https://oktelugu.com/

Radhe Shyam Trailer: రికార్డుల మోత మోగిస్తోన్న ‘రాధేశ్యామ్’ ట్రైలర్​.. ఆర్​ఆర్​ఆర్​నే పక్కకు నెట్టేసిందిగా!

Radhe Shyam Trailer: బాహుబలి సినిమాతో పాన్​ఇండియా స్టార్​గా గుర్తింపు పొందిన రెబల్​స్టార్ ప్రభాస్​.. ఆ తర్వాత అన్నీ వరుసగా అదే తరహా చిత్రాల్లో నటిస్తూ కెరీర్​లో ముందుకు దూసుకెళ్లిపోతున్నారు. ఈ క్రమంలోనే రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా రాధేశ్యామ్​. పీరియాడికల్ లవ్​ స్టోరీ నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం ప్రేక్షకులతో పాటు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్​గా నటిస్తోంది. కాగా, ఇప్పటికే విడుదలైన టీజర్​, […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 25, 2021 / 09:50 AM IST
    Follow us on

    Radhe Shyam Trailer: బాహుబలి సినిమాతో పాన్​ఇండియా స్టార్​గా గుర్తింపు పొందిన రెబల్​స్టార్ ప్రభాస్​.. ఆ తర్వాత అన్నీ వరుసగా అదే తరహా చిత్రాల్లో నటిస్తూ కెరీర్​లో ముందుకు దూసుకెళ్లిపోతున్నారు. ఈ క్రమంలోనే రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా రాధేశ్యామ్​. పీరియాడికల్ లవ్​ స్టోరీ నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం ప్రేక్షకులతో పాటు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్​గా నటిస్తోంది. కాగా, ఇప్పటికే విడుదలైన టీజర్​, పాటలు నెట్టింట ట్రెండింగ్​ను సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ  సినిమా విడుదల కానుండటంతో ప్రమోషన్స్​లో ఫుల్ జోరు పెంచారు మేకర్స్.

    ఈ క్రమంలోనే డిసెంబరు 23న రామోజీ ఫిల్మ్​ సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్​ నిర్వహించి ట్రైలర్​ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే మిలియన్ల వ్యూస్ సాధించి.. టాలీవుడ్​, సౌత్ ఇండియాలో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న ట్రైలర్​గా రికార్డు నెలకొల్పింది. కాగా, 24 గంటల్లోనే 23.2 మిలియన్ల వ్యూస్​తో దూసుకెళ్లిపోతోంది.

    మరోవైపు ఓవరాల్​గా 5.9 లక్షల లైకులతో నాలుగో స్థానంలో నిలిచింది. ఇక అన్ని భాషల్లో కలిపి ఈ ట్రైలర్​కు 57.52 మిలియన్ల వ్యూస్​ రాగా.. 1.43 మిలియన్ల లైక్స్ వచ్చాయి. ఆశ్చర్యం ఏంటంటే.. ఎన్నో అంచనాల మధ్య వస్తోన్న ఆర్​ఆర్ఆర్​ కు 24 గంట్లోల 51.12 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ రికార్డును కూడా బ్దలు కొట్టి రాధేశ్యామ్ నిలవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మరి ఈ సినిమా ఏ రేంజ్​లో ఉండనుందో తెలియాలంటే థియేటర్​లో విడుదలయ్యేంత వరకు వేచి చూడాల్సిందే.