Prakasam District: సినిమా అనగానే ప్రస్తుతం అందరికీ హీరో హీరోయిన్లు,.. పెద్దపెద్ద నటులు గుర్తొస్తారు. ఒకప్పుడు నటీనటుల ఆధారంగానే సినిమాలు హిట్ అయ్యేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. కథ ఆధారంగా సినిమాలు చూస్తున్నారు. సినిమా తీసే దర్శకుడు, ప్రొడ్యూసర్‌ను చూసి థియేటర్స్‌కు వెళ్తున్నారు. ఇక నేటి తరంలో డైరెక్టర్లు అంటే కాగ్ అశ్విన్, రాజమౌళి, శంకర్ తదితరులు గుర్తొస్తారు. ఇన నిర్మాత అనగానే దిల్ రాజు, అల్లు అరవింద్, అశ్వినీదత్ లాంటివారు గుర్తొస్తారు. ఏటా వందల సినిమాలు విడుదలవుతాయి. కానీ, కొన్నే థియేటర్లకు వస్తాయి. అందులో కొన్నే హిట్ అవుతాయి. ఇక చిన్న సినిమాలకూ నిర్మాతలు ఉంటారు. కానీ వారిని ఎవరూ గుర్తించరు. సినిమాపై పిచ్చితో చాలా మంది ఇండస్ట్రీకి వస్తే.. కొందరు వ్యాపార ధోరణితో సినిమాలు తీస్తారు. తాజాగా ఓ మహిళ సినిమాపై పిచ్చితో 20 ఏళ్లు రూపాయి రూపాయి పోగేసి సినిమా తీసింది. త్వరలో ఆ సినిమా విడుదల కాబోతోంది. మరి ఆ మహిళ ఎవరు ఆమెకు సినిమాపై పిచ్చి ఎందుకు, సినిమా తీయడానికి ఆమె పడిన కష్టాలు ఎంటో తెలుసుకుందాం.
తెలుగు మహిళా కూలీ..
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కనిగిరి సమీపంలోని ప్రధాని కట్టకు చెందిన వెంకట నర్సమ్మకు సినిమాలు అంటే పిచ్చి. ఆమె చిన్నప్పటి నుంచే ఇంట్లో రెండ రూపాయలు అడుక్కుని స్నేహితులతో కలిసి సినిమాకు వెళ్లేది. వీరబ్రహ్మేద్రస్వామి సినిమా చూస్తున్న సమయంలో ఆమెకు సినిమాపై మరింత ఇష్టం పెరిగింది. 14 ఏళ్ల వయసులో ఆమెకు పెళ్లయింది. పెళ్లి తర్వాత కూడా వెకటనర్సమ్మ సినిమాలపై ఆసక్తి తగ్గలేదు. భరత్‌తో కలిసి సినిమాలకు వెళ్లేది. ఈ క్రమంలో ఆమెకు సినిమా తీయాలన్న ఆసక్తి పెరిగింది. అయితే దీనికి బాగా డబ్బులు కావాలని తెలుసుకుంది. వెంకటనర్సమ్మ భర్త రైతు, ఆయన సంపాదన సినిమా తీయడానికి చాలదని గుర్తించిన ఆమె కూలీ పనులు చేయడం మొదలు పెట్టింది. ఇలా 20 ఏళ్లుగా భర్తతోపాటు తానూ పనిచేస్తూ వస్తోంది. సంపాదనలొ కొంత మొత్తం సినిమా తీయడానికి దాచిపెడుతూ వచ్చింది. ఈ క్రమంలో పిల్లలు పెరిగి పెద్దయ్యారు. ఓ రోజు తన సినిమా తీయాలన్న కోరికను భర్త, పిల్లలకు చెప్పింది. దీంతో వారు సినిమాకు బాగా డబ్బులు కావాలని చెప్పారు. దీంతో ఆమె 20 ఏళ్లుగా దాచిన డబ్బులు తెచ్చి చూపింది. అందులో 29 లక్షల రూపాయలు ఉన్నాయి. అయినా వెంకటనర్సమ్మ సినిమా పిచ్చి తగ్గించాలని వారు.. అవి సరిపోవని చెప్పారు.
