Happiest Country: ఫిన్లాండ్ అత్యంత చిన్న దేశం. కానీ అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాలో ప్రథమ స్థానంలో నిలుస్తోంది. దీంతో వచ్చిన చిక్కేంటంటే ఇక్కడ బద్దకస్తులు కూడా ఎక్కువేనట. పని చేసే వారి సంఖ్య తక్కువ ఉంటే తిని కూర్చునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దీంతో దేశం ముందుకు వెళ్లలేకపోతోంది. ఇతర దేశస్తులు వచ్చి ఇక్కడ పని చేస్తే సాదరంగా ఆహ్వానాలు పలుకుతోంది. ప్రస్తుత జనాభాలో 5.2 మిలియన్ల ప్రజలు మాత్రమే పని చేస్తున్నారని తెలుస్తోంది. మిగతా వారు పని చేయకుండా ఉంటున్నారని సమాచారం.

పనులు సజావుగా సాగాలంటే పని చేసేవారు కావాలి. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం 2030 నాటికి వృద్ధుల సంఖ్య 47.5 శాతం పెరగొచ్చని అంచనా వేస్తోంది. దీంతో ఫిన్లాండ్ లో పనులు ముందుకు సాగడం లేదు. ప్రభుత్వం కూడా దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా ఏడాదికి కనీసం 20 నుంచి 30 వేల మంది ఫిన్లాండ్ వచ్చేలా ఆహ్వానాలు పలుకుతోంది.
Also Read: నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా.. వీటిని తాగితే చాలు ప్రశాంతంగా నిద్ర పోవచ్చు!
విదేశీయులను తమ సంస్థల్లో నియమించుకుని వారితో పనులు చేయించుకునేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇతర దేశాల వారు ఇక్కడ స్థిరపడేందుకు నిబంధనలు సరళతరం చేస్తోంది. ఫిన్లాండ్ పౌరసత్వం అందజేస్తోంది. ఈ క్రమంలో పశ్చిమ ఐరోపా దేశాలు కూడా తమ దేశాలకు ఇతర దేశాల వారిని ఆహ్వానిస్తున్నాయి. దీంతో ఫిన్లాండ్ వచ్చే వారి సంఖ్య తగ్గిపోతోందని తెలుస్తోంది.
Also Read: కరోనాపై ఇంత చెప్పి.. ఈ డీహెచ్ ఇదేం కథ?
ఐక్యరాజ్యసమితి నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసి ప్రపంచ దేశాల్లో అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాలను ప్రతి సంవత్సరం నిర్ణయిస్తుంటారు. ఈ జాబితాలో ఫిన్లాండ్ దేశం నాలుగేళ్లుగా ప్రథమ స్థానంలో నిలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 149 దేశాల్లో సర్వే నిర్వహించి దాని ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. స్వతంత్రం, లంచగొండితనం తదితర విషయాలు పరిగణనలోకి తీసుకుని చివరకు నిర్ణయం ప్రకటిచడం తెలిసిందే.