Homeఆంధ్రప్రదేశ్‌AB Venkateswara Rao: రాజకీయాల్లోకి ఆ మాజీ ఐపీఎస్ అధికారి!

AB Venkateswara Rao: రాజకీయాల్లోకి ఆ మాజీ ఐపీఎస్ అధికారి!

AB Venkateswara Rao: ఏపీ రాజకీయాల్లో( AP politics ) ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వ్యూహాలు అమలు చేస్తోంది. ఆ పార్టీని నిర్వీర్యం చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి పై పోరాటానికి ఓ మాజీ ఐపీఎస్ అధికారి రంగంలోకి దిగారు. రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు తెలిపారు. అయితే పార్టీ విషయంలో ఎంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. కానీ తన టార్గెట్ మాత్రం జగన్మోహన్ రెడ్డి అని తేల్చి చెప్పారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన నామినేటెడ్ పదవిని సైతం తిరస్కరించారు. కానీ ఇప్పుడు నేరుగా రాజకీయాల్లోకి రావాలని భావిస్తుండడం మాత్రం సంచలనం అవుతుంది. తెర వెనుక వ్యూహం ఏమిటన్నది చర్చకు దారి తీసింది.

Also Read: సజ్జలపై నమ్మకం.. జగన్ పై సీనియర్ల తిరుగుబాటు!

* తీవ్ర అన్యాయం..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వ హయాంలో అన్యాయానికి గురయ్యారు ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు. సీనియర్ ఐపిఎస్ అధికారిగా పదవీ విరమణ చేశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ సీనియర్ అధికారి ఐదేళ్లపాటు ఎటువంటి పోస్టింగ్ లేకుండా ఉండిపోయారు. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చింది. ఇంటలిజెన్స్ చీఫ్ గా అనురాధ నియమితులయ్యారు. ఆమె తరువాత ఏబీ వెంకటేశ్వరరావు ఆ పోస్టింగ్ లోకి వచ్చారు. 2019 వరకు సేవలందించారు. అయితే 2019లో జగన్ అధికారంలోకి రావడంతో ఏపీ వెంకటేశ్వరరావు పై ఉక్కు పాదం పడింది. చంద్రబాబు సర్కార్ కు పనిచేసారని అభియోగాలు మోపుతూ విచారణలు, సస్పెన్షన్లను కొనసాగించారు. దీంతో ఏ బి వెంకటేశ్వరరావు న్యాయస్థానాలను ఆశ్రయించారు. మరోవైపు ఐదేళ్ల వైసిపి పాలనలో ఆయన సస్పెన్షన్ లో ఉండిపోయారు.

* కూటమి వచ్చిన తర్వాత విముక్తి..
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏబి వెంకటేశ్వరరావుకు( ab Venkateswara )విముక్తి లభించింది. ఆ సస్పెన్షన్ కాలాన్ని క్రమబద్ధీకరించారు. అటు తరువాత ఆయన పదవీ విరమణ పొందారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు పడిన ఏబి వెంకటేశ్వరరావుకు ఓటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవి కట్టబెట్టింది. ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఆయనకు దక్కింది. అయితే ఆ పదవి ఆయనకు సరిపోదని.. అంతకుమించి పదవి ఇవ్వాలన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆ పదవి స్వీకరించలేదు వెంకటేశ్వరరావు. అయితే ఇప్పుడు అదే వెంకటేశ్వరరావు పొలిటికల్ ఎంట్రీ చేస్తున్నట్లు ప్రకటించారు. మెరుగైన సమాజం కోసం పాటుపడేందుకు వస్తున్నానని.. పదవులు ఆశించి మాత్రం కాదని వెల్లడించారు.

* జగనే టార్గెట్..
అయితే రాజకీయాల్లోకి వస్తానన్న ఏబీ వెంకటేశ్వరరావు చర్యలు మాత్రం జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) కోసమేనని స్పష్టమైనది. ఆ ప్రకటన చేసిన తర్వాత కోడి కత్తి శ్రీను కుటుంబాన్ని పరామర్శించారు. ఆ క్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ అక్రమాలను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. జగన్ దోచుకున్న సొమ్మును చట్టపరంగా కట్టిస్తామని చెప్పుకొచ్చారు. జగన్ బాధితులు ఎవరైనా ఉంటే 78160 20048 నంబర్కు సమాచారం ఇవ్వచ్చు అన్నారు. త్వరలో తన రాజకీయ రంగ ప్రవేశం ఉంటుందని చెప్పారు. అయితే ఆయన టిడిపిలో చేరుతారా? బిజెపిలోకి వెళ్తారా? కొత్త పార్టీని ఏర్పాటు చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular