Siva Karthikeyan Madrasi movie: ఒక సాధారణమైన టీవీ యాంకర్ గా కెరీర్ ని మొదలుపెట్టి, ఆ తర్వాత కమెడియన్ గా పలు సినిమాల్లో నటించి, ఆ తర్వాత అదృష్టం కలిసొచ్చి హీరో గా మారి, నేడు తమిళనాడు లో టాప్ 5 స్టార్ హీరోలలో ఒకరిగా మారిన నటుడు శివ కార్తికేయన్(Siva Karthikeyan). గత ఏడాది ఆయన ‘అమరన్’ అనే చిత్రం తో సృష్టించిన బాక్స్ ఆఫీస్ సునామీ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాతోనే ఆయన సూపర్ స్టార్స్ క్యాటగిరీలోకి అడుగుపెట్టాడు. అయితే ప్రస్తుతం ఆయన ‘పరాశక్తి’, ‘మదరాసి'(Madrasi) అనే చిత్రాల్లో నటిస్తున్నాడు. ‘మదరాసి’ అనే చిత్రాన్ని తమిళ స్టార్ డైరెక్టర్ మురగదాస్(AR Murugadoss) తెరకెక్కిస్తున్నాడు. ఒకప్పుడు ఈయన సౌత్ లోనే బిగ్గెస్ట్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరు. ప్రతీ ఒక్కరు ఈయన దర్శకత్వం లో ఒక సినిమా చెయ్యాలని అనుకునేవారు. కానీ ఈమధ్య కాలం లో ఆయన వరుసగా డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు తీస్తుండడం తో స్టార్ హీరోలు ఇతన్ని పట్టించుకోవడం మానేశారు.
Read Also: కింగ్డమ్ లో ఈ రెండు సన్నివేశాలు.. సినిమాను ఏం చేస్తాయి..?
ఈ ఏడాదికి రంజాన్ కానుకగా విడుదలైన సల్మాన్ ఖాన్ ‘సికిందర్’ కూడా ఈయన దర్శకత్వం లో తెరకెక్కిన సినిమానే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఫుల్ రన్ లో సరిగ్గా 120 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. కచ్చితంగా ఈ చిత్రం తో కం బ్యాక్ ఇస్తాడని అంతా అనుకుంటే కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ అవ్వడం తో , శివకార్తికేయన్ తో తీస్తున్న ‘మదరాసి’ చిత్రం పై అంచనాలు కాస్త తగ్గాయి. ఈ నేపథ్యం లో రీసెంట్ గా మురగదాస్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. మదరాసి చిత్రం పై కూడా కాస్త అంచనాలు పెంచేలా చేసింది. ఎందుకంటే ఈ చిత్రంలో కూడా హీరో కి గజినీ చిత్రం లో ఉన్నట్టుగానే మానసిక రోగం ఉంటుందట. ఈ విషయాన్నీ స్వయంగా మురగదాస్ చెప్పుకొచ్చాడు.
Read Also: ఓజీ లో పవన్ కళ్యాణ్ కాలర్ పట్టుకోవడానికి భయపడిన స్టార్ హీరో…వైరల్ వీడియో…
ఆయన మాట్లాడుతూ ‘నేను ప్రస్తుతం శివ కార్తికేయన్ తో చేస్తున్న మదరాసి చిత్రం చాలా బాగా వస్తుంది. కచ్చితంగా ఇది నా కం బ్యాక్ సినిమాగా భావించవచ్చు. నా కెరీర్ బెస్ట్ చిత్రాల గురించి మాట్లాడితే గజినీ, తుపాకీ, కత్తి సినిమాల పేర్లు చెప్తారు జనాలు. గజినీ స్క్రిప్ట్ తో, తుపాకీ స్క్రీన్ ప్లే తో ఒక సినిమా ఉంటే ఎలా ఉంటుందో, అలా ఉంటుంది నేను ప్రస్తుతం తీస్తున్న ‘మదరాసి’ చిత్రం. ఇందులో హీరో కి మానసిక రోగం ఉంటుంది. తనకు ఏర్పడిన ఆ మానసిక రోగం నుండి ఎలా బయటపడ్డాడు. ఈ క్రమం లో అతనికి ఎదురైనా సవాళ్లు ఏంటి అనేదే నా స్టోరీ. శివ కార్తికేయన్ కెరీర్ కి ఈ చిత్రం ఒక గేమ్ చేంజర్ లాగా మారబోతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు మురగదాస్.