Sukumar And Ram Charan Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంటలిజెంట్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్… ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. రామ్ చరణ్ తో ఇంతకుముందు ఆయన చేసిన రంగస్థలం సినిమా ఎంతటి గొప్ప విజయాన్ని సాధించిందో మనందరికి తెలిసిందే. ఇక అల్లు అర్జున్ తో చేసిన పుష్ప సినిమా రెండు పార్టులుగా వచ్చి సూపర్ డూపర్ సక్సెస్ ను సాధించింది. ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇక రాబోయే సినిమాలతో కూడా అదే రేంజ్ లో సక్సెస్ లను సాధించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…ప్రస్తుతం ఆయన డిఫరెంట్ సబ్జెక్టులను ఎంచుకుంటున్నాడు. రామ్ చరణ్ తో చేయబోతున్న సినిమా విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా వ్యవహరిస్తున్నాడు. వీళ్లిద్దరి కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన ‘రంగస్థలం’ సినిమాను మించి ఈ సినిమా ఉండాలని చూస్తున్నాడు. అయితే ఈ సినిమాలో విలన్ గా మలయాళం మెగాస్టార్ ముమ్ముట్టిని తీసుకుంటున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
ఇక ఈ సినిమా పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతుంది. కాబట్టి ఇతర భాషల్లో ఉన్న నటులను సైతం ఇందులో భాగం చేస్తే సినిమా మీద భారీ బజ్ క్రియేట్ అవుతుందని తద్వారా ప్రేక్షకులు సైతం ఆ సినిమాకి కనెక్ట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉంటాయనే ఉద్దేశంతోనే ఆయన ప్రతి ఒక్కరిని ఇందులో భాగం చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…
మొత్తానికైతే సుకుమార్ సినిమాలో విలన్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. వాళ్ళు ఏం చేసినా కూడా ప్రాపర్ రీజన్ ఉంటుంది. ఈ సినిమాలో మెగాస్టార్ మమ్ముట్టి ఏ రేంజ్ లో కనిపిస్తాడు. తనని సుకుమార్ ఏ రేంజ్ లో చూపిస్తాడు. మొత్తానికైతే డిఫరెంట్ పాత్రలో మమ్ముట్టి కనిపిస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక పెద్ది సినిమా కొంతవరకు తేడా కొట్టడంతో సుకుమార్ తో చేయబోయే సినిమా విషయంలో రామ్ చరణ్ కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు.
ఒకటికి పదిసార్లు ఒక సన్నివేశాన్ని రాసుకుని అది పర్ఫెక్ట్ గా కుదిరిన తర్వాతే నెక్స్ట్ సీన్ కి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే విలన్ గా మాత్రం మమ్ముట్టిని ఫిక్స్ చేసుకున్నారు. మరి తను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా లేదా అనేది తెలియాలంటే సినిమా యూనిట్ నుంచి అఫిషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సిందే…
