https://oktelugu.com/

YS Sharmila : ఆస్తి వివాదానికి ఎండ్ కార్డ్.. వైసిపి విన్నపం అదే.. షర్మిల ఏం చేస్తారో?*

ఎట్టకేలకు వైసీపీ నుంచి షర్మిలకు కీలక ప్రతిపాదన వచ్చింది. ఆస్తి వివాదం పై ఇంతటితో మాట్లాడవద్దని విజ్ఞప్తి వచ్చింది. త్వరలో అన్ని తేల్చుకుందామని వైసీపీ నేతలు సూచిస్తున్నారు షర్మిలకు.

Written By:
  • Dharma
  • , Updated On : October 28, 2024 / 01:30 PM IST

    YS Sharmila

    Follow us on

    YS Sharmila :  ఏపీలో జగన్, షర్మిల మధ్య పోరు తారాస్థాయికి చేరింది. రాజకీయ అంశాలను వెనక్కి నెట్టి మరి కుటుంబ వివాదం తెరపైకి వచ్చింది. రోజుకో మలుపు తిరుగుతూ వస్తోంది. తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలకు ఈడి అటాచ్మెంట్ లో ఉన్న తన షేర్లు బదిలీ కాకుండా చూడాలని జాతీయ కంపెనీల లా ట్రైబ్యునల్ ను జగన్ ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి రచ్చ ప్రారంభం అయ్యింది. ఏపీలో ప్రాధాన్యత అంశంగా మారిపోయింది. మీడియాలో సైతం ఇదే హాట్ టాపిక్ అవుతోంది. వైసీపీ నేతలు అదే పనిగా విమర్శలు చేయడం, దానికి షర్మిల కౌంటర్ ఇస్తూ కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఇటువంటి తరుణంలో వైసీపీ నుంచి కీలక విన్నపం ఒకటి వచ్చింది. డైవర్షన్ పాలిటిక్స్ కు తిప్పికొడదాం.. ప్రజా గొంతుకై నిలుద్దాం అంటూ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపు ఇస్తున్నట్లు వైసిపి తాజాగా ఓ ట్వీట్ చేసింది. ఇందులో పార్టీ నేతలకు చెబుతున్నట్లు అంతా చెప్పి.. చివర్లో మాత్రం వైయస్ షర్మిలకు ఈ వివాదాన్ని ఎంతటితో ముగిద్దామని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ ట్వీట్లో మొత్తం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం లేదని.. పాలనలో విఫలమవుతోందని విమర్శలు గుప్పించడం విశేషం. చివరకు షర్మిల వద్దకు ప్రస్తావన తెచ్చి ముగించారు.

    * డైవర్షన్ పాలిటిక్స్ అని అనుమానం
    కూటమి ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లో చర్చ జరగకుండా ఉండేందుకు చంద్రబాబు ఈ డైవర్షన్ పాలిటిక్స్ కు దిగారు అని వైసిపి అనుమానిస్తోంది. షర్మిల వెనుక చంద్రబాబు ఉన్నారన్నది ప్రధాన ఆరోపణ. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా దీనిని హైలెట్ చేస్తుండడంతో.. ముగించాలన్నది వైసీపీ నుంచి వచ్చిన ప్రతిపాదనగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ అంశం ప్రజల్లోకి వెళ్లిందని.. తప్పు ఎవరిది అనేది ప్రజలే తేలుస్తారన్నది కొందరు వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈ కేసు న్యాయస్థానాల్లో ఉన్నందున, ఇక వాదనలు ఏవైనా కోర్టులోనే చేసుకునే అవకాశం ఎవరికైనా ఉన్నందున.. ఇక్కడి నుంచి ఈ వివాదానికి ముగింపు పలకాలని వైసిపి భావిస్తున్నట్లు తెలుస్తోంది.

    * షర్మిల విడిచి పెడతారా
    అయితే వైసీపీ వదిలినా షర్మిల విడిచి పెట్టే ఛాన్స్ లేదు. ఎందుకంటే తన తండ్రి ఆశయాన్ని, చివరి నిమిషంలో ఆయన అనుకున్నది అంటూ ఒక అంశాన్ని తెరపైకి తెచ్చారు. కుటుంబ ఆస్తిని నలుగురు మనవల్లకు సమానంగా పంచాలని ఆకాంక్షించారని షర్మిల చెబుతున్నారు. కానీ వైసీపీ నేతలు మాత్రం ఆ విషయాన్ని ప్రస్తావించడం లేదు. ఆ సమస్యకు పరిష్కార మార్గం చూపలేదు. షర్మిల బాధ కూడా అదే. అందుకే ఆమె తన సొంత బాబాయి వైవి సుబ్బారెడ్డి తీరును సైతం తప్పు పట్టారు. చుట్టూ ఉన్నవారు సైతం న్యాయం చేయలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే వైసిపి వివాదాన్ని విడిచిపెట్టినా.. షర్మిల మాత్రం విడిచి పెట్టే ఛాన్స్ లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.