Duvvada Srinivas: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ దువ్వాడ శ్రీనివాస్ పై వేటు వేసింది. అయితే ఆయనపై విధించిన సస్పెన్షన్ విషయంలో పార్టీ హై కమాండ్ పునరాలోచన చేస్తుందని దువ్వాడ శ్రీనివాస్ భావించారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తిరిగి వైసిపి నుంచి పోటీ చేస్తానని ధీమాతో ఉండేవారు. అయితే ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఇబ్బందికరంగా మారాయి. ఇక దువ్వాడ శ్రీనివాస్ కు ఎటువంటి అవకాశం ఇవ్వకూడదని పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. గతంలో నేతల వ్యక్తిగత వ్యవహారాలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దగా దృష్టి సారించలేదు. ఎటువంటి వివాదాలు వారిపై వచ్చిన పట్టించుకోలేదు. అయితే అది ఎక్కువగా పార్టీకి నష్టం చేసిందని నివేదికలో అందినట్లు తెలుస్తోంది. అందుకే ఇక ఎంత మాత్రం అటువంటి వాటికి ఎంటర్టైన్ చేయకూడదని పార్టీ హై కమాండ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
కుటుంబ వివాదాలు సహజం..
సాధారణంగా రాజకీయ కుటుంబాల్లో( political families) వివాదం అనేది సహజం. అది చాలా రూపాల్లో వస్తుంది కూడా. అలానే దువ్వాడ కుటుంబంలో కూడా వచ్చింది. అయితే అది అంతా కుటుంబ వ్యవహారమే అనుకున్నారు. తరువాత దివ్వెల మాధురి ఎంట్రీ తో పరిస్థితి మారింది. కుటుంబ వివాదం కాస్త వ్యక్తిగత వివాదంగా మారింది. అయితే తర్వాత మాధురి శ్రీనివాస్ జంట సోషల్ మీడియాలో హల్చల్ చేసింది.. ఎందుకో ఇది పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఒకరిద్దరు సీనియర్లు ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేయడంతో దువ్వాడ శ్రీనివాస్ పై పార్టీ పరంగా వేటు వేశారు. ఆయన వద్ద ఉన్న ఎమ్మెల్సీ పదవి జోలికి పోలేదు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ఒత్తిడితోనే జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని దువ్వాడ శ్రీనివాస్ భావించారు. తన సొంత జిల్లాలో సీనియర్ నేతల కుట్ర అంటూ దువ్వాడ శ్రీనివాస్ అభివర్ణించారు.
ఇప్పటికీ వైసీపీ మనిషిగా..
అయితే ఒకవైపు పార్టీ వేటు వేసిన దువ్వాడ మాత్రం తాను వైసిపి మనిషిని అన్నట్టు ఉండేవారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సైతం అదే అభిప్రాయం ఉండేది. కానీ ఇటీవల బర్త్డే పార్టీలో మందుతో దొరికారని.. అనేక రకాల నిషేధిత వస్తువులు ఉన్నాయని లేనిపోని ప్రచారం నడిచింది. అయితే అందరి మాదిరిగానే పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారు. దువ్వాడ పట్టుబడే సరికి వైసిపి మనిషి అన్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇది ఎందుకో పార్టీపై ప్రభావం చూపుతోందని జగన్మోహన్ రెడ్డి గుర్తించినట్లు తెలుస్తోంది. ఇటీవల బోరుగడ్డ అనిల్ కుమార్ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అదే ప్రకటన చేసింది. ఆయనతో తమ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పడం ఆ ప్రకటన సారాంశం. ఇప్పుడు కూడా దువ్వాడ శ్రీనివాస్ విషయంలో అటువంటి ప్రకటన వచ్చే అవకాశం ఉందని పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే శ్రీకాకుళం జిల్లాలో దువ్వాడ శ్రీనివాస్ ప్రభావం చూపగల నేత. ఆపై ప్రధాన సామాజిక వర్గ ప్రభావం ఉంటుంది. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పునరాలోచనలో పడినట్లు సమాచారం.