https://oktelugu.com/

2021 లో సూపర్ హిట్ టాక్ వచ్చిన లాభాలు సాధించని సినిమాలు ఇవే..!

సాధారణంగా పాజిటివ్ టాక్ సంపాదించుకున్న సినిమాలు సులభంగా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే గతేడాది, ఈ ఏడాది రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడంతో ప్రేక్షకులు ఫ్యామిలీతో కలిసి సినిమాలను చూడటానికి ఎక్కువగా ఇష్టపడటం లేదు. మరోవైపు ఏపీలో టికెట్ రేట్లను ప్రభుత్వం భారీగా తగ్గించడంతో కలెక్షన్లపై ఆ ప్రభావం పడుతోంది. భారీ బడ్జెట్ సినిమాలకు సైతం ఏపీలో తక్కువ మొత్తంలో కలెక్షన్లు వస్తున్నాయి. Also read: తెలంగాణలో సినిమా టికెట్ ధరలపై […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 25, 2021 / 10:03 AM IST
    Follow us on

    సాధారణంగా పాజిటివ్ టాక్ సంపాదించుకున్న సినిమాలు సులభంగా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే గతేడాది, ఈ ఏడాది రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడంతో ప్రేక్షకులు ఫ్యామిలీతో కలిసి సినిమాలను చూడటానికి ఎక్కువగా ఇష్టపడటం లేదు.

    మరోవైపు ఏపీలో టికెట్ రేట్లను ప్రభుత్వం భారీగా తగ్గించడంతో కలెక్షన్లపై ఆ ప్రభావం పడుతోంది. భారీ బడ్జెట్ సినిమాలకు సైతం ఏపీలో తక్కువ మొత్తంలో కలెక్షన్లు వస్తున్నాయి.

    Also read: తెలంగాణలో సినిమా టికెట్ ధరలపై కొత్త జీవో.. కేసీఆర్​కు థ్యాంక్స్ చెప్తూ చిరు ట్వీట్​

    ఈ ఏడాది పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని బ్రేక్ ఈవెన్ సాధించని సినిమాలు మొత్తం 12 ఉన్నాయి. పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ వకీల్ సాబ్ కు 89 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా 85 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమా వల్ల బయ్యర్లకు స్వల్పంగా నష్టాలు వచ్చాయి. ఈ నెల 17వ తేదీన విడుదలైన పుష్ప ది రైజ్ బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 45 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించాలి.

    ప్రస్తుత పరిస్థితుల్లో మరో 45 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించి పుష్ప ది రైజ్ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితులు లేవు. వీక్ డేస్ లో ఈ సినిమాకు ఎక్కువగా కలెక్షన్లు రావడం లేదు. సుమంత్ కపటదారి సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్లు మాత్రం ఎక్కువగా రాలేదు. నితిన్ చెక్ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినా కమర్షియల్ గా ఈ సినిమా సక్సెస్ కాలేదు. అక్షర అనే చిన్న సినిమా కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా నిలిచింది.

    సందీప్ కిషన్ ఏ1 ఎక్స్ ప్రెస్ ఒక వర్గం ప్రేక్షకులను ఆకట్టుకున్నా ఈ సినిమాకు కలెక్షన్లు మాత్రం రాలేదు. దిల్ రాజు నిర్మించిన షాదీ ముబారక్ సినిమాకు క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చినా కలెక్షన్లు మాత్రం రాలేదు. శర్వానంద్ శ్రీకారం, నితిన్ రంగ్ దే, రానా అరణ్య, నాగార్జున వైల్డ్ డాగ్ సినిమాలు కూడా బ్రేక్ ఈవెన్ కాలేదు. లవ్ స్టోరీ సినిమాకు హిట్ టాక్ వచ్చినా పలు ఏరియాల్లో ఈ సినిమాకు ఎక్కువగా కలెక్షన్లు రాలేదు.

    Also Read: నార్త్​లో నాదే హవా అంటున్న పుష్పరాజ్​.. అస్సలు తగ్గట్లేదుగా!