మరింత సంపాదన కోసం..
సినిమాకు ఇంకా డబ్బులు కావాలని చెప్పడంతో వెంకటనర్సమ్మ తన కోరిక తీర్చుకోవడానికి మరింత సంపాదనపై దృష్టి పెట్టింది. కూలీ పనులతోపాటు చెరుకు రసం అమ్మింది. టిఫిన్ బండి పెట్టింది. కోవిడ్ సమయంలో రాగి జావా సెంటర్ ప్రారంభించింది. ఎన్ని పనులు చేసినా ఆమె లక్ష్యం మాత్రం సినిమా తీయడమే. అందుకే ఆమె మరిన్ని డబ్బులు సంపాదించడం కోసం ఈ పనులన్నీ చేసింది. ఈ క్రమంలో తన సినిమా తీయాలన్న కోరిక మరింత బలపడడంతో మరోమారు తన పెద్దకొడుక్కు చెప్పింది. దీంతో ఆయన సినిమా పిచ్చి తగ్గదా అని ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అయినా ఆమె సినిమా కోరిక మాత్రం మారలేదు. ఈ క్రమంలో బంధువుల సాయంతో కొడుకును వెతికి తెచ్చి.. నచ్చజెప్పింది. దీంతో అతను సినిమా తీయడానికి ఒప్పుకున్నాడు.
హైదరాబాద్‌లో దర్శకుల చుట్టూ..
ఇక సినిమా తీయడానికి నర్సమ్మ పెద్దకొడుకు హైదరాబాద్ వెళ్లి స్టూడియోల చుట్టూ తిరిగాడు. కథను చాలా మందికి వినిపించారు. కానీ ఎవరూ ముందుకు రాలేదు. చివరకు దర్శకుడు, నటుడు రవిబాబుకు చెప్పారు. ఆయన అంగీకరించడంతో నర్సమ్మ కూడా వెళ్లి రవిబాబును కలిసింది. అయితే సినిమా తీయడానికి డబ్బులు సరిపోలేదు. తెలంగాణలో దేవదాసీ వ్యవస్థలాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఒకప్పుడు ఉన్న మాతంగి ఆచారం ఆధారంగా సినిమా కథ ఉంది. స్త్రీని బలంగా చూపించడమే ఈ సినిమా ఉద్దేశం దీనికి స్పిరిట్ (ఈజ్ నాట్ వన్) అని పేరు పెట్టారు. సినిమా తీస్తున్న క్రమంలు డబ్బులు తక్కువ పడడంతో పొలం అమ్మేశారు. చివరకు సినిమా పూర్తయింది. ఇందులో రవి బాబు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. నిర్మాతగా వెంకటనర్సమ్మ పేరు తెరపై కనిపించనుంది. ప్రస్తుతం సినిమా విడతల పనులు జరుగుతున్నాయి. దీనికి వెంకటనర్సమ్మ కొడుకు రవీంద్రనాథ్ దర్శకత్వం వహించాడు.
పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా పోస్టర్..
ఇక ఈ సినిమాకు రూ.90 లక్షలు ఖర్చు చేశారు. త్వరలో సినిమా పోస్టర్ విడుదల చేయబోతున్నారు. దీనికి పవన్ కల్యాణ్ అపాయింట్ మెంట్ కోరేందుకు ఆయన ఆఫీస్‌కు వెళ్లారు. కలవకపోవడంతో మరోమారు కలవాలని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేతుల మీదుగానే పోస్టర్ విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇలా వెంకటనరసమ్మ 20 ఏళ్ల కల త్వరలో నెరవేరబోతోంది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: A woman from prakasam district has saved 90 lakhs for her dream movie project
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com