MP Avinash Reddy : అవినాష్ లో మొదలైన భయం..

రెగ్యులర్ కోర్టులో పిటీషన్ వేస్తే కేసును విచారించిన ధర్మాసనం హైకోర్టు వెకేషన్ బెంచ్ లోనే తేల్చుకోమని చెప్పింది. మొత్తానికైతే ఈ కేసులో ఒకటి అవినాష్ రెడ్డిలో భయం, రెండోది మీడియా అతి.. ఈ రెండు కారణాలతోనే కేసు మరింత జఠిలమవుతోంది.

Written By: Dharma, Updated On : May 24, 2023 11:10 am
Follow us on

MP Avinash Reddy : వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి వ్యవహారం సగటు పౌరుడికి వెగటు పుట్టిస్తోంది. తన తప్పు లేదంటున్న అవినాష్ ఎందుకు భయపడుతున్నారో తెలియడం లేదు. విచారణకు తరచూ గైర్హాజరవుతూ వస్తున్న అవినాష్ పై సీబీఐ కఠిన చర్యలు ఎందుకు తీసుకోవడంలో అర్ధం కావడం లేదు. దీంతో కేసు టీవీ సీరియల్ రోజురోజుకు లెంత్ పెంచుకుంటూ పోతోంది. దానికి ఎల్లో మీడియా వెంటాడుతూ మరింత రక్తి కట్టిస్తోంది. మరీ ఏపీలో ప్రజా సమస్యలు అన్నవే లేనట్టు అదే పనిగా ప్రచారంతో పాటు డిబేట్లు నిర్వహిస్తోంది. అయితే సగటు ఏపీ పౌరుడు మాత్రం అయోమయానికి గురవుతున్నాడు.

అసలు తన తప్పే లేదంటూ ఎంపీ అవినాష్ రెడ్డి చెబుతూ వస్తున్నారు. అటువంటప్పుడు ఎందుకు భయపడుతున్నట్టు అన్నది ప్రశ్న. సీబీఐ అడుగుతున్న ప్రశ్నలకు తట్టుకోలేక.. తన అరెస్ట్ ఖాయమని తెలుసుకున్నాక ఆయనలో భయం ప్రారంభమైందన్న టాక్ నడుస్తోంది. తండ్రి భాస్కరరెడ్డి అరెస్ట్, వివేకా కుమార్తె సునీతారెడ్డి గట్టి పోరాటం కూడా మరో కారణం. దీనికి రాజకీయ అంశాలు తోడు కావడంతో కేసు బిగిసికుందని అవినాష్ ఒక నిర్ణయానికి వచ్చారు. అందుకే చివరి వరకూ తప్పించుకునేందుకే ప్రాధాన్యమిచ్చారు. దీనికి మీడియా మితిమీరిన ప్రాధాన్యం కల్పించింది. దాని పర్యవసానమే గత కొద్దిరోజులుగా జరుగుతున్న హైడ్రామా.

అటు కేసులో న్యాయస్థానాలు కూడా ఒక ఆట ఆడేసుకుంటున్నాయి. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ విషయంలో ఈ కోర్టుకు వెళితే పై కోర్టుకు వెళ్ళమంటారు. పై కోర్టులో కేసువేస్తే కిందకోర్టులోనే తేల్చుకోమంటున్నారు.దీంతో న్యాయస్థానాలు ఫుట్ బాల్ ఆడుకుంటున్నాయని అనుకోవటంలో తప్పనిపించటంలేదు.వివేకానందరెడ్డి మర్డర్ కేసులో ఎంపీని విచారణకు రావాల్సిందే అని సీబీఐ నోటీసుల మీద నోటీసులిస్తోంది. విచారణకు హాజరైతే తనను అరెస్టుచేస్తారని ఎంపీకి అనుమానం ఉన్నట్లుంది. తల్లి అనారోగ్యంగా ఉందికాబట్టి విచారణను నాలుగురోజులు వాయిదా వేయటమన్నారు. దానికి సీబీఐ ఏమీ చెప్పలేదు.

అందుకనే బెయిల్ కావాలని సుప్రింకోర్టులో పిటీషన్ వేశారు. అయితే ప్రస్తుతం న్యాయస్ధానాలకు సెలవుల కారణంగా కేవలం వెకేషన్ బెంచ్ మాత్రమే పనిచేస్తోంది. వెంకేషన్ బెంచ్ లో స్టే కోనం పిటీషన్ వేస్తే రెగ్యులర్ కోర్టుకు వెళ్ళమని చెప్పింది. రెగ్యులర్ కోర్టులో పిటీషన్ వేస్తే కేసును విచారించిన ధర్మాసనం హైకోర్టు వెకేషన్ బెంచ్ లోనే తేల్చుకోమని చెప్పింది. మొత్తానికైతే ఈ కేసులో ఒకటి అవినాష్ రెడ్డిలో భయం, రెండోది మీడియా అతి.. ఈ రెండు కారణాలతోనే కేసు మరింత జఠిలమవుతోంది.