New York City Mayor: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ఎన్నికై ఏడాది కూడా కాలేదు. ఇప్పటికే ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. ప్రజలకు విసుగు తెప్పిస్తున్నాయి. మరోవైపు అమెరికా షట్‌డౌన్ అంచున ఉంది. ఇంకోవైపు ట్రంప్ పాలన తీరుపై అమెరికన్లు ఇటీవలే రోడ్డెక్కి నిరసన తెలిపారు. నో కింగ్ పేరుతో ఉద్యమం సాగింది. ఇలాంటి తరుణంలో న్యూయార్క్ స్థానిక ఎన్నికల్లో అక్కడి ట్రజలు ట్రంప్‌కు షాక్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో మేయర్‌గా డెమోట్రకిట్ పార్టీ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీ గెలిపించారు. 34 ఏళ్ల మామ్దానీ భారత్–ఉగాండా జాతీయుడు న్యూయార్క్‌లో తొలిసారి ముస్లిం సమాజానికి చెందిన వ్యక్తి మేయర్‌గా ఎన్నికయ్యాడు. అత్యంత పిన్నవయస్కుడైన మేయర్‌గా కూడా రికార్డు సృష్టించాడు.
సోషలిస్టు భావజాలం..
మమ్దానీ సోషలిస్ట్ భావజాలం ఉన్న క్యూ ఇన్‌స్లో అసెంబ్లీ సభ్యుడిగా ఉండగా తాజాగా న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమో, రిపబ్లికన్ కర్టిస్ స్లీవాను ఓడించాడు. ఈ ఎన్నికలు జాతీయ రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మమ్దానీని ‘కమ్యూనిస్ట్‘ అని తీవ్రంగా విమర్శిస్తూ, అతను గెలిస్తే ఫెడరల్ నిధులు కోతలు విధించే ప్రమాదమని హెచ్చరించాడు. ట్రంప్ క్యూమోకు మద్దతు తెలిపాడు. ఇక మామ్దానీ ఉచిత సిటీ బస్సు ప్రయాణం, అద్దెల స్థిరీకరణ, యూనివర్సల్ చైల్డ్ క్యూర్, 2030 నాటికి కనీస వేతనాల పెంపు, కార్పొరేట్, సంపన్నులపై పన్ను పెంచి జీవన వ్యయాలను తగ్గించడం వంటి హామీలతో న్యూయార్క్ వాసులను ఆకట్టుకున్నారు. యువ ఓటర్లు, మొదటిసారి ఓటు వేసినవారు మామ్దానీకి మద్దతుగా నిలిచారు.
సినీ దర్శకుడి కుమారుడు..
మమ్దానీ భారతీయ సినీ దర్శకుడు మీరానాయర్ కుమారుడిగా కూడా ప్రత్యేకత కలిగి ఉన్నాడు. ఆయన రాజకీయ వైఖరి, ప్రగతిశీల విధానాలు నగర ప్రజలకు ఆశాజనకం కాబట్టి, అతడి విజయం రాజకీయ, సామాజిక, ఆర్ధిక రంగాలలో కనెక్ట్ అయిన ప్రాంతాలకి స్ఫూర్తిగా నిలుస్తుంది. ఈ విజయం న్యూయార్క్ నగరంలో డెమోక్రటిక్ పార్టీకి, ప్రత్యేకంగా యువ ప్రతినిధుల ప్రాధాన్యత పెరుగుతోందని సూచిస్తుంది. అలాగే, గతంలో ఉన్న కౌంటర్‌పార్ట్‌లతో పోలిస్తే మమ్దానీ కొత్త శక్తిని ప్రతిబింబించారు.