Dhurandhar 2 4 Weeks Collections: ట్రేడ్ పండితులు సైతం విస్వయానికి గురయ్యే రేంజ్ లో ‘ధురంధర్’ సిరీస్ బాక్స్ ఆఫీస్ ప్రస్థానం ఎలా కొనసాగిందో మన కళ్లారా చూశాము . అయితే ‘ధురంధర్’ సృష్టించిన బాక్స్ ఆఫీస్ సునామీ తో పోలిస్తే ‘ధురంధర్ 2: ది రివెంజ్'(Dhurandhar 2: The Revenge) సృష్టించిన బాక్స్ ఆఫీస్ సునామీ కాస్త తక్కువే అని చెప్పాలి. మొదటి 11 రోజులు ఈ సినిమాకు కనీవినీ ఎరుగని రేంజ్ బాక్స్ ఆఫీస్ గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ , 12 వ రోజు నుండి మాత్రం వసూళ్లు బాగా డౌన్ అయ్యాయి. వసూళ్లు డౌన్ అయినప్పటికీ, అవి స్టడీ గా ఉండడం తో రీసెంట్ గానే ఈ చిత్రం 1700 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని దాటి, 1800 కోట్ల రూపాయిల గ్రాస్ వైపు అడుగులు వేస్తోంది.
నాలుగు వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి , ప్రపంచవ్యాప్తంగా 1760 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు తెలుస్తోంది. 28 వ రోజున ఈ చిత్రానికి హిందీ నుండి 4 కోట్ల 10 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు రాగా , తెలుగు నుండి 9 లక్షలు , తమిళం నుండి 4 లక్షలు , కన్నడ నుండి 4 లక్షలు నెట్ వసూళ్లు వచ్చాయట. ఓవరాల్ ఇండియా వైడ్ గా 4 కోట్ల 27 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు రాగా, 5 కోట్ల 4 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక ఓవర్సీస్ ప్రాంతం నుండి దాదాపుగా 46 లక్షల రూపాయిలు వచ్చాయని , ఓవరాల్ గా ఈ చిత్రానికి 28 వ రోజున 5 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. వారాల వారీగా ఈ చిత్రానికి ఇండియన్ బాక్స్ ఆఫీస్ నుండి ఎంత నెట్ వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం.
మొదటి వారం 690 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు రాగా, రెండవ వారం లో 271 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా మూడవ వారంలో 120 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు రాగా, నాల్గవ వారంలో 55 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి నాలుగు వారాలకు కలిపి 1137 లక్షల రూపాయల నెట్ వసూళ్లు, 1343 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవర్సీస్ నుండి 418 కోట్ల రూపాయిలు రాగా , ఓవరాల్ గా నాలుగు వారాల వరల్డ్ వైడ్ గ్రాస్ 1761 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ వీకెండ్ తో 1800 కోట్ల మార్కుని దాటబోతుంది. వచ్చే వారం కచ్చితంగా ‘బాహుబలి 2’ ఫుల్ రన్ గ్రాస్ ని దాటేయొచ్చు , కానీ దంగల్ ని దాటడం కష్టమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.