https://oktelugu.com/

Sri Reddy : శ్రీరెడ్డి చుట్టూ ఉచ్చు.. క్షమాపణ చెప్పినా వదిలేదే లే.. యాక్షన్ లోకి కూటమి ప్రభుత్వం*

సినీ నటి శ్రీరెడ్డి.. ఆమె చేసిన సినిమాలు తక్కువే అయినా సెలబ్రిటీగా మారిపోయారు. యూట్యూబ్ ద్వారా ప్రజలకు దగ్గరయ్యారు. ఈ క్రమంలో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు శాపంగా మారాయి.

Written By:
  • Dharma
  • , Updated On : November 13, 2024 11:52 am
    Sri Reddy

    Sri Reddy

    Follow us on

    Sri Reddy :  శ్రీరెడ్డి.. తెలుగువారికి ఈ పేరు ఎంతో సుపరిచితం. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నవారికి తప్పకుండా శ్రీరెడ్డి పేరు తెలుస్తుంది. నటిగా కంటే సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యక్తిగానే ఆమె సుపరిచితం. గత ఐదేళ్లుగా సోషల్ మీడియా వేదికగా ఆమె చేసిన వ్యాఖ్యలు అన్నీ ఇన్ని కావు. చిన్నా పెద్దా తేడా లేకుండా వ్యవహరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఆమె వ్యవహార శైలి అలానే నడిచింది. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వివాదాస్పద వీడియోలు బయట పెడుతూనే ఉన్నారు. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం సోషల్ మీడియా యాక్టివిటీస్ పై దృష్టి పెట్టింది. సీరియస్ యాక్షన్ లోకి దిగింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వైసిపి సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు అవుతున్నారు. రిమాండ్ కు పంపిస్తున్నారు. కఠినమైన సెక్షన్లు నమోదు చేస్తుండటంతో ఒక రకమైన ఆందోళన వారిలో కనిపిస్తోంది. ఈ తరుణంలో నటి శ్రీరెడ్డి ప్రత్యేక  విడుదల చేశారు. చంద్రబాబు, పవన్, లోకేష్, వంగలపూడి అనిత తదితరులకు పేరుపేరునా క్షమాపణలు కోరారు.అయితే అంతటితో ఆ వివాదం ముగిస్తుందని శ్రీ రెడ్డి భావించారు. తమలాంటి వారిని వదిలేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఆమెలో పశ్చాత్తాపం కంటే భయం అధికంగా కనిపించింది. అందుకే ఆమెను వదిలి పెట్టకూడదని ప్రభుత్వం భావించినట్టు సమాచారం. ఆమె క్షమాపణలు కోరినా.. ఇతర వైసీపీ నేతల సలహాలోనే ఆమెపై చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

    * అనకాపల్లిలో కేసు
    తాజాగా అనకాపల్లిలో ఆమెపై కేసు నమోదు అయ్యింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, వంగలపూడి అనితలపై దుర్భాసలాడుతున్న శ్రీ రెడ్డి పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలుగు మహిళలు అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు.అయితే ఇటీవల రామ్ గోపాల్ వర్మతో పాటు పోసాని కృష్ణ మురళి పై కేసులు నమోదు అయ్యాయి. ఇప్పుడు ఆ సరసన శ్రీ రెడ్డి కూడా చేరారు. ఆమెపై కఠిన చర్యలకు దిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఆమె పక్క రాష్ట్రాల్లో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.

    * యు ట్యూబర్ గా..
    సినీ పరిశ్రమలో తనకు అన్యాయం జరిగిందంటూ సంచలన ఆరోపణలు చేశారు శ్రీరెడ్డి. సినిమా అవకాశాల కోసం తనను వాడుకున్నారని కూడా ఆరోపించారు. ఈ క్రమంలో మెగా కుటుంబం పై విమర్శలు గుప్పించారు. అప్పట్లో ఆమె నిరసన కూడా సంచలనం రేకెత్తించింది. ఆమె వ్యవహార శైలి వివాదాస్పదంగా మారడంతో చిత్ర పరిశ్రమలో అనధికార వేటు కొనసాగింది. దీంతో యూట్యూబ్ ద్వారా ఆమె సెలబ్రిటీగా మారారు. వైసిపికి అనుకూలంగా పనిచేశారు. ఈ క్రమంలో రాజకీయ ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు. ఇప్పుడు వాటిపై క్షమాపణలు చెప్పినా.. వెనక్కి తగ్గే స్థితిలో కూటమి ప్రభుత్వంలేదని తెలుస్తోంది.