AP Political Strategy: రాజకీయాలు ( politics) ఎప్పుడు ఒకేలా ఉండవు. ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ప్రజల మూడ్ కూడా మారుతుంది. సంప్రదాయ ఓటు బ్యాంకుకు కూడా చీలిక వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తమకు 40 శాతం ఓటు బ్యాంకు ఉందని చెబుతోంది. అయితే అది స్థిరంగా ఉంటుందా? అంటే మాత్రం ఉండదు అని చెప్పవచ్చు. ఎందుకంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మూడు పార్టీలు ప్రత్యర్థులు. ఆ మూడు పార్టీలు కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం, బలహీనతలపై గురిపెట్టాయి. వచ్చే ఎన్నికల నాటికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలని భావిస్తున్నాయి. చాప కింద నీరులా ఇప్పటికే తమ ప్రయత్నాలను మొదలుపెట్టాయి. అవి సత్ఫలితాలను ఇచ్చేలా ఉన్నాయి.
మతపరమైన ప్రభావం..
వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress ) పార్టీ పై మతముద్ర ఉంది. హిందూ వ్యతిరేక పార్టీగా వైసీపీని ఎక్కువ మంది చూస్తారు. ముఖ్యంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య సామాజిక వర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయంలో వ్యతిరేకంగా ఉంటుంది. ఎందుకంటే హిందూ వ్యతిరేక ముద్ర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పై ఉంది. ఇప్పుడు దీనిని హైలెట్ చేస్తోంది భారతీయ జనతా పార్టీ. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు వివాదం, పరకామణిలో చోరీతోపాటు ఎన్నెన్నో విషయాలు ఇప్పుడు బయట పెడుతోంది బిజెపి. వైసీపీపై మతపరమైన పోరాటానికి బిజెపి బాధ్యత తీసుకుంది. ఆ పార్టీ నేతలు సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు. ఇది కూడా ఈ 40 శాతం ఓటు బ్యాంకు పై ప్రభావం చూపే అవకాశం ఉంది.
పవన్ చర్యలతో..
ఎస్టీ సామాజిక వర్గం పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan). ఆది నుంచి ఆ వర్గం కాంగ్రెస్ పార్టీ వైపు ఉండేది. తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళింది. అయితే ఈసారి పవన్ కళ్యాణ్ గిరిజన ప్రాంతాలపై దృష్టి పెట్టారు. ఆ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన పెద్ద ఎత్తున జరుగుతోంది. ఆ సామాజిక వర్గంలో సైతం మార్పు కనిపిస్తోంది. క్రమేపీఎస్టీలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరమవుతున్నట్లు సంకేతాలు కనబడుతున్నాయి. అదే గాని జరిగితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 40 శాతం ఓటు బ్యాంకులో ఎస్టీల వైపు గండి పడినట్టే.
ఎస్సీలు సైతం యు టర్న్..
మరోవైపు తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) ఎస్సీ సామాజిక వర్గం పై దృష్టి పెట్టింది. ఎస్సీ వర్గీకరణ ద్వారా ఆ సామాజిక వర్గంలో పట్టు సాధించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఎస్సీలు వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చారు. మొన్నటి ఎన్నికల్లో 11 స్థానాల్లో వైసీపీ గెలిస్తే ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో విజయం ఎక్కువగా సాధించింది. అయితే ఇప్పుడు పల్లె పండుగ పేరుతో దళిత వాడల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దీంతో ఆ వర్గంలో కొంత రకం చేంజ్ కనిపిస్తోంది. ఈ ప్రభావం ఆ 40 శాతం ఓటు బ్యాంకు పై చూపే అవకాశం ఉంది. ఇలా ఎలా చూసుకున్నా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుకు గండిపడడం ఖాయమని తెలుస్తోంది.