https://oktelugu.com/

CM Chandrababu: చంద్రబాబు అంటే భయం.. బిజెపి నేతల మౌనం.. హై కమాండ్ ఆదేశాలేనా?

దశాబ్దాలుగా బిజెపిలో పని చేసిన వారు ఉన్నారు. ఆర్ఎస్ఎస్ తో అనుబంధం ఉన్నవారు సైతం ఏపీలో ఉన్నారు. ఏపీతోపాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. అయితే చాలామంది యాక్టివ్ నాయకులు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం విశేషం.

Written By:
  • Dharma
  • , Updated On : August 4, 2024 / 04:51 PM IST

    CM Chandrababu

    Follow us on

    CM Chandrababu: బిజెపిలో ఫైర్ బ్రాండ్లు ఏమయ్యారు? మునుపటిలా మాట్లాడడం లేదు ఎందుకు? హై కమాండ్ కంట్రోల్ చేసిందా? పరిస్థితులు అలా మారాయా? పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు చాలామంది బిజెపి నేతలు హడావిడి చేసేవారు. సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, జివిఎల్ వంటి వారు యాక్టివ్ గా ఉండేవారు. అయితే ఇందులో జీవీఎల్ కాస్త మాట్లాడుతున్నారు. మిగతా నేతలు మాత్రం కనిపించడం లేదు. అయితే ఎన్నికల తర్వాత పరిస్థితులే అందుకు కారణంగా తెలుస్తోంది. చాలా రకాల సమీకరణలు మారాయి. రాష్ట్రంలో టిడిపి తో బిజెపి జతకట్టింది. ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. అంతవరకు బిజెపి టిడిపి పై కొంత పై చేయి సాధించింది. బిజెపితో కలవడం చంద్రబాబుకు అవసరం. కానీ చంద్రబాబుతో కలవడం బీజేపీకి అవసరం లేదు. కానీ ఎన్నికల తర్వాత సీన్ మారింది. ఏపీలో టీడీపీ ఒంటరిగానే 136 సీట్లను గెలుచుకుంది. ఒంటరిగానే బంపర్ మెజారిటీ సాధించింది.బిజెపి గెలుచుకున్న 8 అసెంబ్లీ స్థానాలు టిడిపికి అవసరం లేదు.కానీ అదే సమయంలోటిడిపి సాధించిన 16 పార్లమెంట్ స్థానాలు మాత్రం కేంద్రంలోని బిజెపికి అవసరం.ఈ అవసరాల లెక్క మారిన తరువాతే బిజెపి నేతల్లో ఒక రకమైన చేంజ్ కనిపించింది.చంద్రబాబును పొగడడం కంటే వ్యతిరేకించడానికి వీలులేని పరిస్థితి ఏర్పడింది. అటు కేంద్ర పెద్దలు సైతం చంద్రబాబు విషయంలో కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. గౌరవభావం పెరిగినట్లు కూడా తెలుస్తోంది.

    * మూడు పార్టీల కలయికతో..
    రాష్ట్రంలో మూడు పార్టీలు కలిసి అధికారంలోకి వచ్చాయి.ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. మరో 10 సంవత్సరాలు పాటు ఉమ్మడిగానే ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నాయి. నామినేటెడ్ పదవులు సైతం మూడు పార్టీలు పంచుకోనున్నాయి. అయితే సింహభాగం పదవులు మాత్రం టిడిపికి వెళ్ళనున్నాయి. అటు తరువాత జనసేనకు ఎక్కువ పదవులు కేటాయించనున్నారు. బిజెపి మాత్రం ఆ రెండు పార్టీలు ఇచ్చుకున్న పదవులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్రంలో ప్రయోజనాల దృష్ట్యా బిజెపి రాజీ పడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

    * ఆ ఫార్ములాతో పదవులు
    మూడు పార్టీల మధ్య కుదిరిన రాజీ ప్రకారం అయితే.. టిడిపి ఎమ్మెల్యే ఉన్నచోట 80 శాతం పదవులు ఆ పార్టీ కేటాయించాలి. 30% జనసేన, 10 శాతం బిజెపి తీసుకోవాల్సి ఉంటుంది. జనసేన ఎమ్మెల్యే ఉన్నచోట ఆ పార్టీకి 60 శాతం, టిడిపికి 30%, బిజెపికి పది శాతం పదవులు కేటాయించాలి. కానీ బిజెపి ఎమ్మెల్యే ఉన్నచోట మాత్రం ఆ పార్టీకి 50 శాతం మాత్రమే పదవులు కేటాయించాలి. మిగతా 50 శాతం టిడిపి తో పాటు జనసేన పంచుకోవాలి. అయితే ఎలా చూసినా ఇక్కడ బిజెపికి నష్టం తప్పడం లేదు. మెజారిటీ పదవులు ఆ రెండు పార్టీలు తన్నుకు పోతాయి. దీంతో బిజెపి శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.

    * మారిన సీన్
    బిజెపిది ఎన్నికల ముందు ఒక పరిస్థితి.. ఎన్నికలయ్యాక మరో పరిస్థితి. పది అసెంబ్లీ సీట్లకు పోటీ చేసిన బిజెపి ఎనిమిది చోట్ల విజయం సాధించింది. ఆరు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసి మూడింట గెలిచింది. అంటే ఆ పార్టీ 16 మంది నాయకులకు అవకాశం ఇచ్చింది. అందులో ఐదుగురు ఓడిపోయారు. ఓడిపోయిన నేతలకు తప్పనిసరిగా నామినేటెడ్ పదవులు ఇవ్వాలి. వారితో పాటు రాష్ట్రంలో 50 మంది వరకు యాక్టివ్ నాయకులు ఉన్నారు. వారికి సైతం పదవులు ఇవ్వాల్సి ఉంది. ఇటువంటి తరుణంలోకేంద్ర పరిస్థితుల దృష్ట్యా,టిడిపి అవసరం మేరకు బిజెపి నేతలు సైలెంట్ అవుతున్నారు. ఈ విషయంలో బిజెపి హై కమాండ్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు సమాచారం.