Shiva Lingam vandalized: ఏపీలో( Andhra Pradesh) అనుకోని ఘటనలు జరుగుతున్నాయి. ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రముఖ దైవ క్షేత్రం ద్రాక్షారామంలో శివలింగాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ విషయం బయటకు రావడంతో భక్తుల్లో ఆందోళన మొదలైంది.. ఇంతటి ఘాతుకానికి పాల్పడింది ఎవరు? దుండగులు ఎవరు? అనే దానిపై చర్చ నడుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో సైతం రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలపై దాడులు జరిగాయి. విగ్రహాల ధ్వంసం జరిగింది. అప్పట్లో అది రాజకీయ దుమారానికి దారితీసింది. ఇప్పుడు కూడా అటువంటి కుట్ర జరిగి ఉంటుందా అని అనుమానం కలుగుతోంది.
ప్రముఖ శైవ క్షేత్రంగా..
అంబేద్కర్ కోనసీమ( Ambedkar konasima) జిల్లాలో ద్రాక్షారామం శైవక్షత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడ భీమేశ్వరాలయం ఉంది. పంచరామాలలో ఇది ఒకటి. చాలా శక్తివంతమైన ఆలయంగా హిందువులు అభివర్ణిస్తుంటారు. సంక్రాంతికి కోనసీమ జిల్లాల అందాలను తిలకించేందుకు అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు. అలా వచ్చినవారు కచ్చితంగా ద్రాక్షారామ క్షేత్రానికి వచ్చి శివయ్యను దర్శించుకుంటారు. సరిగ్గా సంక్రాంతికి ముందే ఇక్కడ శివలింగం వంశం కావడానికి భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. ద్రాక్షారామ భీమేశ్వరాలయంలో ఉత్తర గోపురం సప్త గోదావరి ఒడ్డున ఉన్న కపాలేశ్వర స్వామి లింగాన్ని దుండగులు ధ్వంసం చేశారు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శివలింగంపై సుత్తి వంటి ఆయుధంతో కొట్టి ధ్వంసం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే దీనిని అపశకునంగా భావించిన ఆలయ పండితులు.. వంశమైన శివలింగం స్థానంలో మరో లింగాన్ని ప్రతిష్టించి పూజలు చేశారు.
స్పందించిన పోలీసు యంత్రాంగం..
ఆలయ విధ్వంస ఘటన నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. శివలింగం ధ్వంసం అయిందన్న సమాచారం అందుకున్న కాకినాడ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా( SP Rahul Meena) ఘటనా స్థలానికి చేరుకున్నారు. దుండగులు దాడి చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్, ఫోరెక్స్ నిపుణులు ఆధారాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని.. ఆరు బృందాలతో నిందితుల కోసం అన్వేషిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ప్రకటించారు. మరోవైపు ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. సీరియస్ గా స్పందించారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
సుదీర్ఘ నేపథ్యం..
ఈ ఆలయానికి సుదీర్ఘ నేపథ్యం ఉంది. ఎంతో ప్రాశస్త్యం ఉంది. పూర్వకాలంలో పారకాసురుడు అనే రాక్షసుడు తీవ్ర తపస్సు చేసి శివుడు నుంచి వరాలు పొందాడు. ఆ వర ఫలితాలతో దేవతలతో పాటు ఋషులను భయభ్రాంతులకు గురిచేశాడు. వారి ప్రార్థనతో శివుడు స్పందించాడు. తన కుమారుడైన కుమారస్వామి చేతులతో తారకాసురుని వధించాడు. తారకాసురుడు మరణించే సమయంలో అతని శరీరం నుంచి ఒక శక్తివంతమైన శివలింగం ఉద్భవించింది. అది ఐదు భాగాలుగా విడిపోయి ఐదు ప్రాంతాల్లో పడింది. అవే పంచరామ క్షేత్రాలు. అందులో ఒకటి ద్రాక్షారామం.