Pawankalyan : పవన్ ఒక వ్యసనం.. ఒక పిచ్చి..ఒక వ్యామోహం.. ఒక పవర్.. ఒక సమ్మోహన శక్తి. పవన్ ను అభిమానులు వర్ణించే తీరిది. అయితే పవన్ వ్యక్తిత్వం తెలుసుకున్న తటస్థులు సైతం ఇదే అభిప్రాయానికి వస్తున్నారు. రాజకీయాలతో సంబంధం లేని వారు సైతం ఆయన ఔన్నత్యాన్ని గుర్తిస్తున్నారు. గొప్పగా అభివర్ణిస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో బ్రహ్మణోత్తములు చేరుతున్నారు. పండితులు సైతం పవన్ కు ఒక చాన్సిద్దామని పిలుపునిస్తున్నారు. తాజాగా ఓ పండితుడు మాటలతో కూడిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ ఔన్నత్యాన్ని చాటిచెబుతోంది.
తెలుగు సమాజంలో బాధ్యతాయుతమైన ఒకే ఒక నాయకుడు పవన్ కళ్యాణ్. తన వృత్తిని గౌరవిస్తూనే.. ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పం గొప్పది. రాజకీయాలంటే రొచ్చు రొంపి అనుకుంటున్న తరుణంలో..విపరీతమైన స్టార్ డమ్ ను సైతం వదిలి.. సాధారణ జీవితానికి అభిమానించి జనారణ్యం వచ్చిన నేత పవన్ కళ్యాణ్. బాలివుడ్ కు చెందిన అగ్రశ్రేణి నటుడు తన 70వ పడిలో కూడా యాడ్ల రూపంలో ఆదాయం తెచ్చుకుంటున్నాడు. తమిళ సూపర్ స్టార్ రాజకీయాల్లోకి రావాలా? వద్దా? అంటూ లాభనష్టాలను భేరీజు వేసుకుంటున్నాడు. ఇటువంటి తరుణంలో పవన్ అనే తెలుగు అగ్రనటుడు తన సినీ కెరీర్ ను విడిచి సామాన్యుడిగా మన మధ్య అడుగుపెడితే గుర్తించలేని స్థితిలో ఉండడం బాధాకరమంటూ పండితుడు తన ఆవేదన వ్యకం చేశాడు.
మనకు పాలకులుగా ఉన్న నేతలు వందలు, వేల వ్యాపారాలు చేసుకోవచ్చు. కానీ గౌరవప్రదమైన వృత్తిలో కొనసాగుతున్న పవన్ ను చులకనగా చూడడం బాధాకరం. భాష, వ్యవహార శైలితో బాధించే పాలకులున్న తరుణంలో.. అందర్నీ గౌరవించి.. గోశాల గోవులకు గడ్డేసి..సాధరణ జీవితం అనుభవిస్తున్న పవన్ ఆలోచనలను తక్కువచేసి మాట్లాడడం బాధాకరం. తాను సంపాదించిన సొమ్ముతో సంపద సృష్టించగల అవకాశం ఉన్నా ప్రజల కోసం తృణప్రాయంగా విడిచిపెట్టిన నాయకుడు పవన్.
వివిధ రంగాల వారు సినిమా రంగంలో దూసుకువెళ్లాలనుకుంటున్న తరుణంలో.. సినీ రంగంలో రారాజుగా ఉన్న ఆయన మనకోసం కిందకు వస్తే గౌరవించలేని స్థితిలో ఉన్నాం. ఎన్నాళ్లయినా… ఎన్నేళ్లయినా సమాజంలో మార్పు కోసమని అన్వేషిస్తున్న పవన్ కు సపోర్టు చెద్దాం. పవన్ పాలకుడుగా మారాలని బలంగా కోరుకుందామంటూ పండితుడు చేసిన వీడియో ప్రసంగం ఆలోచింపజేస్తోంది. నెటిజన్లకు, జన సైనికులకు ఆకట్టుకుంటోంది.