Mahindra Electric Scooter: ఆటోమోబైల్ రంగంలో ఉన్నవారికి Mahindra కంపెనీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఎందుకంటే ఈ కంపెనీ నుంచి అద్భుతమైన కార్లు రిలీజ్ అయి ఇప్పుడు రోడ్లపై తిరుగుతున్నాయి. అయితే ఈ కంపెనీ నుంచి కేవలం ఫోర్ వీలర్ మాత్రమే కాకుండా టూ వీలర్ కూడా వచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్గా ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా రాబోతుందన్న అంచనాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన వార్తలు ఇప్పటికే ఆన్లైన్లో ప్రచారం అవుతుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మహీంద్రా కంపెనీ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ.. త్వరలో ఇది మార్కెట్లోకి వస్తుందని అంటున్నారు. ఒకవేళ ఈ స్కూటర్ మార్కెట్లోకి వస్తే ఎలా ఉంటుందంటే?
Mahindra కంపెనీ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ 2026 అనే స్కూటర్ మార్కెట్లోకి రాబోతున్నట్లు కొన్ని వార్తా సంస్థలు తెలుపుతున్నాయి. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ వేరియంట్ గా వచ్చే అవకాశం ఉంది. ఇందులో లిథియం ఆయాన్ బ్యాటరీని చేర్చనున్నారు. దీనిని ఒక్కసారి చార్జింగ్ చేస్తే 100 నుంచి 150 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. టాప్ స్పీడ్ 70 నుంచి 80 కిలోమీటర్ల వరకు ఉంటుందని అంటున్నారు. ఫాస్టెస్ట్ చార్జి ఎందుకు సపోర్ట్ చేసే ఈ బ్యాటరీతో రోజువారి వినియోగదారులతో పాటు చిన్న చిన్న దూర ప్రయాణాలు కూడా చేయవచ్చని అంటున్నారు. అంతేకాకుండా ఇందులో లేటెస్ట్ టెక్నాలజీ తో కూడిన ఫీచర్స్ ను కూడా అమర్చి అవకాశముంది. కొన్ని అంజనాల ప్రకారం ఈ స్కూటర్లో డిజిటల్ TFT క్లస్టర్ ఉండనుంది. అలాగే మొబైల్ ఛార్జింగ్ కోసం USB కోర్టు ఉండే అవకాశం ఉంది. స్మార్ట్ ఫోన్ తో కనెక్ట్ అయి నావిగేషన్ పనిచేసే అవకాశం ఉంది. జియో పెన్సింగ్ వంటి ఫీచర్లతో నేటి తరం వారికి ఆదర్శనీయంగా ఉండనుంది.
ఇంకా కొత్తగా వచ్చే ఇందులో టెలిస్కోపిక్ ఫ్రంట్, మోనోషాక్ రియర్ వంటివి ఉండడంతో ఎలాంటి వైబ్రేషన్ లేకుండా సాధారణ రోడ్లపై కూడా ప్రయాణం చేయవచ్చని అంటున్నారు. అయితే దీనికి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉండే అవకాశం ఉంది. ఫ్రంటు, బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్లతో పాటు CBS, ABS టెక్నాలజీ ను చేర్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ వేరియంట్ లో Gusto వంటి స్కూటర్లను పరిచయం చేసిన మహీంద్రా ఇప్పుడు కొత్తగా అప్డేట్ చేసిన వెర్షన్ ను మార్కెట్లోకి తీసుకు వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ ఏడాదిలోనే ఈ స్కూటర్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది మార్కెట్లోకి వస్తే రూ.75,000 నుంచి రూ.1.5 లక్షల వరకు ధర ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.