OnePlus 15R: న్యూ ఇయర్ తో పాటు పండుగలు రాబోతున్న నేపథ్యంలో ఫోన్ల కంపెనీలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తమ సేల్స్ పెంచుకునేందుకు వినియోగదారులకు ఆకర్షణీయమైన తగ్గింపు ధరలను ప్రకటిస్తున్నాయి. ఈ నెల 17న One Plus కంపెనీకి చెందిన ఓ మొబైల్ అత్యాధునిక లేటేస్ట్ ఫీచర్స్ తో రాబోతుంది. ఈ ఫోన్ పై రూ. 3,000 నుంచి రూ.4,000 తగ్గింపు ధరతో ఇవ్వనుంది. బ్యాటరీ సేవ్ చేసుకోవాలని అనుకునేవారికి అనుగుణంగా ఉండే ఈ మొబైల్ కు సంబంధించిన సమాచారం ఇప్పటికే ఆన్ లైన్ లో లీక్ అయింది. అయితే ధర గురించి ప్రత్యేకంగా తెలపనప్పటికీ.. కొన్ని అంచనాలు మాత్రం ఉన్నాయి. ఆ వివరాల్లోకి వెళితె..
మొబైల్ ప్రియులను ఇప్పటికే One Plus కంపెనీ రకరకాల మోడల్స్ తో ఆకట్టుకుంది. ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి One Plus 15R ను డిసెంబర్ 17న మార్కెట్లోకి రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా న్యూఇయర్ ముందు విడుదల చేస్తున్నందున్న దీనిపై ఆఫర్ ప్రకటించారు. ఈరోజు కొనుగోలు చేసిన వారికి రూ.3,000 నుంచి రూ.4,000 డిస్కౌంట్ లభించే అవకాశం ఉంది. ఈ మొబైల్ ధరపై కంపెనీ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ రూ.45,999 నుంచి రూ.46,999 వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరి ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉంటాయంటే?
One Plus 15Rలో 12 GB RAM, 256 GB స్టోరేజ్ ఉండనుంది. ఈ మొబైల్ ప్రారంభంలో మింట్ గ్రీన్, చార్ కోల్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉండనుంది. HD+ రిజల్యూషన్ తో పాటు 165 Hzరిఫ్రెష్ రేట్ తో సపోర్టు చేసే ఈ మొబైల్ క్వాలిటీ వీడియోతో పాటు గేమింగ్ కు అనుగుణంగా ఉంటుంది. అలాగే అట్రాక్షన్ గా ఉండి సున్నితమైన స్క్రోలింగ్ చేసుకోవచ్చు. ఇందులో 8 Gen 5 ప్రాసెసర్ అమర్చడంతో సూపర్ ఫాస్ట్ గా మూవ్ కానుంది. ఇప్పటి వరకు ఇంతలా ప్రాసెసర్ ను అమర్చిన మొబైల్ లేదు అని కొందరు అంటున్నారు.
ఈ మొబైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే మెరుగైన బ్యాటరీ వ్యవస్థ. ఇందులో 7,400 mAhబ్యాటరీని అమర్చారు. ఇది ఇప్పటి వరకు ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయన మొబైల్స్ కంటే అతిపెద్దదిగా కొనియాడుతున్నారు. ఇందులో 80 వాట్ ఛార్జర్ ఉండడంతో ఫాస్టెస్ట్ ఛార్జింగ్ కోరుకునేవారికి సౌకర్యంగా ఉండనుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ప్రీమియం ఫోన్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అవుతున్న ఈ మొబైల్ యూత్ కుప్రధాన ఆకర్షణీయంగా ఉండనుంది.