Donald Trump Tariff Warning: అగ్రరాజ్యం అమెరికాకు రెండోసారి అధ్యక్షుడు అయ్యాక డొనాల్ ట్రంప్ తన ఏడాది పాలన పూర్తి చేసుకున్నాడు. ఈ ఏడాది అంతా ఆయన ప్రపంచ దేశాలపై టారిఫ్‌లు విధించడానికే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. 5 శాతం నుంచి 150 శాతం వరకు టారిఫ్‌లు విధించారు. మిత్రులు, శత్రువు అని లేకుండా అన్ని దేశాలపై టారిఫ్‌లు వేసి ప్రపంచ వాణిజ్య యుద్ధానికి తెరతీశారు. అయితే ఈ టారిఫ్‌ల చట‍్టబద్ధతపై భారత సంతతికి చెందిన ఓ వ్యాపారి సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. మరో భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి వాదించాడు. చివరకు టారిఫ్‌లు చెల్లవని, చట్టబద్ధత లేదని కోర్టు కొట్టేసింది. దీంతో ట్రంప్‌కు షాక్ అగిలింది. అయినా ట్రంప్ వెనక్కి తగ్గకుండా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేశిస్తున్నారు. తీర్పు వచ్చిన కొన్ని గంటల్లోనే అన్ని దేశాలపై 18 శాతం టారిఫ్‌లు అమలులో ఉంటాయని ప్రకటించారు.
ప్రపంచ దేశాలకు వార్నింగ్..
ఇదిలా ఉంటే.. డొనాల్డ్ ట్రంప్ అమెరికా సుప్రీంకోర్టు తీర్పును అడ్డుకుని తమతో గేమ్స్ ఆడాలని చూస్తే తర్వాత తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. దశాబ్దాలుగా అమెరికాపై భారీ టారిఫ్‌లు విధించి లాభాలు ఆర్జించిన దేశాలు సుప్రీం తీర్పును సాకుగా చూపి ఆటలాడాలని చూస్తున్నాయని తన సొంత సోషల్ మీడియా ట్రూత్‌లో పోస్టు చేశారు. అదే జరిగితే గతంలో కంటే ఎక్కువ శాతం టారిఫ్‌లు వేస్తానని స్పష్టం చేశాడు.
టారిఫ్ విధాన వెనుక కారణాలు
ట్రంప్ విదేశీ దేశాలు అమెరికా వ్యాపార విధానాలను వ్యతిరేకిస్తే ఆర్థిక ఒత్తిడి పెంచుతానని సూచించాడు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఈయూ వాణిజ్య ఒప్పందాన్ని ఆపేసిన చర్యలు ఈ హెచ్చరికకు ముఖ్య కారణం. దీని ద్వారా అమెరికా ఆర్థిక ఆధిపత్యాన్ని బలోపేతం చేయాలని ట్రంప్ భావిస్తున్నారు. అందుకే తాజా హెచ్చరికలు చేశారు. గతంలో కూడా ట్రంప్ టారిఫ్‌లను ఆయుధంగా ఉపయోగించి చైనా, యూరోపియన్ దేశాలతో వాణిజ్య యుద్ధాలు చేశాడు. ప్రస్తుతం గేమ్స్ బాయ్‌కాట్‌లకు టారిఫ్‌లతో ప్రతీకారం తీర్చుకోవాలనే వ్యూహం కనిపిస్తోంది.
జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలు బాయ్‌కాట్ చర్చలు జరుపుతున్నాయి, దీనిపై ట్రంప్ తక్షణ టారిఫ్‌లు పెంచుతానని చెప్పాడు. ఫలితంగా అంతర్జాతీయంగా రాజకీయ, ఆర్థిక ఒత్తిడులకు గురవుతాయి. ఈ విధంగా ట్రంప్ విదేశీ పాలసీలో అమెరికా ప్రయోజనాలను కాపాడుకుంటున్నాడు.