Hero Splendor Electric Bike: మొన్నటివరకు టూ వీలర్స్ లో ఎలక్ట్రిక్ వాహనాలు అంటే స్కూటర్ మోడల్స్ లో మాత్రమే వచ్చాయి. కానీ ఇప్పుడు బైక్స్ కూడా ఎలక్ట్రిక్ వి మార్కెట్లోకి వచ్చి సందడి చేస్తున్నాయి. ప్రముఖ కంపెనీ Hero ఇప్పటికే ఎలక్ట్రిక్ బైక్ ని పరిచయం చేసింది. అయితే లేటెస్ట్ గా ఫాస్టెస్ట్ చార్జింగ్ తో పాటు అత్యధిక మైలేజ్ ఇచ్చే ద్విచక్ర వాహనాన్ని మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇది సామాన్యులకు అందుబాటులో ధర ఉండడంతో పాటు ఆకర్షణీయమైన డిజైన్.. మెరుగైన ఇంజన్ పనితీరును కలిగి ఉండడంతో చాలామంది యూత్ సైతం దీనిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చెబుతున్నారు. అయితే ఈ బైక్ వివరాలు ఎలా ఉన్నాయంటే..
గతంలో ఉన్న పెట్రోల్ వాహనాల్లో.. లీటర్ ఇందరానికి యావరేజ్ గా 60 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చేది. కానీ ఇప్పుడు మార్కెట్లోకి వచ్చిన Hero Electrical Splender అత్యధిక మైలేజ్ ఇచ్చే బైక్ గా నిలుస్తుంది. దీనిని ఒక్కసారి చార్జింగ్ చేస్తే 300 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. అంతేకాకుండా రెండు గంటల లోపు 80 శాతం వరకు చార్జింగ్ అయ్యే అవకాశం ఉంది. ఈ బైక్ లో స్మార్ట్ డిస్ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, పర్యావరణానికి అనుకూలమైన రైడ్ ఉండడంతో పట్టణవాసులకు ఇది చాలా బాగా నచ్చుతుంది. ఇందులో లిథియం అయాన్ బ్యాటరీ ఉండడంతో వీకెండ్ డే లో కూడా దూర ప్రయాణాలు బైక్ గా నిలుస్తుంది. నగరాల్లో బిజీగా ఉండే ట్రాఫిక్ లో నూ సులభంగా వెళ్లగలిగే విధంగా ఇది అనుగుణంగా ఉంటుంది..
ఈ బైక్ లో ఉండే ఎలక్ట్రిక్ బ్రష్ లెస్ హబ్ మోటార్ గరిష్టమైన వేగాన్ని అందిస్తుంది. ఆప్టిమైజ్ చేసిన ఎలక్ట్రిక్ మోటార్ కావడంతో తక్కువ మెయింటెనెన్స్ అవుతుంది. దీంతో ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుంది. ఇందులో రెప్పాన్సివ్ థ్రోటిల్, స్థిరమైన హ్యాండ్లింగ్ ఉండడంతో రోజువారి వినియోగదారులకు కూడా అనుగుణంగా ఉంటుంది. ఈ బైక్ డిజైన్ వాహనదారులను ఆకట్టుకుంటుంది. బలమైన టైర్లు, బలమైన చట్టంతో ఆకర్షణీయమైన వీల్స్ ఉండడంతో చూడడానికి బాగుంటుంది. ఇందులో కామన్ ఫీచర్స్ తో పాటు స్మార్ట్ ఫీచర్స్ కూడా ఉండడం వినియోగదారులకు మరింత సౌలభ్యం చేకూరాలని ఉంది. డిజిటల్ డిస్ప్లే తో పాటు స్మార్ట్ఫోన్ యాప్ ద్వారా వాహన హెల్త్ చెకప్ చేసుకునే సౌకర్యం ఉంది స్మార్ట్ ఎలక్ట్రానిక్స్ పవర్ వినియోగాన్ని ఆప్టిమైజ్ చేయడంతో బ్యాటరీ జీవితకాలం పెరుగుతుంది. అలాగే ఈ బైక్ తో మార్కెట్లో పొల్యూషన్ లేకుండా మారే అవకాశం ఉంది. ఇప్పటికే వచ్చిన ఎలక్ట్రిక్ బైక్ రూ.73,000 తో విక్రయించారు. అయితే లేటెస్ట్ గా ఉండే ఈ బైక్ కూడా ఇంచుమించు అదే రేంజ్ లో ఉండే అవకాశం ఉందని అంటున్నారు.