Epstein files Mira Nair: అమెరికాలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఎప్ స్టీన్ ఫైల్స్ సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. ఈ వ్యవహారంలో పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు. వారంతా కార్పొరేట్ సామ్రాజ్యాలను శాసిస్తున్న వ్యక్తులు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి మొదలుపెడితే మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ వరకు ఈ వ్యవహారంలో పాలుపంచుకున్నారని అభియోగాలు నమోదయ్యాయి.
ఇప్పటికే బిల్ గేట్స్ పై నమోదైన అభియోగాలు ప్రపంచప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. పైగా ఆయన రష్యన్ యువతులతో ఇష్టానుసారంగా గడిపారని.. చివరికి సుఖ వ్యాధుల బారిన కూడా పడ్డారని ఎప్ స్టీన్ ఫైల్స్ ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే కీలకమైన మెయిల్స్ లో బిల్ గేట్స్ ప్రస్తావన అనేక సందర్భాలలో వచ్చింది. ఆయన విలాసవంతమైన జీవితాన్ని గడిపారని.. అందువల్లే సుఖ వ్యాధుల బారిన పడ్డారని.. చివరికి తనకు వచ్చిన వ్యాధిని కప్పిపుచ్చుకోవడానికి తన మాజీ భార్యకు శక్తివంతమైన యాంటీబయాటిక్స్ ఇవ్వడానికి ప్రయత్నించారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఎప్ స్టీన్ ఫైల్స్ లో ఇప్పటివరకు పురుషుల పేర్లు మాత్రమే బయటపడ్డాయి. ఇందులో అమెరికాలో బాగా పేరుపొందిన వ్యక్తుల వివరాలు మాత్రమే బయటికి వచ్చాయి. అయితే ఈ వ్యవహారంలో తొలిసారిగా ఒక భారతీయురాలి పేరు తెరపైకి వచ్చింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం నమోదయింది.
ఎప్ స్టీన్ ఫైల్స్ లో భారత సంతతికి చెందిన ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్ పేరు తెరపైకి రావడం సంచలనం కలిగిస్తోంది. 2009లో ఆమె అమేలీయ అనే సినిమా తీశారు. ఆ సినిమా తర్వాత బూతు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాక్స్ వెల్ ఇంట్లో జరిగిన పార్టీకి ఆమె హాజరయ్యారు. ఆ ఈవెంట్లో అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జెఫ్ బెజోస్ కూడా పాల్గొన్నారు. ఎప్ స్టీన్ ఫైల్స్ లో మెయిల్ ద్వారా ఈ విషయాలు బయటపడ్డాయి. అంతేకాదు న్యూయార్క్ మేయర్ మామ్దానికి మీరా నాయర్ తల్లి. దీంతో ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితేఎప్ స్టీన్ ఫైల్స్ మెయిల్ ద్వారా తన తల్లి పేరు బయటపడడంతో ఇంతవరకు న్యూయార్క్ మేయర్ స్పందించలేదు.