(చంద్రబాబుకు శ్రీకాకుళం యాసలో సెటైర్ ఇదీ)
Chandrababu : ఈ మద్దిన చంద్రాలు సారూ.. సాలా మారిపోనరు. చాలా స్పీడుగా ఉన్నారు. వార్నింగుల మీద వార్నింగులు ఇచ్చేస్తన్రు. ఇలాగైతే వైసీపోళ్లకు కష్టమే. సీఎం జగన్ కి, వైసీపోళ్లకు సుక్కలు సూపిస్తామంతన్రు. రెట్టింపు అనుభవిస్తారని సెప్పతన్రు. ఎవరికీ తగలనన్ని దెబ్బలు జగన్ రెడ్డికి తగిలిస్తానని అంతన్రు. వచ్చే ఎలచ్చన్లో గెలుస్తానని గొప్ప ధీమాతొ ఉన్నారు బాబుగారు. మొన్నటి వరకు సాలా భయపడిపొనరు… ఎప్పుడుసూస్తే బాద, సిరాకుతో కనిపించొలు. ఇప్పుడెమో సినిమా డైలాగులు సెబుతాన్రు. అయినా ఈ మద్దిన బాబుగారిలో తెగ దీమా పెరిగిపోనది.
మూడు ఎమ్మెల్సీ సీట్లు వచ్చినిక బాబుగారి పట్టలేకపోతన్నము. సీఎం అయిపోనట్టు.. పెమాన సీకారం సేసినట్టు బాబుగా తెగ కలలు కంతన్రు. అయితే అది తప్పులేదు కాని.. ఆయన మాటలు వయసుకు తగ్గట్టు లేవు..అంత పెద్ద నాయకుడు ఏదిపడితే అది అనేకూడదు. అధికారం సేపడితే ఏ మంచి పనులు గురొంచే సెప్పలే కానీ.. జగన్ కి అది సేస్తా.. ఇది సేస్తా.. పతికారం తీరుసుకుంటానని సెప్పడం ప్రజల్లో సులకన అయిపోడానికే. బాబుగారు గొప్పగా పాలిస్తారని పేరుంది. జగన్ కంటే మంచి పాలన అందిస్తనని.. నాకచాపకపి గాడిలో పెడతానని సెపితే ఒక విధంగా ఉంటుంది కానీ.. సంపెస్తను.. కొరికేస్తను అంటే మాత్రం ప్రజలు హర్షించరు. అమోదం వెయరు.
కొత్తగా బాబుగారు టివివొల్లు మీద కూడా కొపం పెదర్శిస్తన్రు. టీవీ9, ఎన్టీవీలను, సాక్సి పెపరు, టీవీని పూర్తిగా లేకుండా సేస్తానని సెబతన్రు. నీలపురంగోళ్లను నిష్టూరమడతన్రు. సరైన వార్నింగులు కూడా ఇస్తన్రు. వలంటీర్లను ఉస్తరా..తిసెస్తారా అని అడిగితే కసురుకుంతన్రు. మీ మూడు మీడియాలకు మూడిందని హెచ్చరిస్తన్రు. తీసెస్తన్నను అంటే ప్రజలు తప్పుగా భావిస్తరాని.. ఉంచితే జగన్ ను సమర్థించినట్టవుతుందని తెలిసి బాబుగారు ఏంచెప్పాలో తెలియన కస్సుబుస్సులాడతన్రు. సాలా సీనియర్ అయిన బాబుగారు ఎందుకొ ఈ మద్దిన మరిపొన్రు. ఇలాగైతై కష్టం చంద్రాలు సారూ..
(చంద్రబాబుకు శ్రీకాకుళం యాసలో సెటైర్ ఇదీ)