కరించి పార్టీని హస్తగతం చేసుకున్న చంద్రబాబుకు ఆ ఎన్నికలు ఒకరకంగా సవాల్గా మారిపోయాయి. దీంతో మెజారిటీ స్థానాలు గెలుచుకోవాల్సిన పరిస్థితి చంద్రబాబుకు ఏర్పడింది.. ఆ సమయంలో ఆయన వైయస్ సొంత జిల్లా పై కూడా దృష్టి కేంద్రీకరించాల్సి వచ్చింది. నాడు ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ రమేష్ చంద్రకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. పులివెందుల నియోజకవర్గంపై ఉమేష్ చంద్ర ప్రత్యేకంగా దృష్టి సారించారు. రిగ్గింగ్ కాకుండా అడ్డుకున్నారు.. మిగతా అసెంబ్లీ స్థానాలలో కూడా సజావుగా ఎన్నికలు జరిగేలాగ చర్యలు తీసుకున్నారు. దీంతో పులివెందులలో రాజశేఖర్ రెడ్డి ఓడిపోయే పరిస్థితి ఏర్పడింది. అయితే చివరి నిమిషంలో చంద్రబాబు మానస మార్చుకొని.. పులివెందుల ప్రాంతంలో చూసి చూడనట్టు ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఫలితంగా ఐదువేల ఓట్ల తేడాతో రాజశేఖర్ రెడ్డి గెలిచారు. పరువు దక్కించుకున్నారని” రాధాకృష్ణ రాశారు.
నిజానికి బాబు, వైఎస్ మధ్య సాన్నిహిత్యం ఉంది.. వారిద్దరూ స్నేహితులు కూడా.. అయితే వైయస్ కుమారుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుప్పంలో వేలు పెట్టడం వల్లే.. ఇప్పుడు పులివెందులలో టిడిపి గెలిచిందని వార్తలు వినిపిస్తున్నాయి. నాడు కుప్పంలో గనక జగన్ వేలు పెట్టకపోయి ఉంటే.. ఈరోజు పులివెందుల, ఒంటిమిట్ట ప్రాంతాలలో ఓడిపోయే పరిస్థితి జగన్ పార్టీకి ఉండేది కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనాప్పటికీ రాజకీయం అనేది తాత్కాలిక మాత్రమే. మానవ సంబంధాలు మాత్రమే శాశ్వతం. అలాంటప్పుడు రాజకీయాలను వ్యక్తిగతంగా తీసుకోకూడదు. అలా వ్యక్తిగతంగా తీసుకొని 2018 ఎన్నికల్లో కొడంగల్ ప్రాంతంలో రేవంత్ ను కెసిఆర్ ఓడించారు. కానీ 2019 పార్లమెంట్ ఎన్నికల నాటికి రేవంత్ మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడుగా ఎన్నికయ్యారు. 2023లో కొడంగల్ ప్రాంతంలో బంపర్ మెజారిటీతో విజయం సాధించారు. అంతేకాదు కామారెడ్డి స్థానంలో పోటీ చేసిన కేసిఆర్ ఓటమికి రేవంత్ ప్రధాన కారణమయ్యారు.