K Ramp Movie: ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడి గా మంచి గుర్తింపును సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం ప్రస్తుతం కే ర్యాంప్ అనే సినిమా చేశాడు. గత సంవత్సరం క సినిమాతో అందరిని మెప్పించిన ఆయన ఇప్పుడు ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా అనుకున్న రేంజ్ లో లేదని సినిమాలో చాలా వరకు మైనస్ లు ఉన్నాయాని దానివల్ల సినిమా యావరేజ్ గా మాత్రమే ఆడుతోంది తప్ప సూపర్ సక్సెస్ ని సాధించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా కిరణ్ అబ్బవరం లాంటి నటుడు వరుసగా బ్లాక్ బస్టర్లను సాధిస్తాడనుకుంటే ఆయన మాత్రం చాలావరకు డీలా పడిపోతున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఇప్పటివరకు కిరణ్ అబ్బవరం చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు ఆయన నుంచి రాబోతున్న సినిమాలు మరొకెత్తుగా మారబోతున్నాయి. కిరణ్ ఈ మూవీని అనవసరంగా చేశాడని తన అభిమానులు సైతం ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమాని మొదట వేరే హీరోతో చేయాలనుకున్నారట.
కానీ ఆ హీరో కి కథ నచ్చకపోవడంతో ఆయన ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరు అంటే విజయ్ దేవరకొండ తమ్ముడైన ఆనంద్ దేవరకొండ కావడం విశేషం… ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించాయి.
బేబీ సినిమాతో స్టార్ హీరోగా మారిపోయాడు. మరి అలాంటి హీరో ఇప్పుడు ఈ సినిమాను రిజెక్ట్ చేసి చాలా మంచి పని చేశాడు అంటూ ఆయన మీద కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాల్ని తెలియజేస్తుండటం విశేషం…
ఒక సారి మంచి క్రేజ్ వచ్చిన హీరోలు వరుసగా ఇష్టం వచ్చిన సినిమాలను చేస్తూ నష్టాన్ని మూట గట్టుకుంటున్నారు. అలాకాకుండా మంచి సినిమాలను చేస్తూ వాళ్ళకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను సంపాదించుకుంటే మాత్రం వాళ్ళు స్టార్ హీరోలుగా ఎదుగుతారు…