Food Business: ఉద్యోగం కంటే వ్యాపారం చేయాలని చాలామంది ఆసక్తి చూపుతూ ఉంటారు. సొంత వ్యాపారం అయితే పూర్తిగా ప్రతిభను ఉపయోగించి ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆశిస్తారు. ఇందులో భాగంగా తమకు ఉన్న బడ్జెట్లో వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటారు. అయితే ప్రస్తుత కాలంలో ఫుడ్ బిజినెస్ ఎక్కువగా డిమాండ్ ఉంది. కొత్త కొత్త రుచులు మార్కెట్లోకి వస్తే వినియోగదారులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా టిఫిన్ సెంటర్ నుంచి రెస్టారెంట్ వరకు ఎలాంటి ఫుడ్ బిజినెస్ అయిన ఎంతో కొంత లాభం ఉంటుందని కొందరు చెబుతున్న మాట. అయితే ఫుడ్ బిజినెస్ చేయాలంటే లైసెన్సును పొంది ఉండాలి. ఈ లైసెన్సులు పొందడానికి పెద్దగా ప్రయాస పడాల్సిన అవసరం లేదు. కేవలం రూ.100 తోనే లైసెన్సు తీసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
టిఫిన్ సెంటర్ నుంచి రెస్టారెంట్ వరకు ఏదైనా ఆహారానికి సంబంధించిన వ్యాపారం నిర్వహించాలంటే ఫుడ్ సేఫ్టీ అధికారుల నుంచి కచ్చితంగా లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ లైసెన్సు పొందిన వారు మాత్రమే వ్యాపారం చేయడానికి అర్హులు. అయితే వ్యాపారం ప్రారంభించే ముందు ఈ లైసెన్స్ తీసుకోవాలని అనుకునేవారు కొంత ఆందోళన చెందుతారు. ఎందుకంటే కొంతమంది చెబుతున్న ప్రకారం ఈ లైసెన్స్ తీసుకోవడానికి రూ. రెండు నుంచి 3000 అవుతుందని అంటుంటారు. అంతేకాకుండా దరఖాస్తు చేసుకున్న ఎన్నో రోజులకు గాని అనుమతి రాదు అనే భావనే ఉంది. కానీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అంతా ఆన్లైన్ లోనే అనుమతి తీసుకునే అవకాశం ఏర్పడింది. అలాగే ఫుడ్ లైసెన్స్ కూడా ఆన్లైన్లోనే తక్కువ మొత్తం చెల్లించి తీసుకోవచ్చు.
ఆన్లైన్లో ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలంటే ముందుగా Google Chrome లోకి వెళ్ళాలి. ఇక్కడ Focos fssai అని టైప్ చేయాలి. ఇందులో వచ్చిన మొదటి వెబ్సైట్ను ఓపెన్ చేయాలి. ఇక్కడ ఓపెన్ చేయగానే ముందుగా ఏ రాష్ట్రం వారో సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈ ఫామ్ లో అవసరమైన వివరాలను అందించాలి. ఆ తర్వాత కేవలం రూ.100 చెల్లిస్తే ఫుడ్ లైసెన్స్ కు అప్లై అవుతుంది. ఇలా అప్లై చేసిన వారం రోజుల్లో అనుమతిని ఇస్తున్నట్లు సాఫ్ట్ కాపీ మెయిల్ కు వస్తుంది. ఈ విధంగా ఇంట్లోనే ఫుడ్ లైసెన్స్ పొంది వ్యాపారాన్ని పొందవచ్చు.
ప్రస్తుత కాలంలో చాలామంది ఇంట్లోనే ఆహార పదార్థాలు బండి జోమాటో, స్విగ్గి ద్వారా సరఫరా చేస్తున్నారు ఇలాంటి వారు ఇంట్లోనే ఫుడ్ లైసెన్స్ తీసుకొని వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఆహారానికి సంబంధించిన ఎటువంటి వారైనా ఈ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి.