Actress Anupama: మలయాళం సినిమా ప్రేమమ్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది అనుపమ పరమేశ్వరన్. ఆ తర్వాత అఆ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. నాగ చైతన్య సరసన తెలుగు ప్రేమమ్ లోనూ నటించి మెప్పించింది అనుపమ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగు లోనే కాకుండా.. తమిళ్, మలయాళ ఇండస్ట్రీలోనూ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇక సోషల్ మీడియా లోనూ ఫుల్ యాక్టివ్గా ఉంటుంది ఈ చిన్నది. ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది అనుపమ. రౌడీ బాయ్స్, కార్తికేయ 2, 18 పేజీస్ సినిమాలతో ఫుల్ జోష్ లో దూసుకుపోతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న అనుపమ తన వ్యక్తిగత జీవితం గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
సినిమా కోసం భావోద్వేగాలు పండించేటప్పుడు ఆయా కథలే ప్రభావితం చేస్తుంటాయి తప్ప… నా వ్యక్తిగత జీవితాన్ని అస్సలు గుర్తుకు తెచ్చుకోనని అనుపమ చెప్పింది. నటుల జీవితాలపై తప్పకుండా వృత్తి ప్రభావం ఎంతోకొంత ఉంటుంది. కొన్ని పాత్రలు చేసి బయటకొచ్చిన తర్వాత అవి మనసుల్ని వెంటాడుతుంటాయి. అయితే చాలా వరకు రెండు జీవితాలను వేర్వేరుగా ఉండేలా చూసుకుంటుంటా. కెమెరా ముందుకు వెళ్లానంటే ఆయా కథలు, పాత్రలే ప్రపంచంగా మారిపోతుంటా. ఆ పాత్ర సంఘర్షణ నుంచే భావోద్వేగాల్ని పండించేందుకు ప్రయత్నిస్తుంటా అని వివరించింది.
అంతేకానీ నా వ్యక్తిగత జీవితాన్ని గుర్తుచేసుకుని నటించే ప్రయత్నం చేయను అని చెప్పారు. నిజ జీవితంలో నేను ప్రేమలో పడ్డాను, విడిపోయాను. అలాగని సెట్లో ప్రేమ సన్నివేశాల్లో నటించేటప్పుడు నా ప్రేమను గుర్తు చేసుకోను అంటూ ఎమోషనల్ అయ్యారు. అలా అలవాటు పడితే కష్టమని, కథల్లోని ప్రతీ సంఘర్షణ నా జీవితంలో ఉండదు అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు ఆయా కథలు, పాత్రలే నాకు ఎక్కువ జీవితాన్ని పరిచయం చేశాయి అంటూ అనుపమ తెలిపింది. ఇంతకీ అనుపమ ఎవరితో బ్రేకప్ అయింది అంటూ సోషల్ మీడియా లో చర్చించుకుంటున్నారు.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Actress anupama parameswaran opens about her break up
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com