Oil Reusing: మనం తినే ఆహారంలోనే ఆరోగ్యం ఉంటుంది. కానీ చాలామంది రుచికరమైన ఆహారము అంటూ బయట దొరికే చిరుతిళ్ళు ఎక్కువగా తింటున్నారు. బయట లభించే ఆహార పదార్థాలు ఒకసారి వాడిన నూనెను తిరిగి వాడుతూ ఉంటారు. ఇలాంటి నూనెలో వేయించిన ఆహార పదార్థాలు తినడం వల్ల శరీరంలో అనేక ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఒకసారి వేడి చేసిన నూనెను మరోసారి ఉపయోగించడం వల్ల అందులో రసాయనిక నిర్మాణం మారిపోయి హానికరమైన నూనెగా తయారవుతుంది. ఇందులో వేసిన పదార్థాలు కూడా ప్రమాదకరంగా ఉంటాయి. అయితే ఇలా రియూజ్ చేసిన నూనెతో ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం..
ఒకసారి వాడిన నూనెను మరోసారి వాడడం వల్ల అందులోని కొవ్వులు రసాయనికంగా మారిపోయి ట్రాన్స్ ఫ్యాట్స్ గా తయారవుతాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ ను పెంచి గుండె జబ్బులకు కారణం అవుతాయి. అలాగే నూనె వేడి చేసినప్పుడు ఆక్సీకరణం జరిగి ఫ్రీ రాడికల్స్ రిలీజ్ అవుతాయి. ఇవి ఆరోగ్యకరమైన కణాలను దెబ్బతీసి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. పదేపదే నువ్వు నన్ను వేడి చేయడం వల్ల ఆక్రిలమైడ్, ఆల్దిహైడ్స్ వంటి విష రసాయనాలు ఏర్పడతాయి. ఇవి శ్వాసకోస సమస్యలకు దారితీస్తాయి.
ఒకసారి వాడిన నూనె మరోసారి వాడిన నూనెలో ఆహార పదార్థాలను వేయించడం వల్ల అవి ఎక్కువ కొవ్వులు కలిగి ఉంటాయి. దీంతో వీటిని తినడం వల్ల ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు నాశనం అవుతాయి. అలాగే విటమిన్ ఈ, విటమిన్ ఏ వంటి ఆరోగ్యకరమైన పోషకాలు లేకుండా పోతాయి. ఇలాంటి నూనెలో వేడి చేసిన పదార్థాలు తాత్కాలికంగా రుచికరంగానే ఉంటాయి. కానీ వీటిని తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.. వీటిలో గుండెపోటు, మధుమేహం, లివర్ సమస్యలు, అల్జీమర్స్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. రియోజ్ చేసిన నూనెలో వేయించిన పదార్థాలు కమ్మదనాన్ని కోల్పోతాయి. అయితే టేస్ట్ రావడానికి వీరు రకరకాల పదార్థాలను ఉపయోగిస్తారు. వాటిని తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు ఉంటాయి.
అందువల్ల ఇంట్లోనూ ఒకసారి వాడిన నూనెను తిరిగి వాడకుండా ఉండే ప్రయత్నం చేయాలి. కొందరు ప్రత్యేక పదార్థాలు డీప్ ఫ్రై చేసినప్పుడు తిరిగి కూరల్లో వాడడానికి ఉపయోగిస్తారు. అయితే అలా కాకుండా హోమ్ ఫుడ్స్ వంటివి తయారు చేసుకున్నప్పుడు మిగిలిన నూనెను తాలింపుకు లేదా కూరల్లో ఉపయోగించుకోవచ్చు. అయితే ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంచకుండా వెంటనే వాడేయాలి. అలా వాడకుండా చాలా రోజుల వరకు నిల్వ వస్తే వాటి రుచి కోల్పోతుంది. అంతేకాకుండా అందులో ప్రమాదకరమైన రసాయనాలు తయారవుతాయి. బయట మాత్రం రియూజ్ చేసి తయారు చేసే పదార్థాల జోలికి వెళ్లకూడదు.