BJP – TDP Alliance : బీజేపీకి 12 అసెంబ్లీ, 8 ఎంపీ స్థానాలు ఫిక్స్.. టీడీపీ ఆఫర్

ఫస్ట్ మీటింగ్ లోనే సీట్ల సర్దుబాటు వచ్చే అవకాశమే లేదని రెండు పార్టీల శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. అయితే ఇది పొత్తు విచ్ఛిన్నానికి జరుగుతున్న కుట్రగా టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దని కోరుతున్నాయి. 

Written By: Dharma, Updated On : June 5, 2023 10:11 am
Follow us on

BJP – TDP Alliance : అలు లేదు.. చూలు లేదు..కానీ ఏపీలో పొత్తులు కుదిరిపోయాయని సోషల్ మీడియా కోడై కూస్తోంది. టీడీపీ, బీజేపీ, జనసేనల మధ్య పొత్తు ఖాయమని తేల్చేస్తున్నారు. ఇదిగో బీజేపీకి ఇవ్వబోయే సీట్లు ఇవేనంటూ ఒక లిస్టు చక్కెర్లు కొట్టేస్తోంది. ఇటీవల చంద్రబాబు అమిత్ షాతో భేటీ అయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి టీడీపీ అనుకూల మీడియా పొత్తులు కుదిరిపోయాయంటూ ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియా గురించి అయితే చెప్పనక్కర్లేదు. లేనిపోని విశ్లేషణలతో హోరెత్తిస్తోంది.

ఫస్ట్ మీటింగులోనే చంద్రబాబు ఒక జాబితాను అమిత్ షా చేతిలో పెట్టినట్టు ప్రచారం నడుస్తోంది. ఎనిమిది ఎంపీ సీట్లు 12 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వజూపారని తెలుస్తోంది.  ఆదివారం అంతా సోషల్ మీడియాలో ఒక్కటే గోల. లిస్ట్ ఇదేనంటూ పెద్ద జాబితానే విడుదల చేశారు. ఎంపీ సీట్లకు సంబంధించి  సుజనా చౌదరి (విజయవాడ) దగ్గుబాటి పురంధేశ్వరి (విశాఖపట్నం)  మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి (కడప) సీఎం రమేష్ (రాజంపేట) టిజి వెంకటేష్ (కర్నూలు) కామినేని శ్రీనివాస్ (ఏలూరు) సత్యకుమార్ (నెల్లూరు) జీవిఎల్ నరసింహారావు (నరసరావుపేట) నుంచి బీజేపీ తరుపున ఎంపీ అభ్యర్థులుగా పోటీచేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

ఎమ్మెల్యే సీట్లకు సంబంధించి  వరదాపురం సూరి(ధర్మవరం) విష్ణువర్ధన్ రెడ్డి(కదిరి) విష్ణుకుమార్ రాజు(విశాఖ నార్త్) భానుప్రకాశ్ రెడ్డి(తిరుపతి) సాధినేని యామినిశర్మ(గుంటూరు వెస్ట్) రమేష్ నాయుడు(రాజంపేట) పివిఎన్ మాధవ్(విశాఖ వెస్ట్) ఎస్.కే. భాజి(విజయవాడ వెస్ట్) అంజనేయరెడ్డి (నెల్లూరు సిటీ) పూడి తిరుపతి రావు(ఆముదాలవలస) సోము వీర్రాజు(రాజమండ్రి సిటీ) లంకా దినకర్ (గన్నవరం)లకు కన్ఫర్మ్ చేసినట్టు ప్రచారం చేస్తున్నారు.

ఈ ప్రచారంలో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఇప్పుడు ప్రచారంలో ఉన్న సీట్లన్నీ టీడీపీకి పట్టున్న స్థానాలే. ఒకవేళ ఇచ్చినా బీజేపీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందా? అంటే అదీలేదన్న సమాధానం వినిపిస్తోంది. ఫస్ట్ మీటింగ్ లోనే సీట్ల సర్దుబాటు వచ్చే అవకాశమే లేదని రెండు పార్టీల శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. అయితే ఇది పొత్తు విచ్ఛిన్నానికి జరుగుతున్న కుట్రగా టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దని కోరుతున్నాయి.