https://oktelugu.com/

Ranjani Srinivasan: అమెరికాలో భారతీయ విద్యార్థిని వీసా రద్దు.. కారణం ఇదే..

అమెరికా(America)లో ఆ దేశ నిర్ణయాలను ఉల్లంఘించేవారిపై ట్రంప్‌ సర్కార్‌(Trump government) ఉక్కుపాదంతో అణచివేస్తోంది. ప్రజాస్వామ్యంలో మాట్లాడే, నిరసన తెలిపే హక్కు ప్రతీ పౌరుడికి ఉంటుంది.

Written By: , Updated On : March 15, 2025 / 01:42 PM IST
Ranjani Srinivasan

Ranjani Srinivasan

Follow us on

Ranjani Srinivasan: అమెరికాలో ట్రంప్‌ 2.0 పాలన మొదలయ్యాక.. వలసవాదులపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే అక్రమ వలసల పేరుతో వేల మందిని స్వదేశాలకు పంపించారు. కొందరిని అరెస్టు చేసి జైల్లో పెట్టారు. భారత దేశానికి మూడు విమానాల్లో వందల మందిని పంపించారు. తాజాగా భారతీయురాలి వీసా రద్దు చేశారు.

Also Read: కోడిగుడ్లు కావాలి.. సాయం చేయండి ప్లీజ్‌.. యాచిస్తున్న అగ్రరాజ్యం!

అమెరికా(America)లో ఆ దేశ నిర్ణయాలను ఉల్లంఘించేవారిపై ట్రంప్‌ సర్కార్‌(Trump government) ఉక్కుపాదంతో అణచివేస్తోంది. ప్రజాస్వామ్యంలో మాట్లాడే, నిరసన తెలిపే హక్కు ప్రతీ పౌరుడికి ఉంటుంది. కానీ, డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడు అయ్యాక వాటని కూడా హరిస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణ భారతీయ విద్యార్థిని రంజనీ శ్రీనివాసన్‌ వీసా రద్దు చేయడమే నిరద్శనం.

ఎందుకు రద్దు చేశారంటే..
రంజనీ శ్రీనివాస్‌(Rajnani Srinivasan). పాలస్తీనియన్లకు మద్దతుగా నిరసనల్లో పాల్గొన్నారు. హమాస్‌కు మద్దతు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమె వీసాను రద్దు చేశారు. రంజనీ శ్రీనివాసన్‌ కొలంబియా విశ్వవిద్యాలయంలో డాక్టరల్‌ విద్యార్థినిగా ఎఫ్‌–1 విద్యార్థి వీసాపై అమెరికాలో ఉంటోంది. ఇటీవల జరిగిన పాలస్తీనా అనుకూల నిరసనల్లో ఆమె పాల్గొన్నట్లు అమెరికా అధికారులు గుర్తించారు. దీంతో యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ (DHS) ఆమె వీసాను మార్చి 5, 2025న రద్దు చేసింది. DHS సెక్రటరీ క్రిస్టీ నోయెమ్‌(Cristi Noyem) ఈ విషయంపై ప్రకటన విడుదల చేస్తూ, అమెరికాలో చదువుకోవడానికి వీసా మంజూరు చేసినప్పటికీ, ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇస్తే వీసాలను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. రంజనీ తన వీసా రద్దు తర్వాత CBP హోమ్‌ యాప్‌ ద్వారా స్వచ్ఛందంగా మార్చి 11, 2025న అమెరికాను విడిచి వెళ్లినట్లు తెలిపారు. ఈ సంఘటన అమెరికన్‌ క్యాంపస్‌లలో పాలస్తీనా మద్దతు నిరసనలతో సంబంధం ఉన్న విదేశీ విద్యార్థులపై కఠిన చర్యల్లో భాగంగా చూడవచ్చు.

 

Also Read:  ప్రపంచంలోనే గొప్ప ప్రదేశాలు.. భారత్‌ నుంచి రెండు హోటళ్లకు చోటు..