ABN Venkatakrishna: మొత్తానికి ఏబీఎన్ నుంచి వెంకటకృష్ణ బయటికి రావడం ఖాయం అయిపోయింది. అధికారికంగా వేమూరి రాధాకృష్ణకు తన రాజీనామా లేఖ ఇచ్చాడని జర్నలిజం వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఏబీఎన్ లో పరిస్థితి బాగోలేదని.. వెంకటకృష్ణకు ఇబ్బందికరంగా మారిందని.. రాధాకృష్ణ కూడా బాగు చేయలేనంత దారుణంగా మారిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజం, అబద్ధం ఎంతో వేముల రాధాకృష్ణకు, వెంకటకృష్ణకి తెలియాలి.
ఏబీఎన్ లో ప్రైమ్ టైం డిబేటర్ గా వెంకటకృష్ణ కు మంచి పేరే ఉంది. ఆ ఛానల్ లక్ష్యాలకు అనుగుణంగా అతడు డిబేట్లు నిర్వహించేవాడు. పసుపు రంగు చొక్కా తొడుకున్న కార్యకర్తలగానే వ్యవహరించేవాడు. దీనిపై వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేసేవి. అయినప్పటికీ వెంకటకృష్ణ తన ధోరణి మార్చుకునేవాడు కాదు. ఆ మధ్య తెలంగాణ వడిబియ్యానికి సంబంధించి ఏవో కూతలు కూసి సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలకు గురయ్యాడు. ఇక వెంకటకృష్ణ నిర్వహించి డిబేట్లోనూ వైసీపీకి వ్యతిరేకంగానే ఉండేవి. లేదా భారత రాష్ట్ర సమితికి వ్యతిరేక దిశలో ఉండేవి. బహుశా ఆ ఛానల్ మేనేజ్మెంట్ లైన్ అదే కాబట్టి వెంకటకృష్ణ కూడా అలానే వ్యవరించేవాడు. అయితే కొన్ని సందర్భాల్లో మేనేజ్మెంట్ కంటే ఎక్కువ వెంకటకృష్ణ చించుకునేవాడు. వైసిపి, భారత రాష్ట్ర సమితి నాయకులను ఏకపక్షంగా విమర్శించేవాడు. ఇక కొన్నిసార్లు అయితే తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ నాయకులను వెనక వేసుకేసుకొచ్చేవాడు. చివరికి తన పర్సనల్ సోషల్ మీడియా ఎకౌంట్లలోనూ టిడిపికి అనుకూలంగా.. వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసేవాడు. వైసీపీ శ్రేణులు టార్గెటెడ్ గా వెంకటకృష్ణను విమర్శించినప్పటికీ పట్టించుకునేవాడు కాదు.
వెనక ఎవరు ఉన్నారు
వెంకటకృష్ణ ఏబీఎన్ నుంచి బయటికి వెళ్లిపోతున్నాడు. రాజీనామా లేఖాను కూడా వేమూరి రాధాకృష్ణకు ఇచ్చినట్టు తెలుస్తోంది.. డిజిటల్ ప్లాట్ఫారం ను ఏర్పాటు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో పేరుపొందిన పాత్రికేయులు సొంతంగా డిజిటల్ మీడియాను ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో వెంకటకృష్ణ కూడా చేరిపోతున్నాడు. అయితే ఇన్ని రోజులపాటు ఏకపక్షంగా వ్యవహరించిన వెంకటకృష్ణ ఇప్పుడు న్యూట్రల్ వెంకటకృష్ణగా మారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఆయనకు తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కొంతమంది ఫండింగ్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వారితో వెంకటకృష్ణకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. వారి అండ ద్వారానే వెంకటకృష్ణ డిజిటల్ ప్లాట్ఫారం ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియదు. మరోవైపు వెంకటకృష్ణ గతంలో ఏపీ 24*7 చానల్లో పని చేశాడు. అందులో కొంతమేర పెట్టుబడి కూడా పెట్టినట్టు తెలుస్తోంది. నాడు ఆ ఛానల్ నుంచి బయటికి వచ్చేటప్పుడు అతడికి తన వాటా కింద వచ్చిన డబ్బులను అలానే ఉంచాడని.. ఇప్పుడు వాటితోనే డిజిటల్ ప్లాట్ఫారం ఏర్పాటు చేస్తున్నాడని కొంతమంది జర్నలిస్టులు వ్యాఖ్యానిస్తున్నారు. మరి డిజిటల్ ప్లాట్ఫారం ద్వారా వెంకటకృష్ణ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో వేచి చూడాల్సి ఉంది.