Manchu Lakshmi Strong Warning: మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మంచు లక్ష్మి(Manchu Lakshmi) కి టాలీవుడ్ లో క్లోజ్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. హీరోలలో అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి వారు ఈమెకు అత్యంత సన్నిహితులు. ఇక హీరోయిన్స్ లో అయితే ప్రగ్యా జైస్వాల్ , రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) వంటి వారు ఈమెకు బాగా క్లోజ్. వీళ్ళిద్దరితో పాటు బాలీవుడ్ లో కూడా కొంతమంది ప్రముఖులు ఈమెకు చాలా క్లోజ్ గా ఉంటూ ఉంటారు. కానీ అందరిలోకి ఈమెకు సోల్ మేట్ గా రకుల్ ప్రీత్ సింగ్ ఉంటుంది. వీళ్లిద్దరు కలిసి ముంబై లో ప్రైవేట్ పార్టీలకు వెళ్లడం, కలిసి తిరగడం, వాటికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియా లో ఇది వరకు మనం చాలానే చూసాము. అయితే రీసెంట్ గా మంచు లక్ష్మి రకుల్ ప్రీత్ సింగ్ గురించి ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
ఆమె మాట్లాడుతూ ‘ఈమధ్య కాలంలో మా ఇద్దరి జీవితాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. నేను హైదరాబాద్ నుండి ముంబై కి మకాం మార్చాను. ఇక రకుల్ జాకీ ని పెళ్లి చేసుకొని స్థిరపడింది. దాంపత్య జీవితాన్ని సంపూర్ణంగా ఎంజాయ్ చేస్తోంది. పెళ్లి తర్వాత రకుల్ మారిన విధానం చూసి నేను షాక్ కి గురయ్యాను. ఏ చిన్న విషయమైనా రకుల్ తన భర్త జాకీ కి చెప్పకుండా చేయదు. నేను ఎప్పుడైనా ఏదైనా అవసరం వచ్చి అడిగినా, ఎక్కడికైనా వెళదామని అడిగినా, జాకీ కి చెప్పి చెప్తాను అంటుంది. ఇది కేవలం రకుల్ విషయం లోనే కాదు, కొత్తగా పెళ్ళైన ఏ జంటలో అయినా ఇలాంటి మార్పులు రావడం సహజం. కానీ నేను రకుల్ విషయం లో మరో ఏడాది వరకు సహనం గా ఎదురు చూస్తాను. అప్పటికీ కూడా ఆమె ఇలాగే ఉంటే ఊరుకునేది లేదు, దండిస్తాను. వార్నింగ్ కూడా బలంగానే ఇస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి.
ఒకప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ సౌత్ లోనే మోస్ట్ బిజీ హీరోయిన్ గా చలామణి అయిన రకుల్ ప్రీత్ సింగ్ ఈమధ్య కాలంలో బాగా తగ్గిపోయింది. రీసెంట్ గా ఈమె చేసిన ప్రతీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. ప్రస్తుతం ఈమె చేతుల్లో బాలీవుడ్ సినిమాలే ఉన్నాయి. సౌత్ లో ఒక్క సినిమా కూడా ఈమె చేతుల్లో లేదు. బాలీవుడ్ లో ఈమె చేతుల్లో ఉన్న అతి పెద్ద ప్రాజెక్ట్ ‘రామాయణం’. ఇందులో ఆమె సూర్పనక్క క్యారక్టర్ చేస్తోంది. షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.