https://oktelugu.com/

Nandyala: తప్పిపోయిన కుక్కపిల్ల.. ఆ కుటుంబం చేసిన పనికి అంతా ఫిదా!

ఎవరైనా పెంచుకున్న జంతువులు తప్పిపోతే ఆందోళన చెందుతారు. ఆచూకీ కోసం వెతుకుతారు. దొరకకపోతే బాధపడతారు. ఆ కుటుంబం మాత్రం అందుకు విరుద్ధం.

Written By:
  • Dharma
  • , Updated On : August 4, 2024 4:57 pm
    Nandyala

    Nandyala

    Follow us on

    Nandyala: ఇటీవల పెట్ కల్చర్ పెరిగింది. ప్రతి ఇంటా పెంపుడు జంతువులు కనిపిస్తున్నాయి.ముఖ్యంగా కుక్కల పెంపకం ఎక్కువైంది.రకరకాల జాతి కుక్కలు ఇప్పుడు ప్రతి ఇంటా కనిపిస్తున్నాయి.గతంలో పట్టణాల్లో కనిపించే ఈ సంస్కృతి ఇప్పుడు పల్లెలకు కూడా పాకింది.చివరకు పుట్టినరోజు వేడుకల్లో కుక్క పిల్లలను బహూకరించడం ఒక ఆనవాయితీగా మారింది. చివరకు లక్షల రూపాయలతో విదేశీ కుక్కలను కొనుగోలు చేయడం కూడా కనిపిస్తోంది. మూగజీవాలపై ప్రేమ కంటే.. అందులో ఫ్యాషన్ ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా దర్పం ప్రదర్శించడానికి ఎక్కువమంది ఇలా కుక్కలను పెంచుతున్నట్లు తెలుస్తోంది.వివిధ కారణాలతో ఆ కుక్కలు చనిపోతే అంత్యక్రియలు నిర్వహించడం, కర్మ కాండలు చేయడం, నలుగురికి భోజనాలు పెట్టడం కూడా చేస్తున్నారు. కొందరికి మూగజీవాల అంటే ఎనలేని ప్రేమ ఉంటుంది. వాటిని తమ కన్న బిడ్డల సాకుతుంటారు. వాటికి ఏమైనా అయితే తల్లడిల్లిపోతారు. అవి కనిపించకుండా పోతే వెలగల లాడిపోతారు కూడా. తాజాగా ఓ కుక్కను పెంచుకున్న యజమాని కూడా ఇలానే ఆందోళనకు గురయ్యాడు. ఆ కుక్క కనిపించకపోవడంతో ఊరిలో దండోరా వేయించాడు. అంతేకాదు పదివేల రూపాయల రివార్డు కూడా ప్రకటించాడు. కుక్క తప్పిపోవడంతో ఆ కుటుంబం బాధ తట్టుకోలేక ఈ వినూత్నప్రకటన చేశాడు. ఈ ఘటన నంద్యాల జిల్లా ఓర్వకల్లు మండలం హుసేనాపురం లో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నేటిజెన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

    * పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
    ఆ గ్రామంలో ఒక వ్యక్తి పెంచుకుంటున్న కుక్క తప్పిపోయింది. కుక్క ఆచూకీ తెలిపిన వారికి పదివేల రూపాయల బహుమానం ఇస్తామని ప్రకటించాడు వ్యక్తి. ఆ కుటుంబం గత కొన్నేళ్లుగా ఆ కుక్కపిల్లను పెంచుకుంటూ వస్తోంది. దానికి లియో అని పేరు కూడా పెట్టారు. శనివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో రోడ్డు దాటే క్రమంలో
    … కారులో నుంచి తప్పించుకు పోయింది ఆ కుక్కపిల్ల. దీంతో వెంటనే సదరు యజమాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.దొరికిన వారు కుక్కపిల్ల అందిస్తే పదివేల రూపాయలు అందిస్తానని ప్రకటించాడు. ఏకంగా గ్రామంలో దండోరా కూడా వేయించాడు.

    * గ్రామంలో దండోరా
    సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏమైనా పండుగలు, విశేషాలు ఉంటే దండోరా వేయడం ఆనవాయితీగా వస్తోంది. కానీ వినూత్నంగా కుక్కపిల్ల కోసం దండోరా వేయడంతో స్థానికులు ఆసక్తిగా గమనించారు.’శనివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో హైవే రోడ్డులో కారులో నుంచి కుక్కపిల్ల తప్పించుకుపోయింది.
    . చుట్టుపక్కల ఎవరికైనా దొరికితే దానిని సర్పంచ్కు అప్పగించి పదివేలు తీసుకెళ్లగలరు.. లేదంటే ఓర్వకల్లు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు కట్టిన చర్యలు తీసుకుంటారు’ అని దండోరా వేసిన వ్యక్తి ప్రకటించడంతో గ్రామస్తులు షాక్ కు గురయ్యారు.

    * ఈ తరహా ఘటనలు అధికం
    అయితే ఇటీవల పెంపుడు జంతువులకు సంబంధించిన ఘటనలు విస్తు గొలుపుతున్నాయి. గత ఏడాది హైదరాబాద్ నగరంలో జింజర్ అనే ఓ పిల్లి తప్పిపోయింది. దాని వివరాలు చెబితే 30,000 ఇస్తామని ఓ కుటుంబం ప్రకటించింది. మరో కుటుంబం సైతం తమ ఇంట్లో ఉన్న పిల్లి తప్పిపోయిందని.. తెచ్చి ఇచ్చిన వారికి 20 వేల రూపాయల నజరానా అందిస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఓ కుక్క తప్పిపోయిందని ఏకంగా దండోరా వేయించడం ప్రాధాన్యత సంతరించుకుంది.